'నా నువ్వే' - ల‌వ్వ‌బుల్‌ అండ్ రొమాంటిక్!

Thu 17th May 2018 11:02 PM
naa nuvve,trailer release,kalyan ram,tamanna,mahesh koneru,jayendra  'నా నువ్వే' - ల‌వ్వ‌బుల్‌ అండ్ రొమాంటిక్!
Naa Nuvve Trailer Released 'నా నువ్వే' - ల‌వ్వ‌బుల్‌ అండ్ రొమాంటిక్!
Sponsored links

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం 'నా నువ్వే'. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. మే 25న సినిమా విడుద‌ల‌వుతుంది. బుధ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు జయేంద్ర, నిర్మాత‌లు మ‌హేశ్ కొనేరు, కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర మాట్లాడుతూ.. 'ఎగ్జ‌యిటింగ్ ఫిలిం. క‌ల్యాణ్ రామ్ ఇప్పటి వ‌ర‌కు చేసిన సినిమాల‌కు భిన్నంగా ఉంటుంది. త‌మ‌న్నాగారి లాంగ్ కెరీర్లో ఆమె చాలా కొత్త‌గా క‌న‌పడుతుంది. ఇద్ద‌రికీ బ్రాండ్ న్యూ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. సినిమా చూసే ఆడియెన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది' అన్నారు. 

మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ.. 'సినిమా మే 25న విడుద‌ల చేస్తున్నాం. సెన్సార్ ప్రాసెస్ స్టార్ట‌య్యింది. ల‌వ‌బుల్‌, రొమాంటిక్ మూవీ ఇది. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. ట్రైల‌ర్ చూసిన వారంద‌రూ అదే అంటున్నారు. కల్యాణ్‌రామ్‌గారు, త‌మ‌న్నాగారి కెరీర్‌కి రీ బూస్ట్ ఫిలిం అవుతుంది' అన్నారు.

కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు మాట్లాడుతూ.. 'సాంగ్స్ విన్న‌వారు, ట్రైల‌ర్ చూసిన‌వారంద‌రూ బావుంద‌ని అంటున్నారు. ఈ నెల 25న విడుద‌ల‌వుతున్న మా సినిమా కోసం సుపీరియ‌ర్ టెక్నిక‌ల్ టీం ప‌నిచేసింది. సాధార‌ణంగా సినిమాను పూర్త‌యిన త‌ర్వాత ఎడిటింగ్ చేస్తారు. కానీ స్క్రిప్ట్ లెవ‌ల్‌లోనే ఎడిట్ అయిపోవడంతో ఎక్క‌డా టెన్ష‌న్ ప‌డ‌లేదు. ఈ టీంను లాక్ చేశాం. యు.ఎస్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్‌, యాక్ష‌న్ థ్రిల్ల్ చేయ‌బోతున్నాం' అన్నారు.

Sponsored links

Naa Nuvve Trailer Released:

Naa Nuvve Trailer Release Matter

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019