Advertisement

'అ!' సూప‌ర్ హిట్.. ముందే చూస్తా: రాజమౌళి

Fri 02nd Feb 2018 02:15 PM
rajamouli,nani,awe,awe movie pre release event,kajal,regina,nithya menen,awe telugu movie,prasanth varma  'అ!' సూప‌ర్ హిట్.. ముందే చూస్తా: రాజమౌళి
Awe Movie Pre Release Function Highlights 'అ!' సూప‌ర్ హిట్.. ముందే చూస్తా: రాజమౌళి
Advertisement

అ! ట్రైల‌ర్ చూడ‌గానే సినిమా సూప‌ర్ హిట్ అనే ఫీలింగ్ క‌లిగింది - ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

 నేచ‌ర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యానర్‌పై  రూపొందుతున్న చిత్రం 'అ!'. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రెజీనా కసండ్ర‌, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, నిత్యామీన‌న్‌, ముర‌ళీశ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు న‌టించారు. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ప్ర‌శాంతి త్రిపిరినేని నిర్మాత‌. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 16న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుక‌లో...

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ.. ట్రైల‌ర్ చూసిన వెంట‌నే సినిమా చూడాల‌నే ఆస‌క్తి ఏర్ప‌డింది. అది కూడా ఒక‌రోజు ముందుగానే. సినిమా సూప‌ర్‌హిట్ అవుతుంద‌నే ఫీలింగ్ క‌లిగింది. నాని వ‌రుస‌గా హిట్స్ మీద హిట్స్ కొట్టేస్తున్నాడు. నాని సినిమా అంటే డెఫ‌నెట్ హిట్టేన‌ని అంద‌రికీ ఫీలింగ్ క‌లిగింది. దీన్ని దాటి మ‌రో స్టెప్ పైకి వెళ్లాల‌ని కోరుకున్నాను. రెజీనా లుక్ చూడ‌గానే అందులో అందం, ఆక‌ర్ష‌న‌, బోల్డ్‌నెస్ ఆక‌ట్టుకుంది. ఈ అమ్మాయి ఈ ఒక‌రోలే చేస్తుందా! మ‌రో సినిమా చేయ‌దా! అని కూడా అనిపించింది. ఈ సినిమాలో న‌టించిన అంద‌రినీ చూస్తుంటే, చాలా ఆస‌క్తిగా అనిపిస్తుంది. ఈ సినిమా ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంద‌ని భావిస్తున్నాను.. అన్నారు. 

ఎం.ఎం.కీర‌వాణి మాట్లాడుతూ.. వాల్‌పోస్ట‌ర్ అనే బ్యాన‌ర్ పేరే నాకు బాగా న‌చ్చింది. ప్ర‌శాంత్ అండ్ టీంకి, నిర్మాత‌లు ప్ర‌శాంతి, నాని స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌..అన్నారు. 

అనుష్క మాట్లాడుతూ.. ఇందులో చేసిన 11 క్యారెక్ట‌ర్స్ అన్నీ సినిమాపై ఆస‌క్తిని క్రియేట్ చేశాయి. సినిమా అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చ‌తుంది.. అన్నారు. 

నాని మాట్లాడుతూ.. ఇదొక తిక్క సినిమా. మ‌న అందరిలో కాస్త తిక్క ఉంటుంది. ఆ తిక్క‌ను శాటిస్ఫై చేసే సినిమా ఇది. హీరోగా నాని సినిమా చేస్తున్నాడు క‌దా! ఇప్పుడు సినిమాలెందుకు అన్న‌వారున్నారు. ప్రొడ్యూస్ చేయ‌డం ఏదేని లాభ‌సాటిగా ఉంటుందా అని కూడా కొంద‌రు అనుకున్నారేమో కానీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయ‌డం వ‌ల్ల నాకు నిర్మాత‌ల‌పై గౌర‌వం పెరిగింది. నిర్మాత‌లంద‌రికీ హ్యాట్సాఫ్‌. ప్ర‌శాంత్ క‌థ చెప్ప‌గానే, నాకు కొత్త‌గా అనిపించింది. త‌న ద‌గ్గ‌ర ప్రొడ్యూస‌ర్స్ లేర‌నిపించింది. ఈ క‌థ‌ను స‌రిగ్గా హ్యాండిల్ చేసే నిర్మాత కావాలనిపించింది. ఒక మంచి ప్రొడ్యూస‌ర్‌నిస్తాను. నువ్వు తొంద‌ర‌ప‌డొద్దు అని త‌న‌కి చెప్పాను. ఇద్ద‌రు, ముగ్గురు పేర్లు అనుకున్నా, వారికి చెప్పే ధైర్యం నేనే చేయ‌లేక‌పోయాను. క‌రెక్ట్‌గా నిన్నుకోరి అడిగా అడిగా సాంగ్ పాడే స‌మ‌యంలో ప్ర‌శాంత్ క‌న‌ప‌డ్డాడు. లిరిక్స్ మ‌ర‌చిపోయాను. త‌ను చేప వాయిస్ ఓవ‌ర్ కోసం వ‌చ్చిన‌ప్పుడు క‌థ విన్నాను. నాకు న‌చ్చింది కాబ‌ట్టే ప్ర‌శాంత్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ప్ర‌శాంత్ ఈ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను అని చెప్పాను. ఈరోజు వ‌ర‌కు నేను సినిమాలోనే సంపాదించాను. ఈ మొత్తాన్ని సినిమాపై పెట్టడానికి నేను రెడీ. ఇలాంటి ఐడియాను నేను స‌పోర్ట్ చేయ‌క‌పోతే మంచి క‌థ‌లు తెలుగులో రావనిపించి నేనే సినిమాకు నిర్మాత‌గా మారాను. వ‌ర్కింగ్ టైటిల్‌ను 'అ!' అని అనుకున్నాడు ప్ర‌శాంత్‌. అది విన‌గానే ఏదైనా మంచి ప‌ని చేయ‌డానికి ముందు.. అక్ష‌రాలు దిద్దించ‌డానికి ముందు అ అక్ష‌రాన్ని ముందుగా రాయిస్తారు. ఇది నీ, నా మొద‌టి సినిమా కాబ‌ట్టి ఇంత కంటే మంచి టైటిల్ ఉండ‌ద‌నిపించి అదే టైటిల్‌ను ఫిక్స్ చేసుకోమ‌ని చెప్పాను. ఇక ఈ సినిమాలో న‌టించిన టీమ్ గురించి చెప్పుకోవాలి. నిత్యామీన‌న్ గురించి చెప్పాలంటే.. నా ప్రొడ‌క్ష‌న్‌లో నిత్యా చేయ‌డం ఆనందంగా ఉంది. త‌న పాత్ర చాలా స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అలాంటి పాత్ర‌ను ఎవ‌రూ రివీల్ చేయ‌రు. ప్రియ‌ద‌ర్శిలో యూనిక్ స్టైల్ ఉంది. త‌ను చెఫ్ రోల్‌కు స‌రిపోతాడ‌నిపించింది. నేను అనుక‌న్న‌ట్లుగానే ప్రియ‌దర్శి అద్భుతంగా ఆ పాత్ర‌లో సూట్ అయ్యాడు. అటు త‌మిళ‌, తెలుగు సినిమాలు చేస్తూ ఓ పాత్ర కోసం హెయిర్ స్టైల్‌నే మార్చేసింది రెజీనా. ముందు త‌ను చేయ‌దేమోన‌ని అనుకున్నా.. కానీ తీరా ఆమె లుక్స్‌తో ఉన్న ఫోటోల‌ను పంపితే  చూసి నేను షాక‌య్యాను. ఇక అలాగే హీరోయిన్ ఈషా ఇందులో బ్యూటీఫుల్ రోల్ చేసింది. అమీ తుమీ చూసి త‌ను ఈ పాత్ర‌కు స‌రిపోతుంద‌నిపించి అడ‌గ్గానే క‌థ విని చేయ‌డానికి ఒప్పుకున్నందుకు త‌న‌కు థాంక్స్. ఇక ర‌వి అన్న‌(ర‌వితేజ‌), నాకు క‌థ విని వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డానికి ఒప్పుకున్నారు. అయన చేసే సినిమాలు చూసి ఆయ‌న‌కు ఇలాంటి సినిమాలు న‌చ్చవేమోన‌ని చాలా మంది అనుకుంటారు. కానీ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాన‌ని తెలియ‌గానే ఆయ‌న నాకు పోన్ చేసి 'ఏంట‌బ్బాయ్ మ‌న‌మిద్ద‌రం క‌లిసి ప్రొడ్యూస్ చేసేద్దామా!' అన్నారు. ఇలాంటి కొత్త ఆలోచ‌న‌ల‌ను ఆయ‌నెలా ఎంక‌రేజ్ చేస్తారోన‌ని నాకిప్పుడు అర్థ‌మైంది. ఇక కాజ‌ల్ అగ‌ర్వాల్ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌శాంత్ క‌థ అనుకున్న‌ప్పుడే కాజ‌ల్‌ను అనుకున్నాడు. కానీ త‌ను బిజీగా ఉంది క‌దా! చేయ‌దేమోన‌ని అప్ష‌న్స్ కోసం చూస్తుంటే, కాజ‌ల్ ఫోన్ చేసి ఏదేమైనా ఈ రోల్‌ను నేనే చేస్తానని చెప్పి న‌టించింది. ఇక అవ‌స‌రాల శ్రీనివాస్ నేను అనుకున్న రోల్‌కు ప‌ర్‌ఫెక్ట్‌గా సూట‌య్యాడు. ఇక నా పేవ‌రేట్ కోస్టార్ ముర‌ళీశ‌ర్మ‌గారు కూడా ఇందులో చాలా మంచి పాత్ర చేశాడు. నా కో ప్రొడ్యూస‌ర్ ప్ర‌శాంతి చాలా ఎగ్జ‌యిట్‌మెంట్ న‌న్ను ఇన్‌స్పైర్ చేసింది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ సినిమా చేసిన విధానం చూస్తే.. ఇది త‌న తొలి సినిమా అంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. ఇలాంటి డైరెక్ట‌ర్‌ని నేను ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాన‌ని గర్వంగా ఉంది. సినిమా మొన్న‌నే చూశాను, చాలా గ‌ర్వంగా ఫీల‌య్యాను. కార్తీక్ ప్ర‌తి ఫ్రేమ్‌తో అంద‌రినీ డామినేట్ చేస్తాడు. ఎడిట‌ర్ గౌత‌మ్ స‌హా అంద‌రికీ థాంక్స్‌.. అన్నారు. 

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, వెంక‌ట్‌, నా టీమ్‌కి థాంక్స్‌.  ముందు నానిగారికి థాంక్స్‌. అంత‌కు ముందు నేను చేసిన షార్ట్‌ ఫిలిం చూసి ఇలాంటి క్రేజీ థాట్ ఏదైనా ఉంటే ముందు నాకే కాల్ చెయ్ అన్నారు. అప్పుడు చేప క్యారెక్ట‌ర్‌ వాయిస్ ఓవ‌ర్ కోసం ఆయ‌న్ను క‌లిశాను. ఏదో చిన్న‌గా చేద్దామ‌ని అనుకున్నాను. కానీ నానిగారు ఫీల్డ్‌లోకి రాగానే సినిమా చాలా పెద్ద‌దైంది. నిత్యా, ఈషా, కాజ‌ల్‌, రెజీనా, ప్రియ‌ద‌ర్శి, ముర‌ళీశ‌ర్మ అంద‌రికీ థాంక్స్‌. నానిగారు ఎక్కువ ఇన్‌వాల్వ్ అయిపోతార‌ని చాలా భ‌య‌పెట్టారు. కానీ ఆయ‌న నా వ‌ర్క్ లో ఇన్‌వాల్వ్ కాలేదు. బెట‌ర్‌మెంట్ కోసం కొన్ని స‌ల‌హాలిచ్చారంతే. ఇక బ‌డ్జెట్ విష‌యంలో కూడా నేను చెప్పిన దాని కంటే ఎక్కువే అయ్యింది. ఎంత పెరిగిందో నాకు కూడా తెలియ‌దు. నానిగారు కూడా ఎప్పుడూ డిస్క‌స్ చేయ‌లేదు. గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌. ఇదొక సిన్సియ‌ర్‌, నిజాయ‌తీతో కూడిన ప్ర‌య‌త్న‌మున్న సినిమా. క‌థ విన్నప్పుడు వ‌చ్చిన రెస్పాన్స్‌నే టైటిల్‌గా పెట్టాను. సినిమా ఫిబ్ర‌వ‌రి 16న విడుద‌ల‌వుతుంది. ఈ ప్ర‌య‌త్నాన్ని స‌పోర్ట్ చేస్తే మ‌రిన్ని ఓరిజిన‌ల్ కాన్సెప్ట్ మూవీస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను.. అన్నారు. 

ఈషారెబ్బా మాట్లాడుతూ.. కొత్త ర‌క‌మైన సినిమా వ‌స్తుంద‌నుకోవాలి. ఈ ఫిబ్ర‌వ‌రి 16న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అన్నీ ర‌కాల ఎలిమెంట్స్ క‌ల‌యిక‌లో ఉండే సినిమా. నానిగారు న‌న్ను అప్రోచ్ అవ‌గానే.. క‌థ విని చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. న‌టిగా డిఫ‌రెంట్ పాత్ర‌లు చేయాల‌నుకుంటున్న స‌మయంలో ఇలాంటి పాత్ర రావడంతో థ్రిల్ అయ్యాను. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన నా పాత్రలలో కొత్త‌గా ఉంటుంది. తెలుగులోనే నా పాత్ర డిఫ‌రెంట్‌గా ఉంటుంది.. అన్నారు. 

శ్రీనివాస్ అవ‌స‌రాల మాట్లాడుతూ... సినిమా చూసే ప్రేక్ష‌కులు కొత్త అనుభూతికి లోన‌వుతాం. మంచి మంచి న‌టీన‌టులు ఈ చిత్రంలో న‌టించారు. నాని మంచి న‌టుడనే సంగ‌తి తెలిసిందే. మంచి స్నేహితుడు కూడా. స్నేహితుల కోసం ఎంత దూర‌మైన వెళ‌తాడు.. అన్నాడు. 

నిత్యామీన‌న్ మాట్లాడుతూ.. రొమాన్స్‌, సైన్స్ ఫిక్ష‌న్‌, ల‌వ్, హార‌ర్‌, థ్రిల్ల‌ర్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. రేపు సినిమా చూస్తే ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌వుతుంది. యూనిట్ కాన్సెప్ట్ మూవీ. ప్ర‌శాంత్ వండ‌ర్‌ఫుల్ స్టోరీతో చేసిన సినిమా. ఈ సినిమాలో పార్ట్ కావ‌డం చాలా ఎగ్జ‌యిట్‌గా అనిపించింది. తెలుగులో ఇలాంటి సినిమా రావ‌డం మంచి విష‌యం. నేను, నాని టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకునేవాళ్లం... అన్నారు

రెజీనా క‌సండ్ర మాట్లాడుతూ.. ప్ర‌శాంత్ క‌థ చెప్ప‌గానే నేను విజువ‌లైజ్ చేశాను. క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో తెలియ‌డంతో.. నాకు ఈ క్యారెక్ట‌రే కావాల‌ని త‌న‌తో అన్నాను. ప్ర‌శాంత్‌, నానిల‌కు స్పెష‌ల్ థాంక్స్‌. నా క్యారెక్ట‌ర్ గురించి ఇప్పుడే చెప్ప‌లేను. ఫిబ్ర‌వ‌రి 16న సినిమా విడుద‌ల కానుంది.. అన్నారు. 

కాజ‌ల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ.. చాలా కొత్త క‌థ‌. నా కెరీర్‌లో కొత్తగా చేసిన పాత్ర ఇది. ఎంట‌ర్‌టైనింగ్‌తో పాటు సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ చెప్ప‌గానే వెంట‌నే చేయ‌డానికి అంగీక‌రించాను. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను డిటెయిల్డ్‌గా త‌ను డిజైన్ చేశాడు.. అన్నారు. 

ప్రియ‌ద‌ర్శి మాట్లాడుతూ.. గ‌త రెండేళ్లుగా తెలుగు సినిమా ఏ స్థాయికి వెళుతుందో మ‌నం అంద‌రం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. బాహుబ‌లి, పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలు ఎంత‌టి విజ‌యాన్ని సాధించాయి. హిస్టారిక్ మూమెంట్‌ను క్రియేట్ చేశాయి. అలాంటి హిస్టారిక్ మూమెంట్‌ను క్రియేట్ చేస్తున్న గొప్ప గొప్ప‌వారు ఈరోజు మ‌న‌తో ఉన్నారు. ఫిబ్ర‌వ‌రి 16న అ! సినిమా విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా  సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది.. అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం:  మార్క్ కె.రాబిన్‌, సినిమాటోగ్ర‌ఫీ:  కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఆర్ట్‌:  సాహి సురేష్‌, ఎడిటింగ్‌:  గౌత‌మ్ నెరుసు, నిర్మాత‌: ప‌్ర‌శాంతి త్రిపిరినేని, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌శాంత్ వ‌ర్మ‌. 

Awe Movie Pre Release Function Highlights:

Nani Produced Awe Movie Pre Release Event Updates 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement