Advertisementt

Ads by CJ

చిరంజీవిగారి పాటకి తేజు ఎలా చేసాడో?: ప్రభాస్!

Mon 29th Jan 2018 05:52 PM
inttelligent,prabhas,vv vinayak,lets do song,c kalyan,lavanya tripathi  చిరంజీవిగారి పాటకి తేజు ఎలా చేసాడో?: ప్రభాస్!
Prabhas Launches First Single of Inttelligent చిరంజీవిగారి పాటకి తేజు ఎలా చేసాడో?: ప్రభాస్!
Advertisement
Ads by CJ

'ఇంటిలిజెంట్‌' బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నా - ఫస్ట్‌ సాంగ్‌ లాంచ్‌లో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ 

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం 'ఇంటిలిజెంట్‌'. టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. భారీగా వ్యూస్‌ సాధిస్తూ ట్రెండింగ్‌ అవుతోంది. 'ఇక మీదట పేదోడికి ప్లాట్‌ఫామ్‌... ధర్మాభాయ్‌డాట్‌కామ్‌' అంటూ సాయిధరమ్‌ తేజ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తోనే సినిమా ఏ రేంజ్‌లో వుంటుందో అర్థం అవుతోంది. సంచలన సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.థమన్‌ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని ఫస్ట్‌సాంగ్‌ని యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ జనవరి 28 సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ చేశారు. 'లెట్స్‌ డు' అంటూ వచ్చే ఈ పాటని చంద్రబోస్‌ రాశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. 

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ...సాంగ్‌ లాంచ్‌ చెయ్యాలని వినాయక్‌గారు మొహమాటపడుతూ పిలిచారు. ఆయన ఒక మెసేజ్‌ చేస్తే చాలు ఏ ఫంక్షన్‌కైనా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నా లైఫ్‌లో 'యోగి' సినిమాకి చేసినంత ఎంజాయ్‌ ఏ సినిమాకి చెయ్యలేదు. రాజమౌళిగారితో చెప్పాను. వినాయక్‌గారు బాగా సుఖపెట్టేస్తారు అని. ఆయన సుఖ పెట్టకూడదు. మేం ఇంకా చాలా కష్టపడాలి. తేజ్‌ 'సాహో' షూటింగ్‌కి వచ్చాడు. వినాయక్‌గారితో చేయడం చాలా లక్కీ అని చెప్పాను. ఈ సినిమాలో నా మోస్ట్‌ ఫేవరేట్‌ 'చమకు చమకు ఛాం' సాంగ్‌. చిరంజీవిగారి పాటల్లో ది బెస్ట్‌ సాంగ్‌ అది. ఆ సాంగ్‌ చిరంజీవిగారు సూపర్బ్‌గా చేశారు. తేజు ఎలా చేశాడో అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. వినాయక్‌గారు బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌తో వస్తున్నారు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ చిత్రం బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నా... అన్నారు. 

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ... ప్రభాస్‌ అంటే స్నేహానికి నిలువెత్తు రూపం. హార్ట్‌ఫుల్‌గా ఫ్రెండ్స్‌ వుంటే చాలు అనుకునే మనిషి. ఇలాంటి మనిషి సినిమా ఇండస్ట్రీలో వుండటం చాలా అరుదు. నేను ఎప్పుడూ ఎవర్నీ ఏమీ అడగను. ఎవర్ని ఏ ఫంక్షన్‌కి పిలవను. సరదాగా ప్రభాస్‌కి ఫోన్‌ చేసి సాంగ్‌ రిలీజ్‌ చెయ్యాలి వస్తావా అన్నాను. ఏయ్‌ డార్లింగ్‌ ఎక్కడికి రమ్మంటావ్‌ చెప్పు. అక్కడికి వస్తా అని చెప్పాడు. నాకు చాలా ఆనందం కల్గింది. ప్రభాస్‌ ఎక్కువమందిని కలవడు. వున్నవారితో చాలా ఆత్మీయంగా వుంటాడు. చిన్న చిన్న విషయాలకు కూడా ఆనందపడుతుంటాడు. అదే ఆనందాన్ని మాకు పంచి ఇవ్వడానికి వచ్చాడు. మా టీమ్‌ తరపున ప్రభాస్‌కి కృతజ్ఞతలు. టీజర్‌లో తేజు చిరంజీవిగారిలా వున్నాడని అంటుంటే చాలా సంతోషంగా వుంది. ఈ చిత్రంలో తేజు ఇరగదీశాడు. లావణ్య ఫస్ట్‌టైమ్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ క్యారెక్టర్‌లో నటించింది. ఈ సినిమా తనకి చాలా మంచి పేరు వస్తుంది. శివ ఆకుల కాంబినేషన్‌లో వచ్చిన మా సినిమాలు అన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ చిత్రాన్ని కూడా పెద్ద హిట్‌ చెయ్యాలని కోరుకుంటున్నా...అన్నారు. 

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ... ప్రభాస్‌ అన్నను మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ఫీలవుతాం. మా చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ని లాంచ్‌ చేసినందుకు ప్రభాస్‌ అన్నకు చాలా థాంక్స్‌. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌ వినాయక్‌, ప్రొడ్యూసర్‌ కళ్యాణ్‌గారికి ధన్యవాదాలు. లావణ్య మంచి క్యారెక్టర్‌ చేసింది. అందరం కలిసి మంచి సినిమా చేశాం. ఫిబ్రవరి 9న సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా...అన్నారు. 

చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ... మా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బేనర్‌లో నిర్మించిన 'ఇంటిలిజెంట్‌' చిత్రంలోని మొదటి పాటని రిలీజ్‌ చేసిన యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్‌ గారికి కృతజ్ఞతలు. ఆయన మనసు ఎలాంటిదో కృష్ణంరాజుగారిని చూస్తే తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ వుంటారు. అందుకే ఆయన్ని నవ్వుల రాజు అంటుంటాం. ప్రతి ఒక్కరూ లైఫ్‌లో హ్యాపీగా, ఆనందంగా వుండాలని కోరుకునే బ్లడ్‌ వారిది. అలాంటి మంచి వ్యక్తి ప్రభాస్‌ చేతులమీదుగా చంద్రబోస్‌ రాసిన 'లెట్స్‌ డు' పాటని రిలీజ్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయి. ఈరోజు నుండి ప్రతి నాలుగు గంటలకొకసారి ఒక పాటని రిలీజ్‌ చేస్తాం. భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి రాసిన పాటలు కూడా బాగా వచ్చాయి. మా హీరో సాయిధరమ్‌ తేజ్‌ అన్ని పాటలకి డ్యాన్స్‌లు ఇరగదీశాడు. లావణ్య త్రిపాఠి కూడా డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌ని చాలా టిపికల్‌గా చేసింది. ఈ సినిమాతో లావణ్యకి ఎక్కువ లవ్‌ కాల్స్‌ వస్తాయి. ఫిబ్రవరి 9న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా సక్సెస్‌ గురించి 10న మాట్లాడతాం. మా మీద అభిమానంతో వచ్చి మా 'ఇంటిలిజెంట్‌'లోని ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేసి మా టీమ్‌ని బ్లెస్‌ చేసిన ప్రభాస్‌గారికి మా టీమ్‌ అందరి తరపున కృతజ్ఞతలు... అన్నారు. 

రచయిత ఆకుల శివ మాట్లాడుతూ...టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పాటలన్ని చాలా బాగున్నాయి. థమన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్‌ అవుతుంది. ఖచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి మా అందరికీ మంచి పేరు తెస్తుందని నమ్మకంతో వున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వినాయక్‌, కళ్యాణ్‌గారికి నా థాంక్స్‌...అన్నారు. 

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ..ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన వినాయక్‌గారికి, కళ్యాణ్‌గారికి కృతజ్ఞతలు. మా చిత్రంలోని సాంగ్‌ రిలీజ్‌ చేయడానికి వచ్చిన ప్రభాస్‌కి నా థాంక్స్‌. ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది... అన్నారు.

Prabhas Launches First Single of Inttelligent:

Inttelligent First Single Launched by Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ