Advertisement

వర్మ, నాగ్ మూవీ డీటైల్స్ వచ్చేశాయ్!

Wed 01st Nov 2017 11:17 PM
nagarjuna,ram gopal varma,shiva,november  వర్మ, నాగ్ మూవీ డీటైల్స్ వచ్చేశాయ్!
Nagarjuna and RGV's Film from November 20 వర్మ, నాగ్ మూవీ డీటైల్స్ వచ్చేశాయ్!
Advertisement

ఆర్జీవీ స్వీయ దర్శకత్వంలో నాగార్జున - నవంబర్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ 

తెలుగు సినిమా కాన్వాస్ పై రాంగోపాల్ వర్మ-నాగార్జునల 'శివ' సినిమా ఒక చెరగని సంతకం చేసింది. 'శివ' విడుదలై 28 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా కొత్త దర్శకులకు ఒక నిఘంటువు వంటిది. అలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రిపీటవ్వనుంది. రాంగోపాల్ వర్మ ఓ అద్భుతమైన కథ చెప్పాడని, త్వరలోనే సెట్స్ కు వెళ్లనుందని నాగార్జున స్వయంగా ఇటీవల 'రాజుగారి గది 2' ప్రమోషన్స్ లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే. 

రాంగోపాల్ వర్మ స్వయంగా నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 20 నుంచి మొదలవ్వనుంది. 'శివ' సినిమా మొదటి షాట్ ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. రాంగోపాల్ వర్మ 'కంపెనీ' బ్యానర్ లో ఈ క్రేజీ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆర్జీవి చిరకాల మిత్రుడు సుధీర్ చంద్ర పడిరి ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించనున్నారు. ఏప్రిల్ లో చిత్రీకరణ పూర్తి చేసుకొనున్న ఈ అమేజింగ్ మూవీ రిలీజ్ డేట్, టైటిల్ మరియు ఇతర క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలోనే రాంగోపాల్ వర్మ వెల్లడించనున్నారు.

Nagarjuna and RGV's Film from November 20:

King Nagarjuna and director Ram Gopal Varma's historical combo is all set to repeat soon. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement