Advertisement

'జట్టు ఇంజనీర్' అందరూ చూడాల్సిన చిత్రమట!

Wed 03rd May 2017 06:14 PM
gurmeet ram rahim singh,jattu engineer,jattu engineer movie trailer launch,sonu nigam,saint  'జట్టు ఇంజనీర్' అందరూ చూడాల్సిన చిత్రమట!
Jattu Engineer Trailer Launched 'జట్టు ఇంజనీర్' అందరూ చూడాల్సిన చిత్రమట!
Advertisement

హరాయణ సిర్సా లో వేలాది ప్రజల సమక్షం లో 'జట్టు ఇంజనీర్' ట్రైలర్ ను, సాంగ్ ని విడుదల చేసిన డా.యం యస్ జి. 

డేరా సచ్చ సౌద యొక్క ఫౌండేషన్ డే వేడుకలు మరియు రెండు రోజుల  పవిత్ర వార్షికోత్సవం 'జామ్-ఇ-ఇన్సాన్'.  'జట్టు ఇంజనీర్' ట్రైలర్ ను, సాంగ్ ఆవిష్కరణ 

డేరా సచ్చ సౌద యొక్క 69 వ ఫౌండేషన్ డే మరియు పవిత్ర 10 వ  'జామ్-ఇ-ఇన్సాన్'  వార్షికోత్సవం సందర్భంగా హర్యానా లోని సిర్సాలో  భండారా ఆడిటోరియం లో ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల ఈ కార్యక్రమానికి  భారతదేశం యొక్క వివిధ ప్రాంతాల నుండే కాక, ప్రపంచం నలుమూలల నుండి Dr. గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్ జీ ఇన్సాన్  భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. సెయింట్ Dr. గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్ జీ ఇన్సాన్ యొక్క ఆశీస్సులు అందుకోడానికి మరియు ఆయన  బోధనలను వినడానికి హరాయణ సిర్సాకు తరలివెళ్లారు. అంతర్జాతీయ సాంస్కృతిక పండుగ గొప్ప  స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను  మరియు ప్రదర్శకులు వారి ప్రతిభను  ప్రదర్శించేందుకు  ఈ పవిత్రమైన చోటు ఒక వేదిక అయ్యింది. తనను తాను రూపొందించిన పాతకాలపు ట్రాక్టర్లో  Dr. గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్ జీ ఇన్సాన్ ప్రవేశం తో  ఈ కార్యక్రమం ఆరంభమైంది. ఆయన నటించిన 5వ చిత్రం 'జట్టు ఇంజనీర్' ట్రైలర్ ను, ఈ చిత్రం లో హోలీ సాంగ్ ని Dr. యం యస్ జి చేతుల మీదుగా ప్రదర్శించారు. పాట ప్రొజెక్షన్ జరిగిన వెంటనే ప్రేక్షకుల డాన్స్ స్టెప్పులతో, అభివాదాలతో, ఈలలతో, ఆడిటోరియం మారు మ్రోగిపోయింది.

ఈ సందర్భంగా Dr. యం యస్ జి మాట్లాడుతూ-  నేను నటించిన నాలుగు చిత్రాలను కూడా ప్రజలు ఎంతో ఆదరించారు. ఇప్పుడు వస్తున్న 5వ చిత్రం  'జట్టు ఇంజనీర్'. తొలిసారిగా  ఒక శక్తివంతమైన సందేశంతో అవుట్ అండ్ అవుట్ హాస్యప్రధాన చిత్రం ఇది.  సినిమా అంటేనే వినోదం ఆ వినోదాన్ని అందించే ప్రధాన అంశం కామెడీ. ఈ చిత్రం లో ఎలాంటి అసభ్య కరమైన మాటలు కానీ , ద్వంద అర్ధాలు వచ్చే సంభాషణలు గాని  వుండవు. కుటుంభ సమేతంగా చూడతగిన వినోదాత్మక కామెడీ చిత్రం. 6యేళ్ల చిన్న పిల్లాడినుండి 60యేళ్ల ముసలి వాళ్ళ వరకు ఈ చిత్రం నచ్చుతుంది. అంతే కాకుండా అండర్ పాయింట్ వుంది సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమనేది ఈ సినిమా తీయడానికి ప్రధాన కారణం. 

గ్రామాల్లో వున్నా అమాయక  ప్రజల జీవన విధానాన్ని చూపిస్తూ, వారిని పరివర్తనం చెందేలా, ప్రతి గ్రామం తన ప్రజల  స్వీయ నిర్ణయం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వానికి ఎంత ఉపయోగపడాలి ఎలా  సహాయపడాలి అనేది ప్రధాన అంశం. ఈ చిత్రంలోని గౌరవప్రదమైన సెయింట్ పాత్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాత్రలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాను. మన గ్రామాల్లో చాలా పాఠశాలల్లో సరైన ఉపాధ్యాయులు లేరు, విద్యార్థులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలను ఈ చిత్రం చూపిస్తుంది. వారిలో సానుకూల పరివర్తనను తీసుకువచ్చే పాత్ర నాది. ఈ చిత్రం హిందీ, తెలుగు, హర్యానా, పంజాబీ, భోజ్పురి మరియు బాగ్రి వంటి అనేక భాషలతో కామెడీ ఉంటుంది. అందుకనే ఆయా ప్రాంతాల దర్శకుల సహకారం తీసుకోవడం జరిగింది. ఈ చిత్రం కూడా భారత దేశం లో అన్ని భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. వేరే మతాలను కించ పరిచే సన్నివేశాలు ఇందులో ఏ మాత్రం ఉండవని హామీ ఇస్తున్నాను. ముఖ్యం గా మీకు తెలియ చేసేదేటంటే నా నాలుగు సినిమా లను నిర్మించడానికి తీసుకున్న షూటింగ్ సమయం చాలా ఎక్కువ, కానీ ఈ సినిమా నిర్మాణం కేవలం 15 రోజుల్లో  పూర్తి చేసి సరి కొత్త సంచలనానికి శ్రీకారం చుట్టినట్టు అయ్యింది. అలాగని ఖర్చు విషయం లో ఎక్కడ కంప్రమైస్ అవ్వలేదు. ఇప్పటికే సెన్సార్ కార్య క్రమాలు పూర్తి అయ్యాయి సెన్సార్ వారు  క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మే 19న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేసాము...అన్నారు.

ఈ వేడుకను గాయకుడు సోను నిగమ్ ఆద్ధ్యతం తన వ్యాఖ్యానం తో అలరించాడు. వ్యభిచార వృత్తిలో వున్నా వేశ్యలకు విముక్తి కల్పించిన ఆ  యువతులతో ఆదర్శ యువకులైన వారితో విహహం జరిపించారు. ఈ కొత్తగా పెళ్లయిన జంటలకు  రూ.25 వేల చెక్కులను ఇచ్చారు. ఆసియా బుక్ అఫ్ రికార్డులను అందచేసారు. ఈ అవార్డులు తీసుకున్న వారు ఇప్పటికే  71 వున్నా సంఖ్య వున్నా 78 కి పెరిగింది. డా.యం యస్ జి అభిమానులు రక్తదానం చేసారు.

Jattu Engineer Trailer Launched :

The Revered Saint graced the stage in the get-up of his 5th upcoming movie Jattu Engineer to a thunderous applause and a standing ovation from the audience. Everyone present clamored for a glimpse of the Revered Saint who made a grand entry on a vintage tractor which has has designed himself. On this occasion, the Revered Saint launched the trailer and a song from Jattu Engineer which was greatly appreciated and cheered by everyone in the audience.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement