Advertisement

చంటిగాళ్ళిద్ద‌రికీ తేడా ఉంది.. : పూరి

Tue 28th Mar 2017 02:44 PM
puri jagannadh,rogue,puri jagannadh rogue interview photos,rogue movie puri interview  చంటిగాళ్ళిద్ద‌రికీ తేడా ఉంది.. : పూరి
చంటిగాళ్ళిద్ద‌రికీ తేడా ఉంది.. : పూరి
Advertisement

నా ద‌ర్శ‌క‌త్వంలో చాలా రోజుల త‌ర్వాత వ‌స్తోన్న క్యూట్ ల‌వ్ స్టోరీ `రోగ్‌` - పూరి జ‌గ‌న్నాథ్‌

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇషాన్‌ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ). ఈ సినిమాను మార్చి 31న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌తో సినిమా గురించి మీడియాతో ముచ్చ‌టించారు......

`రోగ్` గురించి....

- నేను ప్రేమ‌క‌థ‌లను డైరెక్ష‌న్ చేసి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు నా ద‌ర్శక‌త్వంలో మార్చి 31న రానున్న రోగ్ ఓ క్యూట్ ల‌వ్‌స్టోరీ. ఈ చిత్రంతో ఇషాన్ హీరోగా ప‌రిచ‌యం అవుతుంటే, మ‌న్నారా చోప్రా, ఎంజెలా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అనూప్‌సింగ్ విల‌న్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. కొత్త‌వాళ్ళ‌తో చేసిన సినిమా. ఇషాన్ లాంటి యంగ్ హీరోను ప‌రిచ‌యం చేస్తున్న‌ప్పుడు ల‌వ్ స్టోరీ అయితేనే బావుంటుంద‌నిపించి త‌న‌తో ల‌వ్ స్టోరీ చేయాల‌నుకున్నాను.  సినిమా క‌లక‌త్తా బ్యాక్‌డ్రాప్‌లో జ‌రుగుతుంది. అలాగే హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో కూడా సినిమాను చిత్రీక‌రించాం. 

చంటిగాళ్ళిద్ద‌రికీ తేడా ఉంది....

- `ఇడియ‌ట్‌`- ఓ చంటిగాడి ప్రేమ‌క‌థ‌, `రోగ్‌` - మ‌రో చంటిగాడి ప్రేమ‌క‌థ‌. ఈ రెండు చిత్రాల్లోని హీరో క్యారెక్ట‌రైజేష‌న్స్‌కు తేడా ఉంటుంది. ఇడియ‌ట్‌లో చంటిగా న‌టించిన ర‌వితేజ చాలా ఎన‌ర్జిటిక్‌గా, యార‌గెంట్‌గా ఉంటే, ఈ సినిమాలో చంటిగా న‌టించిన ఇషాన్ చాలా సైలెంట్‌గా ఉంటాడు. 

ఇషాన్ న‌ట‌న గురించి...

- ఇషాన్ మంచి హ్యండ్స‌మ్ ప‌ర్స‌నాలిటీ. మంచి పెర్‌ఫార్మ‌ర్‌. స్క్రీన్ ప్రెజ‌న్స్ బావుంటుంది. రోగ్ సినిమాను నేను చాలా మందికి చూపించాను. చూసిన వాళ్ళంద‌రూ ఇషాన్‌ను అప్రిసియేట్ చేశారు. ఇలాంటి హీరోకు రెండు, మూడు హిట్స్ ప‌డితే త‌ను స్టార్ హీరోగా ఎదుగుతాడు. రోగ్ సినిమాను చాలా మందికి చూపించాను. చూసిన‌ వాళ్ళంద‌రూ కూడా ఇదే మాట అన్నారు. 

గ‌ట్ ఫీలింగ్‌తో వెళ్ళిపోతాను...

- హాలీవుడ్‌లో షాన్‌ఫీల్డ్ అనే గొప్ప స్క్రీన్‌ప్లే రైట‌ర్ ఉన్నారు. కొత్త ద‌ర్శ‌కులంతా ఆయ‌న ర‌చ‌న‌ల‌ను ఫాలో అవుతుంటారు. ఆయ‌న స్క్రీన్‌ప్లేపై చాలా మంచి పుస్త‌కం కూడా రాశారు. ఆయ‌న రాసిన రెండు క‌థ‌ల‌ను డైరెక్ట్ చేస్తే రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. సినిమా మేకింగ్‌కు వ‌చ్చేస‌రికి మారిపోతుంటుంది. అలాగే నేను క‌థ రాసుకుని, నిర్మాత‌ల‌కు, హీరోకు చెప్పిన‌ప్పుడు వాళ్ళు ఎగ్జ‌యిట్ అయితే సినిమాను చేసేస్తాను. సినిమా చేసే స‌మ‌యంలో క‌థ‌ను న‌మ్ముకునే ఓ గ‌ట్ ఫీలింగ్‌తో వెళ్ళిపోతుంటాను. పోకిరి సినిమా చేసే స‌మ‌యంలో ఒక మంచి సినిమా తీస్తున్నాన‌ని న‌మ్మాను కానీ, ఏదో రికార్డుల‌ను క్రియేట్ చేసేంత పెద్ద సినిమా అవుతుంద‌ని అనుకోలేదు. ఒక సినిమా స‌క్సెస్ అనేది ఆ సినిమాతో పాటు విడుద‌లైన‌ వేరే సినిమాలు విడుద‌ల‌,  అప్ప‌టి ప‌రిస్థితులు డిసైడ్ చేస్తాయి. అన్నీ సినిమాలు అనుకున్న ఫ‌లితాలు రాబ‌ట్ట‌లేవు. 

బాలకృష్ణ సినిమా గురించి...

- బాల‌కృష్ణ‌గారిని నా సినిమాలో కొత్త‌గా చూపిస్తున్నాను. ఓ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌. చాలా ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా ఉండే డైన‌మిక్ రోల్‌. ఆయ‌న డైలాగ్స్ కూడా కొత్తగా ఉంటాయి. బాల‌కృష్ణ‌గారితో ఐదేళ్ళ క్రిత‌మే సినిమా చేయాల్సింది కానీ కుద‌ర‌లేదు. ఇప్ప‌టికి కుదిరింది. ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్‌ను అనుకోలేదు. ముస్కాన్ అనే హీరోయిన్‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం. స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ కూడా పిక్చ‌రైజ్ చేస్తాం. సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఆయ‌న చాలా హ్యాపీగా ఉన్నారు. మేం కూడా హ్యాపీగా ఉన్నాం. 

త‌దుప‌రి చిత్రం...

- మెగాస్టార్ చిరంజీవిగారు త‌ప్ప‌, మెగా హీరోల‌తో సినిమాలు చేశాను. ఇటీవ‌ల ఆయ‌న్ను వెళ్ళి క‌లిశాను కూడా. ఇప్పుడు బాల‌కృష్ణ‌గారితో సినిమా చేస్తున్నాను క‌దా..దాని త‌ర్వాత ఏ విష‌య‌మ‌నేది నేనే చెబుతాను. అలాగే వెంక‌టేష్‌గారి సినిమా కూడా డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. త‌దుప‌రి ఏ సినిమా అనేది ప్ర‌స్తుతం చేస్తున్న బాల‌కృష్ణ‌గారి సినిమా త‌ర్వాతే చెబుతాను. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement