Advertisementt

పొల్లాచ్చిలో మేడమీద అబ్బాయి..!

Sun 26th Mar 2017 09:07 PM
meda meeda abbayi,allari naresh,pollachi  పొల్లాచ్చిలో మేడమీద అబ్బాయి..!
పొల్లాచ్చిలో మేడమీద అబ్బాయి..!
Advertisement
Ads by CJ

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒరు వడక్కం సెల్ఫీ చిత్రానికి రీమేక్ ఇది. మాతృకకు దర్శకుడైన జి.ప్రజిత్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 16 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పొలాచ్చిలో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ గమ్యం శంభో శివ శంభో తర్వాత అలాంటి శక్తివంతమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. థ్రిల్లింగ్ అంశాలు వుంటూనే  నరేష్ శైలి వినోదం వుంటుంది. నరేష్‌ను కొత్త కథలో చూడాలనుకునే వారికి ఈ సినిమాతో ఆ లోటు తీరిపోతుంది. ఈ నెల 16 నుంచి పొల్లాచ్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం. ప్రస్తుతం ఇక్కడ పలు అందమైన లోకేషన్స్‌ల్లో చాలా గ్రాండియర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఏప్రిల్ 3 వరకు ఇక్కడే షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభిస్తాం అని  తెలిపారు. 

అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్ (పిల్ల జమీందార్ ఫేమ్), సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: డి.జె.వసంత్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ:  శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ