Advertisementt

అల్లరి నరేష్ కొత్త చిత్రం షురూ..!

Thu 09th Mar 2017 08:58 PM
allari naresh,jahnavi films,chandrasekhar boppana,nikhila vimal,allari naresh new movie updates  అల్లరి నరేష్ కొత్త చిత్రం షురూ..!
అల్లరి నరేష్ కొత్త చిత్రం షురూ..!
Advertisement
Ads by CJ

జాహ్నవి ఫిలింస్ బ్యానర్ లో అల్లరి నరేష్ కొత్త చిత్రం

మలయాళం లో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్‌ సెల్ఫీ' చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్‌ కాబోతుంది. జాహ్నవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్‌ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. 'ఓరు వడక్కన్‌ సెల్ఫీ' మలయాళ మాతృక  చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన జి. ప్రజీత్‌ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠతను కొలిపే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ నెల (మార్చి) 16 నుండి ఏప్రిల్‌ 5 వరకు పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం, ఏప్రిల్‌ 16 నుండి తదుపరి షూటింగ్‌ మొత్తం హైద్రాబాద్‌లో జరుపుకోనుంది. నిఖిల విమల్‌ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రలో నటించనున్నారు.

అల్లరి నరేష్‌, నిఖిల విమల్‌, అవసరాల శ్రీనివాస్‌, హైపర్‌ ఆది, జయప్రకాశ్‌, జీవా, పద్మా జయంతి, తులసి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఉన్ని.ఎస్‌. కుమార్‌, ఎడిటర్‌: నందమూరి హరి, మ్యూజిక్‌: డి.జె.వసంత్‌, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, డైలాగ్స్: పిల్ల జమీందార్ చంద్రశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎమ్‌.ఎస్‌. కుమార్‌, సమర్పణ: శ్రీమతి నీలిమ, ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ బొప్పన, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి. ప్రజీత్‌. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ