‘తొలి పరిచయం’ లుక్‌ వదిలారు..!

Thu 09th Feb 2017 11:45 AM
toli parichayam,malkapuram siva kumar  ‘తొలి పరిచయం’ లుక్‌ వదిలారు..!
‘తొలి పరిచయం’ లుక్‌ వదిలారు..!
Sponsored links

పియుకే ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకీ, లాస్య జంటగా ఎల్‌.రాధాకృష్ణను దర్శకుడుగా పరిచయం చేస్తూ దీపక్‌ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి పరిచయం’. మురళీమోహన్‌, సుమన్‌, రాజీవ్‌ కనకాల, రఘుబాబు, ఛత్రపతి శేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ విడుదల  కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్కాపురం శివకుమార్‌ ‘తొలి పరిచయం’ ఫస్ట్‌ లుక్‌ను లాంచ్‌ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘తొలి పరిచయం’ ఫస్ట్‌లుక్‌ చాలా ఫ్రెష్‌గా ఉంది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తోంది. ఈ చిత్రంతో పరిచయం అవుతున్న దర్శక నిర్మాతకు ఆల్‌ ది బెస్ట్‌.. అన్నారు.

దర్శకుడు ఎల్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ... ‘తొలి పరిచయం’ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాను. పోలవరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి నాలుగు రోజులపాటు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ తరుణంలో ఏం జరిగిందన్నదే చిత్ర కథాంశం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. నిర్మాత  ఏ విషయంలోనూ రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు.. అన్నారు.

హీరో వెంకీ మాట్లాడుతూ... ఫస్ట్‌ లుక్‌ ఎంత ఫ్రెష్‌గా ఉందో సినిమా కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. త్వరలో ఆడియోను రిలీజ్‌ చేస్తాం.. అన్నారు.

సంగీత దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ... జనసేన పార్టీ పాటలతో సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యాను. నేను మ్యూజిక్‌ చేసిన ఫస్ట్‌ ఫిలిం ఇది. డైరెక్టర్‌ చక్కటి సందర్భాలకు నా నుంచి మంచి బాణీలు తీసుకున్నారు. త్వరలో ఆడియో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం..అన్నారు.

మురళీమోహన్‌, సుమన్‌, రాజీవ్‌ కనకాల, రఘుబాబు, ఛత్రపతి శేఖర్‌, వైవా హర్ష, కళ్లు కృష్ణారావు, ప్రీతినిగమ్‌, రాగిణి, మధుమణి, సాహితి, దీప్తి, మాధవి, రామిరెడ్డి తదిత రులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫి: శరవణ కుమార్‌ సి., ఎడిటర్‌: కృష్ణపుత్ర, మ్యూజిక్‌: ఇంద్రగంటి, డాన్స్‌: కృష్ణారెడ్డి, లిరిక్స్‌: చంద్రబోస్‌, కాసర్ల శ్యాం, కరుణాకర్‌, నిర్మాత: దీపక్‌కృష్ణ, దర్శకత్వం: ఎల్‌.రాధాకృష్ణ.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019