సెన్సార్ పూర్త‌యింది..!

Tue 31st Jan 2017 11:22 AM
hero nani,producer dil raj,heroine keerthy suresh,sensor completed,nenu local movie,released on 3rd feb 2017  సెన్సార్ పూర్త‌యింది..!
సెన్సార్ పూర్త‌యింది..!
Sponsored links

`నేను లోక‌ల్` సెన్సార్ పూర్త‌యింది

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నేను లోక‌ల్‌`.`యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్‌` అనేది క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం సెన్సార్ నేడు పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు యు/ఎ స‌ర్టిఫికెట్‌ను అందించారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ` మా `నేను లోకల్`సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు మా చిత్రానికి యు/ఎ ను అందించారు. ఈ చిత్రంతో నానికి రెండు హ్యాట్రిక్‌లు పూర్త‌వుతాయి. కేర‌క్ట‌ర్‌ బేస్‌డ్ ల‌వ్‌స్టోరీస్  అయిన ఇడియ‌ట్‌, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేర‌క్ట‌ర్ బేస్డ్ ల‌వ్‌స్టోరీ తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. యాటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్ అనే క్యాప్ష‌న్ పెట్టాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నెక్స్ట్ ఏంటి? అనే పాట కుర్ర‌కారుకు చాలా బాగా న‌చ్చింది. లోక‌ల్ గురించిన సైడ్ సైడ్  పాట కూడా చాలా పెద్ద స‌క్సెస్ అయింది. దేవిశ్రీ ప్ర‌తి పాట‌కూ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. 

ర‌చ‌యిత‌లు చ‌క్క‌గా రాశారు. ఒక్క‌సారి విన‌గానే మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకునేలా ఉన్నాయ‌ని నాతో చాలా మంది అన్నారు.  నాని నేచుర‌ల్ పెర్‌ఫార్మ‌ర్‌. ఇందులో ద‌ బెస్ట్‌గా న‌టించాడు. కీర్తి ఈ సినిమాలో మంచి రోల్ చేసింది.ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు చ‌క్క‌గా తెర‌కెక్కించారు.   ఫిబ్ర‌వ‌రి 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. మా సంస్థ నుంచి వ‌చ్చే సినిమాల కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటార‌ని తెలుసు. వారి అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా మేం `నేను లోక‌ల్‌`ను తెర‌కెక్కించాం` అన్నారు. 

నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా న‌టించిన  ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర పోషించారు.

ఈ చిత్రానికి సమర్పణ : దిల్ రాజు, సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019