యంగ్ టైగర్ ఎన్టీఆర్ కల నిజం కాబోతుంది..!

Sat 31st Dec 2016 06:29 PM
jr ntr,trivikram srinivas,ntr and trivikram combo,suryadevara radhakrishna,china babu  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కల నిజం కాబోతుంది..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కల నిజం కాబోతుంది..!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్  ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్  ప్రొడక్షన్ నంబర్ 5 చిత్రం 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్.. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో  కాలం గా అభిమానులు ఎదురు చూస్తున్నారు. వీరి ఆకాంక్షలు ఈ ఏడాదిలోనే (2017) సఫలం కానున్నాయి.  

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం ను నిర్మించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం, నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా  ప్రకటించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. 2017 సెప్టెంబర్ లో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ వంటి ఘనవిజయం సాధించిన  చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఈ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ నున్న చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ