విజయవాడలోనే 'ఖైదీ...' ఫంక్షన్..!

జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడ‌లో `ఖైదీ నంబ‌ర్ 150` ప్రీరిలీజ్ - రామ్‌చ‌ర‌ణ్‌

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `ఖైదీ నంబ‌ర్ 150` సంక్రాంతి కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీజ‌ర్లు, మేకింగ్ వీడియో స‌హా `అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు` ఆడియో సాంగ్‌కి ప్రేక్ష‌కాభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణం రానే వ‌చ్చింది. జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడలో `ఖైదీ నంబ‌ర్ 150` ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ అభిమానులు, సినీప్ర‌ముఖుల మ‌ధ్య‌ గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని చిత్ర‌ నిర్మాత మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150` కొత్త సంవ‌త్స‌రాన్ని కొత్త‌గా ప్రారంభించ‌బోతున్న సంద‌ర్భంగా చిత్ర‌ నిర్మాత చ‌ర‌ణ్ ప్రేక్ష‌కాభిమానుల‌కు క్రిస్మ‌స్, కొత్త‌ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. నేటి(శ‌నివారం) సాయంత్రం `ఖైదీ నంబ‌ర్ 150` నుంచి `సుంద‌రి..` సాంగ్ లాంచ్ అయిన‌ సంగ‌తి విదిత‌మే.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం, దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

mega star chiranjeevi
khaidi no 150 movie
audio function in vijayawada
audio released on january 4th 2017
ram charan
kajal
konidela productions company