రామ్‌చ‌ర‌ణ్ 'ధృవ' కి డేట్ ఫిక్సయింది..!

Sat 19th Nov 2016 09:25 PM
ram charan,dhruva,december 9th,dhruva release date,mega power star  రామ్‌చ‌ర‌ణ్ 'ధృవ' కి డేట్ ఫిక్సయింది..!
రామ్‌చ‌ర‌ణ్ 'ధృవ' కి డేట్ ఫిక్సయింది..!
Advertisement
Ads by CJ

డిసెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ 'ధృవ' విడుద‌ల‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో.. ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్ టైన‌ర్ 'ధృవ‌'.  హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా పాటలు ఇటీవ‌ల ఆదిత్య మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్లోకి విడుద‌లై ఆడియెన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. 

ఈ చిత్రంలో మెగాప‌వర్ స్టార్ రాంచ‌ర‌ణ్ [పవర్ ఫుల్ ఐ.పి.య‌స్ ఆఫీస‌ర్ ధృవ‌గా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. సినిమా ప్రారంభం నుండి సినిమాపై భారీ క్రేజ్ నెల‌కొంది.  ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. 

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ తమిజా,  ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ