Advertisement

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (02-11-16)..!

Thu 03rd Nov 2016 04:50 PM
okkadochhadu movie dubbing matter,care of godavari song launch matter,meelo okadi katha movie opening matter,dharmayogi piracy matter  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (02-11-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (02-11-16)..!
Advertisement
>డబ్బింగ్‌ కార్యక్రమాల్లో మాస్‌ హీరో విశాల్‌ 'ఒక్కడొచ్చాడు' 

మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా డబ్బింగ్‌ జరుపుకుంటోంది. 

నవంబర్‌ 7న ఆడియో, నవంబర్‌ 18న సినిమా రిలీజ్‌ 

ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో డబ్బింగ్‌ జరుగుతోంది. జగపతిబాబుగారు, బ్రహ్మానందంగారు, జె.పి.గారు డబ్బింగ్‌ పూర్తి చేశారు. మిగతా ఆర్టిస్టుల డబ్బింగ్‌ జరుగుతోంది. నవంబర్‌ 7న ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ చేసి, నవంబర్‌ 18న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులోని పాటలు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లను చాలా రిచ్‌గా తియ్యడం జరిగింది. సినిమాకి అవి చాలా పెద్ద హైలైట్‌ అవుతాయి. హిప్‌హాప్‌ తమిళ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఒక డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమా విశాల్‌ కెరీర్‌లోనే కాస్‌ట్లియస్ట్‌ మూవీ. మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం విశాల్‌కి మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. 

నవంబర్‌ మొదటి వారంలో ఆడియోను రిలీజ్‌ చేసి, నవంబర్‌ 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 'ఒక్కడొచ్చాడు' విశాల్‌కి తెలుగులో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది అన్నారు. 

విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

>విడుదలకు సిద్దమైన కేరాఫ్ గోదావరి 

రోహన్ ఎస్ హీరోగా పరిచయం అవుతూ రాజా రామ్మోహన్ దర్శకత్వంలో ఉషా మూవీస్ సమర్పణలో ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ, బొమ్మనా ప్రొడక్షన్  పతాకలపై  రూపొందుతున్న చిత్రం 'కేరాఫ్ గోదావరి'. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే పాటలు విడుదల కానున్నాయి. ఈ రోజు ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ని హైద్రాబాద్ లో లాంచ్ చేశారు. ఈ సందర్బంగా హీరో రోహన్ మాట్లాడుతూ .. గోదావరి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఇది. అలాగని గోదావరి నదికి ఈ కథకు ఏ సంబంధం లేదు, కేవలం గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరిగే ప్రేమకథ .. దాంతో పాటు ఓ స్ఫూర్తిని ఇచ్చే కథాంశంతో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం అమలాపురం, రాజమండ్రి తదితర  ప్రాంతాల్లో షూటింగ్ చేసాం. ఈ సినిమాతో నేను హీరోగా పరిచయం అవుతున్నాను. నేను హైద్రాబాద్ లోనే పుట్టి పెరిగాను, న్యూ యార్క్ లో స్కూల్ చదివినా కాలేజీ చదువు మాత్రం హైద్రాబాద్ లోనే సాగింది. చిన్నపుడు స్టేజి షో లు వేసే వాడిని, సినిమాలంటే చాలా  ఆసక్తి దాంతో అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో నటనలో ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ సినిమా దర్శకుడు రామ్మోహన్ ఈ వివి దగ్గర పనిచేసారు. చాలా మంచి కథతో ఈ సినిమా తీశారు. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఈ సినిమాలో ఓ సాంగ్ ను రఘు కుంచె గారు కాంపోస్ చేశారు. ఈ రోజు ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేస్తున్నాం. నిజానికి ఈ కథలో డాన్స్ కు స్కోప్ లేదు, కానీ ప్రమోషన్ కోసం ఓ డాన్స్ సాంగ్ ని విడుదల చేస్తున్నాం, ఇక ఈ సినిమాతో శృతి వర్మ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం అన్నారు. 

>'ధర్మయోగి' చిత్రం పైరసీ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం 

- నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ 

ధనుష్‌ హీరోగా ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో 'కొడి' చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సిి.హెచ్‌.సతీష్‌కుమార్‌ 'ధర్మయోగి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈచిత్రం గత శనివారం విడుదలై భారీ ఓపెనింగ్స్‌తో విడుదలైన అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. ఒక పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో ధనుష్‌, త్రిషల పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా రూపొందిందనే మౌత్‌టాక్‌ బాగా స్ప్రెడ్‌ అవడంతో పైరసీదారుల దృష్టి ఈ చిత్రంపై పడింది. కొందరు పైరసీ దారులు ఆన్‌లైన్‌లో 'ధర్మయోగి' చిత్రాన్ని పోస్ట్‌ చేసినట్టు సమాచారం అందడంతో హైదరాబాద్‌లోని యాంటీ పైరసీ సెల్‌కి ఫిర్యాదు చేశారు నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌. వారు వెంటనే స్పందించి ఆన్‌లైన్‌లో వున్న 'ధర్మయోగి' చిత్రాన్ని తొలగించారు. అంతేకాకుండా అది ఏ ఐపి అడ్రస్‌ ద్వారా పోస్ట్‌ అయిందనే విషయంపై ఎంక్వయిరీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని నిర్మాత తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని ఎవరైనా డౌన్‌లోడ్‌ చేస్తే ఐపి అడ్రస్‌ ఆధారంగా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధనుష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ దిశగా దూసుకెళ్తున్న ధర్మయోగి చిత్రాన్ని పైరసీ ద్వారా చూడొద్దని, దానివల్ల మంచి చిత్రాలు తీసే నిర్మాతలు భారీగా నష్టపోతారని, కాబట్టి థియేటర్లలోనే సినిమాలు చూసి ఎంజాయ్‌ చెయ్యాలని ఈ సందర్భంగా నిర్మాత సతీష్‌కుమార్‌ ప్రేక్షకులను కోరారు. 

>‘మీలోఒకడి కధ’ షుటి౦గ్ ప్రార౦భ౦ 

ప్రజాపతి చిత్ర శాల పతాక౦ పై యువ నిర్మాత ప్రజాపతి శ౦కర్ స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం ‘మీలో ఒక్కడి కధ’ షుటి౦గ్ బుధవారం ఉదయం ఫిలి౦ చా ౦బర్ హాల్లో ప్రారంభం అయి౦ది.దేవుని పటాలపై పూజ అన౦తతర౦ స్ర్కిప్ట్ ను దర్శకుడు వీరశ౦కర్ చేతుల మీదుగా దర్శక,నిర్మాత ప్రజాపతి శ౦కర్ అ౦దుకొన్నారు. తొలిసన్నివేశానికి ఎ.పి ఫిలి౦ చా౦బర్ అద్యక్షులు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారా యణ కెమెరా స్విచ్చాన్ చేసారు. అన౦తర౦ జరిగిన విలేఖరుల సమావేశంలో దర్శక,నిర్మాత ప్రజా పతి శ౦కర్ మాట్లాడుతూ’ అ౦తా కొత్త వారితో తీస్తున్నాను. త్వరలో ఒకే షెద్యూల్ లో జరిగే షుటి౦గ్ తో  చిత్రం పూర్తవుతు౦ది. మేము చేసే చిన్న చిత్రానికి పెద్ద మనస్సుతో  దీవి౦చటానికి వచ్చిన కళ్యాణ్ గారికి,రామసత్యనారాయణ గారికి, మెహన్ గౌడ్ గారికి ధ్యా౦క్స్ చెపుతున్నాను ఆన్నారు.తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ చిన్నసినిమాల మనుగడతోనే పరిశ్రమ అభివృద్ధి ఆధారపడి ఉ౦టు౦ది.కొత్తవారితో చేసే సినిమాల వల్ల ఎ౦దరో కొత్తనటి నటులు నిర్మాతలు,దర్శకులు పరిచయమై కొత్త నీరుతో పరశ్రమ కళకళలాడుతూ ఉ౦టు౦దన్నారు.మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఈ కధ విన్నాను. సినిమా చేసే వార౦తా చెప్పే మాట మేము వెరైటిగా చేస్తున్నామని, కాని ఈ చిత్ర కధ విన్నప్పుడు నిజంగా ఇది పూర్తిగా కొత్తదనంతో కూడి ఉ౦దని అన్ని వర్గాల ప్రెక్షకులకు నచ్చుతు౦దనే అభిప్రాయం కలిగి౦దన్నారు. 

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement