Advertisement

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (12-10-16)..!

Thu 13th Oct 2016 04:29 PM
dharma yogi movie news,kotikokkadu movie audio matter,krisna movie producer,v.v.vinayak,sirish movie,team 5 movie news  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (12-10-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (12-10-16)..!
Advertisement
>'కోటికొక్కడు' ఆడియో విడుదల 

సి.ఎల్‌.ఎన్‌.మీడియా, లగడపాటి శ్రీనివాస్‌, గూడూరి గోపాల్‌శెట్టి అందిస్తున్న చిత్రం కోటికొక్కడు. తమిళం, కన్నడంలో విడుదలైన ఈ చిత్రం కోట్లకు పైగా భారీ వసూళ్లను సంపాదించింది. సుదీప్‌, నిత్యామీనన్‌ హీరో హీరోయిన్స్‌గా నటించారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. 

ఆడియో వేడుకలో దర్శకరత్న డా||దాసరి నారాయణరావు, శిల్పిక, లగడపాటి శ్రీనివాస్‌, దీప్తి, ప్రసన్నకుమార్‌, ప్రియాంక, రామసత్యనారాయణ, లయన్‌ సాయివెంకట్‌, ప్రతాని రామకృష్ణ గౌడ్‌, డి.ఎస్‌.రావు, రమ్యశ్రీ, శృతి శర్మ, సముద్ర, మనోజ్‌ నందం తదితరులు పాల్గొన్నారు. 

ఆడియో వేడుకలో బిగ్‌ సీడీని దర్శకరత్న డా||దాసరి నారాయణరావు విడుదల చేశారు. ఆడియో సీడీలను సముద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా... 

ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ - లగడపాటి శ్రీనివాస్‌గారు కాకతీయుడు సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. ఇప్పుడు కోటికొక్కడు, 100 డిగ్రీ సెల్సియస్‌ సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనివాస్‌గారికి కర్నూలు గోపాల్‌గారు, శోభారాణిగారు అండగా నిలబడుతున్నారు. శ్రీనివాస్‌గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. 

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - సుదీప్‌ కెరీర్‌లో ఈగ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో మనకు తెలిసిందే. దాని తర్వాత కన్నడంలో కోటికొక్కడు సెన్సేషనల్‌ హిట్‌ సాధించింది. మంచి టైటిల్‌. సుదీప్‌కు తెలుగులో మంచి మార్కెట్‌ క్రియేట్‌ అయ్యింది. శోభారాణిగారు ఏ సినిమా చేసినా భారీ సినిమాలే ఉంటాయి. సి.ఎల్‌.ఎన్‌ మీడియా బ్యానర్‌ పెద్ద నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. 

డి.ఎస్‌.రావు మాట్లాడుతూ - కోటికొక్కడు కన్నడంలో ఘన విజయాన్ని సాధించింది. కన్నడ కంటే తెలుగులో అతి పెద్ద సక్సెస్‌ కావాలి అన్నారు. 

ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ - సుదీప్‌ అందరికీ తెలిసిన హీరో. కన్నడ కంటే తెలుగులో పెద్ద సక్సెస్‌ కావాలి. నిర్మాత లగడపాటి శ్రీనివాస్‌కు ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు. 

సముద్ర మాట్లాడుతూ - లగడపాటిశ్రీనివాస్‌ నా దర్శకత్వంలో కాకతీయుడు సినిమాను నిర్మించాడు. ఇప్పుడు కన్నడలో ఘన విజయం సాధించిన కోటికొక్కడు తెలుగులో కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. 

నికిషా పటేల్‌ మాట్లాడుతూ - మలయాళంలో రూపొందిన 100 డిగ్రీ సెల్సియస్‌ను ఇప్పుడు మిత్రన్‌గారు తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. సినిమాలో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అన్నారు. 

లక్ష్మీరాయ్‌ మాట్లాడుతూ - ఈ సినిమా ఐదు గురు హీరోయిన్స్‌పై నడిచే రియల్‌ ఇన్‌సిడెంట్స్‌పై నడుస్తుంది. సి.ఎల్‌.ఎన్‌.మీడియా బ్యానర్‌కు గుడ్‌లక్‌ అన్నారు. 

దర్శకరత్నడా||దాసరి నారాయణరావు మాట్లాడుతూ - శోభారాణిగారికి సినిమాలంటే చాలా ప్యాషన్‌. ఎంత డబ్బు పొగొట్టుకుందో నాకు తెలుసు. అందుకని ఓ సినిమా చేయమని తనకు చెప్పాను. అందుకని తను వండర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకుంది. డైరెక్టర్‌ మిత్రన్‌పై చాలా కాన్ఫిడెన్స్‌ ఉంది. తమిళంలో ధనుష్‌తో పెద్ద హిట్‌ మూవీ చేశాడు. మంచి స్టార్‌ కేస్ట్‌ ఉన్న చిత్రం. టాప్‌ హీరోయిన్స్‌ ఉన్న సినిమాగా ఇది నిలుస్తుంది. చిన్న సినిమాను పెద్దగా తీయాలనుకున్న నిర్మాతలను అభినందిస్తున్నాను అన్నారు. 

>త‌ల‌సాని, వినాయ‌క్ తో `కృష్ణ` నిర్మాత నూత‌న కార్యాల‌యం ప్రారంభం!!

కృష్ణ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో టాలీవుడ్ కు నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు కాశీ విశ్వ‌నాధ‌మ్. ర‌వితేజ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మీ న‌ర‌సింహ విజువ‌ల్స్ ప‌తాకంపై తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజై అప్ప‌ట్లో క‌మ‌ర్శియ‌ల్ గా భారీ విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఎంద‌రో స్టార్ హీరోల సినిమాల‌ను తెలుగు రాష్ర్టాల్లో శ్రీరామ‌కృష్ణ పిక్చ‌ర్స్ అనే డిస్ర్టీబ్యూష‌న్ సంస్ధ ద్వారా రిలీజ్ చేశారు. రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన నాయ‌క్ చిత్రాన్ని గుంటూరు ఏరియా.. గోపీచంద్ హీరోగా రూపొందిన శంఖం, నితిన్ న‌టించిన దిల్ సినిమాలను ఈస్ట్, వెస్ట్ గోదావ‌రి ఏరియాలు డిస్ర్టిబ్యూష‌న్ ఈ సంస్ధ ద్వారానే జ‌రిగింది. ఆ మ‌ధ్య ర‌వితేజ హీరోగా న‌టించిన కిక్ సినిమాను ప‌లు పంపిణీ సంస్థ‌ల‌తో క‌లిసి డిస్ర్టిబ్యూట్ చేశారు.

అలాగే బాలీవుడ్ మూవీ హార‌ర్ స్టోరీ చిత్రాన్ని.. త‌మిళ్ హీరో విజ‌య్ హీరోగా న‌టించిన త‌లైవా చిత్రాన్ని తెలుగులో అన్న‌పేరుతో అనువ‌దించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించింది ఈ సంస్థ‌నే. తాజాగా ఈ సంస్థ ఓ నూత‌న కార్యాల‌యాన్ని హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ప్రారంభించింది. తెలంగాణ సినిమాటో గ్ర‌ఫీ మంత్రి శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స్టార్ డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ చేతుల మీదుగా ఈ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా అతి త్వ‌ర‌లోనే త‌మ బ్యాన‌ర్ లో కొత్త సినిమా ప్రారంభ‌మ‌వుతుందని నిర్మాత తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, దాస‌రి కిర‌ణ్ కుమార్, సురేష్ కొండేటి, రైట‌ర్ విస్సు , శేరిలింగం ప‌ల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

>ధనుష్‌ 'ధర్మయోగి'(ది లీడర్‌) మోషన్‌ పోస్టర్‌ విడుదల 

రఘువరన్‌ బి.టెక్‌ చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ మరో సెన్సేషనల్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధనుష్‌ మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రిష ఈ చిత్రంలో చేస్తున్న క్యారెక్టర్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ పాత్రను పోలి వుంటుంది. విభిన్న కథాంశంతో, పవర్‌ఫుల్‌ క్యారెక్టరైజేషన్స్‌తో తమిళ్‌లో కొడి పేరుతో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని తెలుగులో ధర్మయోగిగా విడుదల చేస్తున్నారు. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ఈరోజు విడుదలైంది. 

ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ - పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో ధనుష్‌ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్‌ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం కొడి. తొలిసారి ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి.రఘువరన్‌ బిటెక్‌ చిత్రంతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ధనుష్‌ నటిస్తున్న ఈ తాజా చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు వున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెలుగులో ధర్మయోగి పేరుతో విడుదల చేస్తున్నాం. ఇటీవల తమిళ్‌లో విడుదలైన ఆడియోకు, ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈరోజు ధర్మయోగి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. అన్నిచోట్ల నుంచి చాలా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కబాలి చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు చేశారు. ఈ చిత్రం ఆడియోను ఈనెల మూడోవారంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయ్యే ఈ చిత్రం మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది అన్నారు. 

>శిరీష్ హీరోగా, వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో సూప‌ర్ హిట్ ఇచ్చిన త‌రువాత మంచి క‌థ‌ల‌తో ముందుకు వెలుతున్న అల్లు శిరీష్ హీరోగా, టైగ‌ర్ లాంటి స‌క్స‌స్‌ఫుల్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా త‌న టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది.

ప్ర‌స్తుతం ఈచిత్రం యోక్క స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ హీరోగా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌స‌న్సెష‌న‌ల్ మూవి తెర‌కెక్కుతుంది. ఈచిత్రం ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తిచేస‌కుంది. ఈ చిత్రం త‌రువాత శిరీష్ హీరోగా చిత్రం సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది. మ‌రిన్ని వివ‌రాలు అతిత్వ‌ర‌లో నిర్మాత‌లు తెలియ‌జేస్తారు.

 

>ఆస్ట్రేలియాలో పాట‌ల చిత్రీక‌ర‌ణ చేసుకున్న స్టైలిష్‌ ఎంటర్ టైనర్  క్రికెటర్ శ్రీశాంత్ 'టీమ్ 5' చిత్రం

ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. శ్రీశాంత్ చాలా మంచి క్రికేట‌ర్ నే కాదు మంచి డ్యాన్సర్ అని ఈచిత్రంతో తెలుస్తుంది. రాజ్ జకారిస్ ప్రోడ్యూస‌ర్ గా త‌న‌ ప్రొడక్షన్ వాల్యూస్, సురేష్ గోవింద్ చెప్పిన కథ, కథనం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. పదునైన బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ ను హడలెత్తించిన శ్రీశాంత్... నటనలోనూ అంతే చలాకితనం, అంతే పట్టుదలను చూపించారు. ఇందులో శ్రీశాంత్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. తన క్యారెక్టర్ తో పాటు, డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్, గెటప్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక కన్నడ స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ, శ్రీశాంత్ పెయిర్ చూడముచ్చటగా ఉండనుంది. వీరితో పాటు పెర్ల్ మానే, మఖరంద్ దేశ్ పాండే ఇతర పాత్రలు పోషించారు. గోపి సుందర్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంభందిచిన సాంగ్స్ చిత్రీక‌ర‌ణ ఆస్ట్రేలియాలో ని మెల్‌బోర్న లో జ‌రుపుకుంటుంది.  తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అతి త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ జకారియాస్ మాట్లాడుతూ... ఇండియన్ మాజీ స్టార్ క్రికెటర్ శ్రీశాంత్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూపించే అదృష్టం మాకు ల‌భించినందుకు చాలా ఆనందంగా వుంది. ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.  శ్రీశాంత్ ని హీరోగా పరిచయం చేయాలన్న మా డ్రీమ్ కంప్లీట్ అయ్యింది.  ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఉండే క్యారెక్టర్ కావడంతో మాంచి ఎన‌ర్జితో చేస్తున్నాడు. డైలాగ్స్, డ్యాన్సులు, ఫైట్స్ ఇరగదీస్తున్నారు. కన్నడ స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ, శ్రీశాంత్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. టీమ్ 5 అనే టైటిల్ కు తగ్గట్టుగా మా దర్శకుడు సురేష్ గోవింద్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ని మెల్బోర్న్ లో సాంగ్ చిత్రీక‌ర‌ణ జరుగుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అతిత్వ‌ర‌లో లో రిలీజ్ చేయబోతున్నాం. త్వరలోనే మరిన్ని వివరాల్ని తెలియజేస్తాం. అని అన్నారు.  

 

>మిస్ ఇ౦డియా రేష్మి టాగూర్ ను అభినందించిన తెల౦గాణా ఫిలి౦ చా౦బర్

తెలంగాణా ఫిలి౦ చా౦బర్ ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహి౦చి౦ది. ఇ ప్పుడు మనతెలుగు అమ్మాయి, ముఖ్య౦గా మారుమూల తెల౦గాణలోని పల్లె లో పుట్టి పెరిగిన కుమారి రేష్మి టాగూర్ మిస్ ఇ౦డియా స్టాయికి వెళ్ళటమే కాక రేపు జరగబోయే మిస్ వరల్డ్ పోటీకి సిద్ధమైనప్పుడు ఆమెను  ప్రోత్సాహి౦చటం  దర్మ౦గా భావి౦చామని, ఆమెకు ఖర్చుల నిమిత్తం ఇదు లక్షల రూపాయిలు అ౦దజేస్తున్నామని తెల౦గాణ ఫిలి౦ చా౦బర్ అద్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. మిచ్చమ్మ చారిటిస్ ట్రస్ట్ చైర్మేన్ డాక్టర్ వె౦కట్, వాల్గా ఇప్రో క౦పెనీ చై ర్మేన్ జి. శ్రీధరరావు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

బుధవారం ఫిలి౦ చా౦బర్ లో జరిగిన  మిస్ ఇ౦డియా కుమారి రేష్మి అభిన౦దన సభలో ఇదు లక్షలరూపాయిల చెక్కును అ౦దజేశారు. తలపై క్రేన్ ను అల౦కరి౦చారు. శాలువాతో సత్కరి౦చారు. మిస్ వరల్డ్ గా గెలుపుతో రావాలని కాక్షి౦చారు. ఈ సభలో రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ఈ వారంలో కొలాలంహపూర్లో  జరిగే మిస్ వరల్డ్ పోటికి మన తెల౦గాణాకు చే౦దిన అమ్మాయి వెళుతు౦దని అనుకొ౦టునప్పుడు చా౦బర్ లో సభ్యులు అయిన డాక్టర్ వె౦కట్ స్ప౦ది౦చి సహాయం చెసె౦దుకు ము౦దుకు వచ్చారన్నారు. ఈమె మిస్ వరల్డ్ గా రావాలని కోరుకో౦టున్నాము అన్నారు. అమీర్ పేటలో సినిమా హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ  రేష్మి టాగూర్  మోడల్ గా ఎ౦తో కష్టపడి ఈ స్తాయికి వచ్చి౦దన్నారు.మిస్ హైదరాబాద్ గా, మిస్ ఆ౦ద్రాగా, ఇప్పుడు మిస్ ఇ ౦డియాగా రేపు మిస్ వరల్డ్ పోటీలో కూడా ఎన్నికఅవ్వాలని, ఆమె కూడా సిని నటిగా రాణి౦చాలని కోరారు. మిచ్చమ్మ చారిటిబుల్ ట్రస్ట్ చైర్మేన్ డాక్టర్ వె౦కట్  మాట్లాడుతూ మద్య తరగతి చె౦దిన కరీంనగర్ కు చె౦దిన అమ్మాయి  రేష్మి టాగూర్ కు ఇ౦త మ౦చి అవకాశం రావటం స౦తొష౦గా ఉ౦దని, ఈ వయస్సులో చనిపోయిన మా అమ్మాయి మిచ్చమ్మ పేరుతో నెలకొల్పిన ఈ ట్రస్ట్ ద్వారా ఇ లా౦టి కార్యక్రమాలు భవిషత్తు లో మరిన్ని చేయాలనుకోటు౦న్నానని తెలిపారు. రేష్మి టాగూర్ మాట్లాడుతూ పిల్లల మనస్త్వాతాన్ని గుర్తెరిగిన తల్లిదండ్రులు వారిని ఆ దిశగా ప్రొత్సాహ౦ ఇవ్వాలని కోరారు.తనకు ఇస్తున్న తోడ్పాటుకు కృతఙ్ఞతలు తెలిపారు.ఈ సభలో తెల౦గాణ పిలి౦ చా౦బర్ కార్యదర్శి సాయివె౦కట్, తెలుగు టివి ఫేడరేషన్ చైర్మెన్ శ్రీనివాసరావు, శ్రీధరరావు, తమిళ,ఆ౦ద్రా తెలుగు అసోయేషన్ కార్యదర్శి కేతిరెడ్డి జగదీష్ రెడ్డి, పిలి౦ ఇనిస్తూయట్ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.    

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement