Advertisement

'అభినేత్రి' తో బొమ్మాళి ని మర్చిపోతారంట!

Mon 26th Sep 2016 05:47 PM
abhinetri,abhinetri audio launch,abhinetri songs release,abhinetri movie audio launch details,kona venkat,tamanna,sonu sood,rakul preet singh,prabhu deva  'అభినేత్రి' తో బొమ్మాళి ని మర్చిపోతారంట!
'అభినేత్రి' తో బొమ్మాళి ని మర్చిపోతారంట!
Advertisement

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎ.ఎల్. విజ‌య్ తెర‌కెక్కించిన విభిన్న క‌థాచిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, బ్లూ స‌ర్కిల్ కార్పోరేష‌న్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి. ఈ భారీ చిత్రం తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందింది. దాదాపు 70 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందిన‌ అభినేత్రి ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి హాజ‌రైన కొర‌టాల శివ‌ అభినేత్రి బిగ్ సీడీను ఆవిష్క‌రించగా,  ర‌కుల్ ప్రీత్ సింగ్ ఆడియో సీడీను ఆవిష్క‌రించారు. ఇక థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ...అభినేత్రి వెన‌క‌కాల ఉన్న అధినేత కోన వెంక‌ట్ ను అభినందిస్తున్నాను. త‌మ‌న్నా గ్లామ‌ర్ ని ప‌క్క‌న‌పెట్టి ప‌ర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర‌తో అభినేత్రి అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. విజ‌య్ తెర‌కెక్కించిన మ‌ద‌రాసు ప‌ట్ట‌ణం సినిమా నాకు ఇష్టం. మంచి సినిమాలు తీసే విజ‌య్  అద్భుత‌మైన డ్యాన్స‌ర్ ప్ర‌భుదేవాను ఇంకా బాగా చూపించి ఉంటారు అనుకుంటున్నాను. ఈ చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూస్తాను అన్నారు.

గీత ర‌చ‌యిత రామ‌జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ...ప్ర‌భుదేవా గారి డ్యాన్స్ చూసి పెరిగిన‌వాళ్లం. ప్ర‌భుదేవా గారు న‌టించిన ఈ మూవీకి సాంగ్స్ రాయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి పాట‌లు రాసే అవ‌కాశం ఇచ్చిన కోన వెంక‌ట్ గార్కి, నిర్మాత స‌త్య‌నారాయ‌ణ‌గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

నిర్మాత అరుణ్ మాట్లాడుతూ...ఈ చిత్రాన్ని శివ‌తో క‌లిసి నిర్మించాను. మంచి సినిమాలు నిర్మించాల‌ని బ్లూ స‌ర్కిల్ కార్పోరేష‌న్ సంస్థ‌ను నిర్మించాం. మాకు  కోన వెంక‌ట్ ఎంత‌గానో స‌హ‌క‌రించారు. ఈ ట్రైల‌ర్ చాలా బాగుంది. పాట‌లు కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా ఎక్స్ లెంట్ గా ఉంటుంది. మంచి చిత్రాన్ని అందించిన డైరెక్ట‌ర్ విజ‌య్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

నిర్మాత శివ మాట్లాడుతూ....10 ఇయ‌ర్స్ నుంచి సినిమా తీయాల‌నుకుంటున్నాను అది ఈ సినిమాతో నెర‌వేరింది.  నేను ప్ర‌భుదేవా గార్కి పెద్ద ఫ్యాన్ ని.  ఫ‌స్ట్ ఫిల్మ్ ప్ర‌భుదేవా గారితో చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. మేము మంచి సినిమాలు అందించాల‌నే ఈ సంస్థ‌ను నిర్మించాం. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని మంచి చిత్రాల‌ను అందిస్తాం అన్నారు.

డైరెక్ట‌ర్ శ్రీవాస్ మాట్లాడుతూ... ఫ‌స్ట్ సాంగ్ లో ప్ర‌భుదేవా గారి డ్యాన్స్ చూసి షాక్ అయ్యాను.  సెకండ్ సాంగ్ లో త‌మ‌న్నా డ్యాన్స్ చూసి  షాక్ అయ్యాను. కోన వెంక‌ట్ గారు నాకు ఈ మూవీ క‌థ చెప్పారు చాలా బాగుంది.  డిఫినెట్ గా ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంది. ప్ర‌భుదేవా గారు మా అంద‌రికీ ఇన్ స్పిరేష‌న్.  ప్ర‌భుదేవా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. విజ‌య్ తెర‌కెక్కించిన నాన్న సినిమా చూసి ఇలాంటి సినిమా చేయాలి అనుకున్నాను. అభినేత్రి బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ...ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, సోనూ సూద్ న‌టించిన అభినేత్రి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఒక పండ‌గ లాంటి సినిమా. ద‌స‌రా కానుక‌గా వ‌స్తున్న అభినేత్రి బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో నాని మాట్లాడుతూ...త‌మ‌న్నా డ్యాన్స్ చూసిన త‌ర్వాత నేను అలా డ్యాన్స్ చేయ‌లేను అనిపించింది. అందుక‌నే త‌మ‌న్నా డ్యాన్స్ చేసిన వీడియో చూడకూడ‌దు అనుకున్నాను కానీ...ఆ వీడియోను నేనే రిలీజ్ చేయాల్సి వ‌చ్చింది.   ప్ర‌భుదేవాకి బిగ్ ఫ్యాన్ ని. చికుబుకు రైలే పాట అంటే చాలా ఇష్టం. చిన్న‌ప్పుడు ఆ పాట‌కు డ్యాన్స్ చేయాలని ప్రాక్టీస్ చేసేవాడిని. డైరెక్ట‌ర్  విజ‌య్ సినిమాలు అంటే చాలా ఇష్టం. త‌మిళ్ లో ఉన్న నా ఫ్రెండ్స్ ద్వారా విజ‌య్ మంచి డైరెక్ట‌ర్ క‌న్నా మంచి మ‌నిషి అని విన్నాను. అలాంటి మంచి మ‌నిషికి స‌క్సెస్ రావాలి అన్నారు.

ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ....ట్రైల‌ర్ చూసాకా అభినేత్రి ఏత‌ర‌హా సినిమా అనే ఇంట్ర‌స్ట్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రంలో కొన్ని పాట‌లు విన్నాను చాలా బాగున్నాయి. విజ‌య్ సినిమాల‌కు అలాగే ప్ర‌భుదేవాకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఈ మూవీ బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్  విజ‌య్ మాట్లాడుతూ...సాజిద్ సార్ అమేజింగ్ మ్యూజిక్ కంపోజ‌ర్. ఈ మూవీకి చాలా మంచి సాంగ్స్ అందించారు. సాజిద్ సార్ అందించిన మ్యూజిక్ ఈ మూవీకి విజిటింగ్ కార్డ్ గా ప‌ని చేసింది.  కోన గారు సినిమా చూడ‌కుండా  స్ర్కిప్ట్ నుంచే ఈ మూవీ పై పూర్తి న‌మ్మ‌కం చూపించారు. ఈ చిత్రంలో త‌మ‌న్నా ప‌ర్ ఫార్మ‌న్స్ అమేజింగ్. సోనూ ఇప్ప‌టి వ‌ర‌కు యాక్ష‌న్ చూపించాడు. ఈ మూవీలో అంద‌ర్నీ స‌ర్ ఫ్రైజ్ చేస్తూ రొమాన్స్ చేసాడు. నేను  ప్ర‌భుదేవా ప్యాన్ ని. త‌మిళ్ లో ఆయ‌నే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఆడియో వేడుక‌కు విచ్చేసిన క్రిష్‌, కొర‌టాల శివకు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. మా టీమ్ అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి వ‌ర్క్ చేసారు.  మా క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం వ‌స్తుంద‌ని ఆశిస్తూ రిజ‌ల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు.

త‌మ‌న్నా మాట్లాడుతూ... ర‌కుల్ ప్రీత్ సింగ్ తో పాటు చాలా మంది గెస్ట్ లు వ‌చ్చి మా ఆడియో వేడుక‌ను స్పెష‌ల్ ఈవెంట్ గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.  ఈ మూవీకి మ్యూజిక్ అందించిన‌ బాలీవుడ్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాజిద్ కి  వెల్ క‌మ్ చెబుతున్నాను.  ప్ర‌భుదేవా అంటే నాకు ఎంత అభిమాన‌మో మాట‌ల్లో చెప్ప‌లేను. ఇక నుంచి ప్ర‌భుదేవాని గురువుగా భావించి డ్యాన్స్ చేస్తాను. ఈ మూవీలో కామెడీ చాలా బాగుంటుంది. అలాగే ఈ చిత్రంలో సోనూ చాలా అందంగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత సోనూని బొమ్మాలి అని పిల‌వ‌డం మ‌ర‌చిపోయి హీరోలా చూస్తారు. ఈ సినిమాలో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను.  నా కెరీర్ స్టార్ట్ అయిన‌ప్పుడు నా ఫ‌స్ట్ ఫిల్మ్ స్టోరీ కోన‌నే చెప్పారు. ఈ సినిమాతో కోన‌కు మంచి డ‌బ్బులు రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

Click Here to see the Abhinetri Audio Launch Photos

కోన వెంక‌ట్ మాట్లాడుతూ....ఈ సినిమా భారీ సినిమాగా అవ్వ‌డానికి కార‌ణం ప్ర‌భుదేవా. ఇక ఈ మూవీ కోసం డైరెక్ట‌ర్ విజ‌య్ చాలా హార్డ్ వ‌ర్క్ చేసారు. ఈ సినిమా నాకు విజ‌య్ అనే గొప్ప స్నేహితుడున్ని ఇచ్చింది. రైట‌ర్స్ అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన కొర‌టాల‌కు మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. రైట‌ర్స్ కు  గుర్తింపు వ‌చ్చింది అంటే కార‌ణం కొర‌టాల శివ‌. ఈ వేడుక‌కు వ‌చ్చి కొర‌టాల శివ ఆడియో లాంచ్ చేయ‌డం సంతోషంగా ఉంది. ఇక  ప్ర‌భుదేవా గారు గురించి చెప్పాలంటే...చాలా సింపుల్ గా ఉంటారు. మూవీ కోసం చాలా కష్ట‌ప‌డ్డారు. ఆయ‌న హార్డ్ వ‌ర్క్ చూసి చాలా నేర్చుకున్నాం. ఈ చిత్రంలో ప్ర‌భుదేవా గారు ఉన్నారు అభినేత్రి అనే టైటిల్ యాప్ట్ గా ఉంటుందా లేదా అని కొంచెం భ‌య‌ప‌డ్డాం. అయితే...ప్ర‌భుదేవా గారే మాకు చంద్ర‌ముఖి టైటిల్ గుర్తు చేసి అభినేత్రి బాగుంటుంది అని చెప్పారు. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో ఏ హీరోయిన్ అయినా న‌టిస్తే స్టార్ డ‌మ్ వ‌స్తుంది కానీ...త‌మ‌న్నాఈ మూవీ క‌న్నా ముందే హీరో స్ధాయిలో ఇమేజ్ సొంతం చేసుకుంది అన్నారు.

ప్ర‌భుదేవా మాట్లాడుతూ...ఈ మూవీకి గ‌ణేష్ సార్ ఓ పిల్ల‌ర్ అయితే మ‌రో పిల్ల‌ర్ కోన వెంక‌ట్ గారు. ఈ చిత్రంలో న‌టించిన ఆర్టిస్ట్ లు కంటే ఎక్కువ మంది ఈ మూవీకి నిర్మాత‌లు. మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ సాజిద్ వాజిద్ కి స్వాగ‌తం చెబుతున్నాను. అలాగే విశాల్ మ‌రింత‌గా రాణించాల‌ని కోరుకుంటున్నాను. సోనూ సూద్ నాకు బ్ర‌ద‌ర్ లాంటివాడు. 25 ఏళ్ల పాటు సోనూతో జ‌ర్నీ చేయాల‌నుకుంటున్నాను. త‌మ‌న్నా మంచి న‌టి క‌న్నా ఒక అద్భుత‌మైన మ‌నిషి. డైరెక్ట‌ర్ విజ‌య్ కి చాలా ఓపిక ఎక్కువ‌. సెట్ లో చిన్న టెక్నీషియ‌న్స్ కి సైతం ఎంతో ఓపిక‌గా చెబుతుంటారు.  ఈ చిత్రానికి వ‌ర్క్ చేసిన గీత ర‌చ‌యిత‌లంద‌రూ మంచి పాట‌లు అందించారు అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సోనూ సూద్,  రాజ్ త‌రుణ్, అభిపేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్, క్రిష్‌, ముర‌ళీశ‌ర్మ‌, నిర్మాత దాన‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement