Advertisement

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (9-9-16)..!

Sat 10th Sep 2016 04:00 PM
abhinetri,nirmala convent,vanavillu,lachhi,jayathi,nagarjuna,nimmagadda prasad,tamanna,prabhu deva,tollywood tazaa updates,tollywood tajaa updates,september 9th  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (9-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (9-9-16)..!
Advertisement
>1. సెప్టెంబర్‌ 11న 'అభినేత్రి' థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ 

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 11 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రభుదేవా, తమన్నా, చిత్ర సమర్పకుడు కోన వెంకట్‌, నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అక్టోబర్‌ 7న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌. 

>2. 'వానవిల్లు' ట్రైలర్‌ విడుదల 

రాహుల్‌ ప్రేమ్‌ (ఆర్పీ) మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రతీక్‌, శ్రావ్య, విశాఖ హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాతగా ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వానవిల్లు'. ఈ చిత్ర ట్రైలర్‌ని హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా హీరో, దర్శకుడైన ప్రతీక్‌ మాట్లాడుతూ...నాకు సినిమా అంటే చాలా ఇష్టం. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ డైరెక్ట్‌ చేశాను. నాకున్న ఇంట్రెస్ట్‌, టాలెంట్‌ చూసి మానాన్న గారు నన్ను ఎంతగానో ఎంకరైజ్‌ చేశారు.అంతేకాదు, నా మీద నమ్మకంతో ఈ మూవీని ప్రొడ్యూస్‌ కూడా చేశారు. ఈ సినిమాతో మా నాన్నగారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను...అని అన్నారు. 

హీరోయిన్‌ శ్రావ్య మాట్లాడుతూ..ఈ సినిమా కథ చాలా బాగుంది. నేను కన్నడలో 4 సినిమాలు చేశాను. ఈ సినిమా కథ ఎంతగానో నచ్చడంతో..ఈ మూవీలో నటించడానికి ఒప్పుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు ధన్యవాదాలు అని అన్నారు. 

కెమెరామెన్‌ ఎస్‌.డి. జాన్‌ మాట్లాడుతూ..డైరెక్టర్‌, హీరో అయిన ప్రతీక్‌ వయసు 20 సంవత్సరాలుంటుంది. 20 సంవత్సరాల కుర్రాడు..ఇతనేం డైరెక్ట్‌ చేస్తాడని ముందు అనుకున్నా..కానీ..అతని డెడికేషన్‌కి, సినిమాపై అతనికున్న క్లారిటీకి ముగ్ధుడినయ్యాను...అన్నారు. 

నిర్మాత లంకా కరుణాకర్‌ దాస్‌ మాట్లాడుతూ...మా అబ్బాయి ప్రతీక్‌ గురించి చెబితే కొంచెం అతిశయోక్తిగా ఉంటుంది. కానీ అతనికున్న టాలెంట్‌కి, ఫ్యాషన్‌ని చూసి..ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాను. ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించాడు. కేరళ, మలేషియా, అరకు, హైద్రాబాద్‌ మొదలగు ప్రదేశాల్లో ఖర్చుకు వెనకాడకుండా..ఒక విజువల్‌ వండర్‌లాగా చిత్రాన్ని నిర్మించాము. ట్రైలర్‌ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము...అని అన్నారు. 

సంగీత దర్శకుడు లంకా ప్రభు ప్రవీణ్‌, హీరో మదర్‌, జబర్ధస్త్‌ ఫణి మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ప్రతీక్‌ప్రేమ్‌కరణ్‌, శ్రావ్య, విశాఖ, హేమ, ప్రభాస్‌ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్ధస్త్‌ ఫణి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్‌, డైలాగ్స్‌: పవన్‌, ఫైట్స్‌: నందు, ప్రొడక్షన్‌ మేనేజర్‌: సుబ్బారావు, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: సుభాష్‌, నరేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: జై, మూర్తి, కెమెరామెన్‌: ఎస్‌.డి. జాన్‌, నిర్మాత: లంకా కరుణాకర్‌ దాస్‌, కథ-స్క్రీన్‌ప్లే-ఎడిటింగ్‌-దర్శకత్వం: ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌.

>3. 'నిర్మల కాన్వెంట్‌'పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను - కింగ్‌ నాగార్జున 

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ బేనర్స్‌పై కాన్సెప్ట్‌ ఫిలింస్‌ ప్రొడక్షన్‌ ఆధ్వర్యంలో నిమ్మగడ్డ ప్రసాద్‌, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ టీనేజ్‌ లవ్‌స్టోరి చిత్రం 'నిర్మల కాన్వెంట్‌'. ఈ చిత్ర విశేషాలను తెలపడానికి సెప్టెంబర్‌ 9న అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కింగ్‌ నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్‌ పాల్గొన్నారు. 

రోషన్‌ ఫెంటాస్టిక్‌గా చేశాడు!! 

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - 'నిర్మలా కాన్వెంట్‌' ఆడియో లాంచ్‌లో చాలా హ్యాపీగా వున్నాను. ఆడియోలో రోషన్‌ మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యం వేసింది. చాలా చాలా బాగా మాట్లాడాడు. చిన్న వయసులోనే అంత డెప్త్‌ వెళ్ళి మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. షూటింగ్‌లో కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. అలాంటిది ఆడియోలో స్టేజి మీద అద్భుతంగా మాట్లాడి వాళ్ల అమ్మా, నాన్నలని ఏడిపించాడు. వారిని చూస్తే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. అంత సేపు స్పెల్‌ బౌండ్‌గా మాట్లాడాడు. సినిమా అంతా చూశాను. చాలా బాగా కాన్ఫిడెంట్‌గా చేశాడు. వన్‌ ఇయర్‌ బ్యాక్‌ ఈ కథని కాన్సెప్ట్‌ ఫిలింస్‌ వారు ప్రసాద్‌గారికి, నాకు విన్పించారు. మాకు బాగా నచ్చింది. ప్రసాద్‌గారికి ఎప్పట్నుంచో నాతో కలిసి సినిమా తీద్దామని ఇంట్రెస్ట్‌. ఆయన బిజినెస్‌లోకి నేను ఎంటర్‌ అయ్యాను. నా సినిమా బిజినెస్‌లోకి ఆయన్ని తీసుకు వచ్చాను. ఏదో బిజినెస్‌ చేసి డబ్బులు సంపాదించటంకన్నా ఫ్రెండ్లీ ఎట్మాస్ఫియర్‌లో మేం ఇద్దరం కలుసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఇన్నోవేటివ్‌ థాట్స్‌తో ఏదైనా కొత్త కొత్తగా చేయడం ప్రసాద్‌గారికి బాగా ఇష్టం. కంపెనీస్‌లోగానీ, బిజినెస్‌లోగానీ కొత్తగా చేయడానికి ట్రై చేస్తారు. అలాగే కొత్తదనం అంటే నాకు ఫస్ట్‌ నుండి ఇష్టం. మా ఇద్దరి మెంటాలిటీ బాగా కలిసింది. సో.. అలా మా ఈ జర్నీ స్టార్ట్‌ అయ్యింది. ప్రసాద్‌గారు ఫిలింస్‌ ఎక్కువగా చూస్తారు. ప్రతి సినిమా టిక్కెట్‌ కొనుక్కుని థియేటర్‌లోనే చూస్తారు. ఇంట్లో చూడరు. అన్నీ రకాల మూవీస్‌ చూస్తారు. ఎక్కువగా తెలుగు మూవీస్‌ అంటే బాగా చూస్తారు. ఆ ఇంట్రెస్ట్‌తో ఈ మూవీ తీయడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాలో కైలాష్‌ ఖేర్‌ పాడిన 'ముందు నుయ్యి వెనుక గొయ్యి' పాట కాన్సెప్ట్‌ ప్రసాద్‌గారు చెప్పిందే. ఈ సినిమా మా ఇద్దరికీ బ్యూటిఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. నేను ఈ చిత్రంలో ఒక మెయిన్‌ సపోర్టింగ్‌ రోల్‌లో యాక్ట్‌ చేశాను. వెరీ వెరీ ఇంపార్టెంట్‌ రోల్‌. ఫస్ట్‌హాఫ్‌లో అక్కడక్కడా కన్పిస్తూ సెకండాఫ్‌లో త్రూ అవుట్‌ ఫిలిం అంతా వుంటాను. డెఫినెట్‌గా ఈ సంవత్సరం సపోర్టింగ్‌ రోల్‌ అవార్డ్‌ వస్తుందనుకుంటున్నాను. పూర్తిగా ఇదొక న్యూ ఎక్స్‌పీరియన్స్‌ నాకు. లవ్‌ స్టోరీస్‌ అంటే నాకు బాగా ఇష్టం. 'నిర్మలా కాన్వెంట్‌' ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ టీనేజ్‌ లవ్‌స్టోరి. రోషన్‌, శ్రియా శర్మ ఎక్స్‌ట్రార్డినరీగా నటించారు. ఈ సినిమా రోషన్‌తో పాటు రాజీవ్‌, సుమ కనకాల అబ్బాయి రోషన్‌ కనకాల, ప్రభాకర్‌ గారి అబ్బాయి చంద్రహాస్‌లను నటులుగా పరిచయం చేస్తున్నాం. అలాగే సింగర్‌గా నన్ను, నిర్మాతగా ప్రసాద్‌గారు, సంగీత దర్శకుడిగా రోషన్‌ సాలూరి, కెమెరామెన్‌గా విశ్వేశ్వర్‌, దర్శకుడిగా నాగకోటేశ్వరరావు, సింగర్స్‌గా ఎ.ఆర్‌.రెహమాన్‌ తనయుడు ఎ.ఆర్‌. అమీన్‌, శంకర్‌ మహదేవన్‌ అబ్బాయి సిద్ధార్థ మహదేవ్‌లను ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. సినిమా మంచి హిట్‌ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. నాగచైతన్య, కళ్యాణ్‌కృష్ణ కాంబినేషన్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మించే చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌, జగపతిబాబు, రావు రమేష్‌, సంపత్‌ తదితరులు నటిస్తారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తారు. 'నిర్మలా కాన్వెంట్‌' కెమెరామెన్‌ విశ్వేశ్వర్‌ ఫొటోగ్రఫి అందిస్తారు.. అన్నారు. 

ఫ్రెష్‌ టీనేజ్‌ లవ్‌స్టోరీ!! 

ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత నిమ్మగడ్డ మాట్లాడుతూ - ఏ సినిమా చూసినా కూడా దాంట్లో లవ్‌ అనే ఎలిమెంట్‌ వుంటుంది. 'నిర్మలా కాన్వెంట్‌' ప్యూర్‌ లవ్‌స్టోరి. ఫ్రెష్‌గా వుంటుంది. సీన్స్‌ అన్నీ చాలా కొత్తగా ఫ్రెష్‌గా ఉంటాయి. టీనేజ్‌లో ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ. నాగార్జున, నేను బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఎన్నో బిజినెస్‌లు కలసి చేస్తున్నాం. కొత్త వాళ్లతో మూవీ తీయాలని మా ఇద్దరికీ ఫస్ట్‌ నుండి ఇంట్రెస్ట్‌ ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో నాకు పర్సనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఉంది. నాగేశ్వరరావు గారితో చాలా మెమరబుల్‌ మూమెంట్స్‌ స్పెండ్‌ చేశాను. సినిమాల గురించి కాకుండా జీవితం గురించి, వెరైటీ సబ్జెక్ట్స్‌ గురించి డిస్కస్‌ చేసుకునే వాళ్లం. అలా అన్నపూర్ణ స్టూడియోస్‌తో పర్సనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఏర్పడింది. ఆ అటాచ్‌మెంట్‌తోనే నాగ్‌, నేను మంచి సినిమా తీయాలనుకున్నాం. ఇదే టైమ్‌లో జి.కె.తో పరిచయం అయింది. ఎప్పుడూ పాజిటివ్‌ ఎనర్జీతో జి.కె. ఉంటాడు. ఎంతో క్రియేటివిటీ, నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తి. ఈ స్టోరీ గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఢిల్లీలో ఎం.ఎస్‌.సి. చదివిన రోజుల్లో సెలవులకి వచ్చినపుడు 'శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, ప్రతిఘటన' వంటి మంచి సినిమాలు చూశాను. అప్పట్లోనే రామోజీరావు గారు సినిమాలతో పాటు కొత్త కొత్త సినిమాలు స్టార్ట్‌ చేసి అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. టెట్రా ప్యాక్‌ ఇవాళ వచ్చింది. సోమా అనే డ్రింక్‌ ఆరోజుల్లోనే అడ్వాన్స్‌ టెక్నాలజీతో స్టార్ట్‌ చేశారు. ఇది చూసి చాలా ఆశ్చర్యపోయాను. చిన్న చిన్న సినిమాలు ఎన్నో తీశారు. నా మైండ్‌లో కూడా చిన్న సినిమాలు తీస్తే మంచిది. ఎంతో మంది యంగ్‌స్టర్స్‌ ఇండస్ట్రీకి వస్తారు. చిన్న ఉదాహరణ ఏమిటంటే నేను మ్యాట్రిక్స్‌ కంపెనీ స్టార్ట్‌ చేసినపుడు ఒక ఆర్‌ & డి సీనియర్‌ని ఇంటర్వ్యూ చేశాను. అతను ఐదు నెలల శాలరీ డిపాజిట్‌ చేయమన్నాడు. అతని వయసు నలభై ఐదు. అతనికి ఇంత శాలరీ ఇచ్చే బదులు కంపెనీ కొనుక్కోవచ్చు కదా అనిపించింది. యంగ్‌స్టర్స్‌కి అవకాశం ఇవ్వాలని ఫిక్స్‌ అయ్యాను. ఇప్పటికీ మా కంపెనీల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారే వర్క్‌ చేస్తున్నారు. అలాగే నాగార్జునగారు, జి.కె. కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఒక మనిషి గానీ, ఒక సంస్ధ గానీ సొసైటీకి తన నాలెడ్జ్‌తో ఒక మెసేజ్‌ని ఇవ్వాలి. నాలెడ్జ్‌ మీద ఎవరైనా డిపెండ్‌ అయితే అతను సక్సెస్‌ అయినట్లే. అలాగే ప్రేమ ఇన్‌స్పిరేషన్‌తో నాలెడ్జ్‌ ఈజ్‌ పవర్‌ అనే కాన్సెప్ట్‌తో నడిచే స్టోరీ ఇది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రోషన్‌లో ఇంత టాలెంట్‌ ఉందా అనిపించింది. అంత బ్యూటిఫుల్‌గా సాంగ్స్‌ని కంపోజ్‌ చేశారు. మ్యూజిక్‌ అంటే నాకు బాగా ప్రాణం. హార్ట్‌టచింగ్‌ మ్యూజిక్‌ చేశాడు రోషన్‌. ఎంతో మంది టాలెంట్‌ వున్న యంగ్‌స్టర్స్‌ని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాం. ఆడియో వేడుకలో రోషన్‌ చాలా క్యూట్‌గా మాట్లాడాడు. నా సొంత కొడుకు మాట్లాడినట్టుగా అన్పించింది. ఏదైనా వ్యాపారంలో డబ్బులు వస్తాయి, పోతాయి. కానీ ఒక మంచి సినిమా చేశామన్న ఫీలింగ్‌ ఉంది. సొసైటీకి ఉపయోగపడే మంచి కథలతో సినిమాలు తీస్తాను.. అన్నారు.

>4. సెప్టెంబ‌ర్ 11న జ‌య‌తి న‌టించిన 'ల‌చ్చి' చిత్రం టీజ‌ర్ లాంచ్ 

వెన్నెల అనే పోగ్రాం నుండి ప్ర‌తి ఇంటి ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యిన జ‌య‌తి మెట్ట‌మెదటిసారిగా హీరోయిన్ గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. J 9 4 షోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నాడు. హ‌ర్ర‌ర్ కామెడి లో ఒ కొత్త జోన‌ర్ ని ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నారు. షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న‌ ఈ చిత్రం ఆడియో ని అతిత్వ‌ర‌లో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుద‌ల చేస్తారు. చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అక్టోబ‌ర్ లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. ల‌చ్చి చిత్రానికి సంబందించి మెద‌టి లుక్ టీజ‌ర్ ని సెప్టెంబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నారు.

ఈసంద‌ర్బంగా నిర్మాత‌, క‌థానాయిక జ‌య‌తి మాట్లాడుతూ...చాలా టీవి ప్రోగ్రామ్స్ ప్రోడ్యూస్ చేసిన అనుభవంతో మెట్ట‌మెద‌టిసారిగా సినిమా నిర్మాణం చేపట్టాను. అలాగే ఈ చిత్రం క‌థ న‌చ్చి నేను మెయిన్ లీడ్ పాత్ర‌లో న‌టించాను. హ‌ర్ర‌ర్ కామెడి జోన‌ర్ లో కొత్త జోన‌ర్ లో ఈ చిత్రాన్ని చేశాము. మా చిత్రానికి ల‌చ్చి అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ చిత్రం అంతా ల‌చ్చి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ అంద‌రూ ఈ చిత్రంలో న‌టించారు. అంద‌రూ న‌వ్వించారు కూడా.. అలాగే లెజెండ్ కెమెరామెన్ యం.వి.ర‌ఘు తో ప‌నిచేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఆయ‌న ఈ చిత్రాన్ని మ‌రో మెట్టుకి తీసుకు వెళ్ళారు. మాట‌లు మరుదూరి రాజా అందించారు. మా చిత్రాన్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాము. మా చిత్రం యొక్క మెద‌టి లుక్ టీజ‌ర్ ని సెప్టెంబ‌ర్ 11న ప్ర‌సాద్ ల్యాబ్ లో ఉద‌యం 11 గంట‌ల‌కి విడుద‌ల చేయ‌నున్నాము. అతి త్వ‌ర‌లో సురేష్ యువ‌న్ అందించిన ఆడియో ని విడుద‌ల చేస్తాము. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము...అని అన్నారు.

జ‌య‌తి, తేజ‌శ్విని, దిలిప్‌, చంద్ర‌మెహ‌న్‌, పూర్ణిమ‌, ర‌ఘుబాబు, ధ‌న‌రాజ్‌, షేకింగ్ శేషు, రామ్‌ప్ర‌సాద్ మెద‌ల‌గు వారు న‌టించ‌గా..

ద‌ర్శ‌కుడు- ఈశ్వ‌ర్‌, నిర్మాత‌- జ‌య‌తి, కెమెరా- యం.వి.ర‌ఘు, మాట‌లు- మ‌రుదూరి రాజా, సంగీతం- సురేష్ యువ‌న్‌, ఎడిట‌ర్‌- ప్ర‌భు, సాహిత్యం- కందికొండ‌, ఆర్ట్ - వ‌ర్మ‌

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement