Advertisementt

మ‌హేష్ అభిమానులూ ఇది విన్నారా?

Wed 31st Aug 2016 03:09 PM
maheshbabu,koratala siva,mahesh new movie with koratala shiva  మ‌హేష్ అభిమానులూ ఇది విన్నారా?
మ‌హేష్ అభిమానులూ ఇది విన్నారా?
Advertisement
Ads by CJ
>
>కొర‌టాల శివ స్పీడు మామూలుగా లేదు. పూరి జ‌గ‌న్నాథ్ టైపులో ఒక సినిమా పూర్త‌య్యేలోపు మ‌రో సినిమాకి సంబంధించిన స‌మ‌స్తం సిద్ధం చేసుకొంటున్నాడు.  తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌న‌తా గ్యారేజ్  విడుద‌ల రేపే  కాబ‌ట్టి ఆ సినిమాకి సంబంధించిన క‌బుర్లే చెబుతాడ‌నుకొంటే, త‌దుప‌రి మ‌హేష్‌తో చేయ‌నున్న సినిమా సంగతుల్ని కూడా బ‌య‌ట‌పెట్టాడు కొర‌టాల‌.  శ్రీమంతుడు త‌ర్వాత మ‌హేష్‌తో తాను తీస్తున్న మ‌రో సినిమా కోసం క‌థే కాదు, క్యారెక్ట‌ర్ల‌నీ డిజైన్ చేసి పెట్టుకొన్నాడు కొర‌టాల శివ‌. త‌దుప‌రి సినిమాలో మ‌హేష్‌మ‌రింత స్లైలిష్‌గా, మ‌రింత గౌర‌వ‌ప్ర‌ద‌మైన  పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని చెప్పుకొచ్చాడు శివ‌. శ్రీమంతుడు సినిమాలోనే మ‌హేష్‌ని క్యూట్‌గా చూపించాడు కొర‌టాల‌. మ‌రి ఆయ‌నే మ‌రింత స్టైలిష్ అంటున్నాడంటే ఆ క్యారెక్ట‌ర్‌ని ఇంకెంత అందంగా డిజైన్ చేసుంటాడో అనే ఆస‌క్తి అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. మహేష్ కూడా కొర‌టాల శివ తీయ‌నున్న కొత్త చిత్రంపై చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నారు. మ‌హామహుల్లాంటి ద‌ర్శ‌కుల్ని కాద‌ని, కొర‌టాల‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మైపోయాడు మ‌హేష్‌. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ