టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (29-8-16).!

Tue 30th Aug 2016 04:49 PM
tollywood tajaa updates,chuttalabbayi,gautamiputra satakarni,dirty game,dj duvvada jagannadham,siddhartha,tollywood cinemas  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (29-8-16).!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (29-8-16).!
Sponsored links

1. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' తాజా షెడ్యూల్‌

నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా తాజా షెడ్యూల్  ఈరోజు(ఆగ‌స్ట్ 29న‌) మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్రారంభ‌మైంది.

తెలుగుజాతి ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన రారాజు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. ఆయ‌న గురించి నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా తీస్తున్నాడ‌న‌గానే అందరిలో ఆస‌క్తి పెరిగింది. అంద‌రి అంచ‌నాల‌ను అందుకునేలా సినిమాను ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిస్తున్నారు. హైద‌రాబాద్‌లో భారీ యుద్ద‌నౌక సెట్‌ను వేసి యాక్ష‌న్ సన్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అలాగే జార్జియాలో ఈ షెడ్యూల్ లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే స‌న్నివేశాల‌ను 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో క్లైమాక్స్ ను భారీగా చిత్రీకరించారు. అంత‌కు ముందు మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. సినిమా చిత్రీక‌ర‌ణ‌తో పాటు సీజీ వ‌ర్క్స్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు మ‌ధ్య ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న షెడ్యూల్ 18 రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్‌లో నందమూరి బాల‌కృష్ణ‌, శ్రియాశ‌ర‌న్‌, హేమామాలిని త‌దిత‌రులు పాల్గొంటున్నారని చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు. 

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

2. అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 25వ చిత్రం 'డి.జె...దువ్వాడ జగన్నాథమ్‌' ప్రారంభం

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు  నిర్మాతగా కొత్త చిత్రం 'డి.జె..దువ్వాడ జగన్నాథమ్'  సోమవారం హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ రూపొందుతున్న 25వ సినిమా ఇది.  దైవ సన్నిధానమ్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టగా, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వి.వి.వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ – 'డి.జె...దువ్వాడ జగన్నాథమ్' ఈరోజు లాంచనంగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇది దిల్‌రాజుగారి బ్యానర్‌లో వస్తున్న 25వ సినిమా. ఆయనతో గబ్బర్‌ సింగ్‌ సినిమా నుండి అనుబంధం కొనసాగుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఆర్య సినిమా నుండి అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ ఆ కోరిక తీరింది. బన్నికి థాంక్స్. అలాగే ఎప్పుడు అడిగిన తన విలువైన సమయాన్ని కేటాయించడమే కాకుండా అల్లు అరవింద్‌గారు తన విలువైన సలహాలను కూడా అందిస్తుంటారు. అందుకు ఆయనకు నా స్పెషల్ థాంక్స్. డి.జె.దువ్వాడ జగన్నాథమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌ నుండి జరుగుతుంది. అలాగే సినిమాను ఏప్రిల్‌ మొదటివారంలో రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాం.. అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ...ఈరోజు బన్ని హీరోగా మా బ్యానర్‌లో డి.జె...దువ్వాడ జగన్నాథం సినిమా ప్రారంభమైంది. ఆర్య, పరుగు తర్వాత బన్నితో ఈ సినిమా హ్యాట్రిక్‌ మూవీ కావడం, మా బ్యానర్‌కు ఇది 25వ సినిమా కావడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇది కూడా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది. హరీష్‌ శంకర్‌తో గబ్బర్ సింగ్ నుండి మంచి పరిచయం ఏర్పడింది.  అప్పటి నుండి తనతో చేసిన ట్రావెల్‌లో మంచి అనుబంధం ఏర్పడింది. మా బ్యానర్ లో హరీష్ తో వరుస సినిమాలు చేస్తున్నాం. హరీష్ దర్శకత్వంలో చేస్తున్న మూడో సినిమా. తప్పకుండా మంచి హిట్‌ సినిమాను రూపొందించేలా అందరం కష్టపడి వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం... అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతంరాజు, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: దీపక్‌ రాజ్‌ నిర్మాత: దిల్‌రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌.

3. టాకీపార్ట్‌ పూర్తి చేసుకున్న 'డర్టీగేమ్‌' 

ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌ జంటగా షిరిడి సాయి క్రియేషన్స్‌ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌ కుమార్‌ నిర్మిస్తున్న పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం 'డర్టీగేమ్‌'. ఈ చిత్రం టాకీపార్ట్‌ పూర్తి చేసుకుని సాంగ్స్‌ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ చిత్ర విశేషాలను తెలిపేందుకు సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ..'డర్టీగేమ్‌' చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ముందుగా నిర్మాత తాడి మనోహర్‌ కుమార్‌ని అభినందించాలి. ఎందుకంటే సీనియర్‌ నటులకు అవకాశాలే రాని ఈ రోజుల్లో వెతికి మరీ..సీనియర్‌ నటులందరికీ ఈ సినిమాలో అవకాశమే కాకుండా మంచి పాత్రలు ఇచ్చినందుకు. ఈ విషయంలో ఇప్పుడున్న నిర్మాతలు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాంటి కథతో సినిమాని నిర్మిస్తున్న ఆయన ఘట్స్‌ని మెచ్చుకోవాలి. ఇటువంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు. 

నటుడు సురేష్‌ మాట్లాడుతూ..ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం నేను మద్రాస్‌లో ఉండటం లేదు. హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. ఈ చిత్ర నిర్మాత అతి తక్కువ టైమ్‌లో నాకు మంచి మిత్రుడుగా మారారు. ఈ సినిమాలో చాలా మంచి పాత్రలో నటించాను. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది..అన్నారు. 

దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ..నిర్మాత కథను నమ్మి ఖర్చుకి వెనకాడకుండా నిర్మాణాత్మక విలువలతో చిత్రీకరించడానికి అన్నివిధాలా తోడ్పాటుని అందించినందుకు కృతజ్ఞతలు. టాకీ పార్ట్‌ పూర్తయింది. సీనియర్‌ నటులే కాక, ఈ చిత్రంలో నటించిన అందరూ చిత్రీకరణకు ఎంతగానో సహకరించారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం ఈ చిత్రానికి మంచి హైలైట్‌ కానుంది..అని అన్నారు. 

చిత్ర నిర్మాత తాడి మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ..పక్కా ప్లానింగ్‌తో అతి తక్కువ టైమ్‌లో టాకీపార్ట్‌ చిత్రీకరణ పూర్తి చేశాడు దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. సినిమా నిర్మాణం గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ దర్శకుడు అనుకున్న టైమ్‌కి సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేశాడు. అలాగే చిత్రీకరణకు సహకరించిన నటులందరికీ నా కృతజ్ఞతలు. వినాయక చవితి పండుగ తర్వాత పాటల చిత్రీకరణ ప్రారంభిస్తాం. అక్టోబర్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నాము. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాము..అని అన్నారు. 

నటుడు ఖయ్యుమ్‌ మాట్లాడుతూ..ఈ చిత్రంతో తొలిసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాను. మంచి పాత్రతో నన్ను హీరోగా పరిచయం చేస్తున్న దర్శకుడికి, నిర్మాతకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను..అని అన్నారు.

ఇంకా ఈ సమావేశంలో చిత్ర యూనిట్ కి సంబంధించి మరికొందరు పాల్గొన్నారు.  

ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌, పరుచూరి గోపాలకృష్ణ, సురేష్‌, అస్మిత, రమ్య, తాడి మనోహర్‌ నాయుడు, జబర్ధస్త్‌ టీమ్‌ మొదలగువారు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాత: తాడి మనోహర్‌ కుమార్‌, కథ-మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. 

4. సెప్టెంబ‌ర్ 2న 'సిద్ధార్థ' ఆడియో విడుద‌ల‌

లంకాల బుచ్చిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో సాగ‌ర్‌, రాగిణి నంద్వాణి, సాక్షిచౌద‌రి హీరో హీరోయిన్లుగా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కె.వి.ద‌యానంద్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'సిద్ధార్థ‌'. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాల తుది ద‌శ‌కు చేరుకున్నాయి. సెప్టెంబ‌ర్ 2న ఆడియో విడుద‌ల కార్యక్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ...

దాస‌రి కిర‌ణ్‌కుమార్ మాట్లాడుతూ... మంచి టీంతో చేస్తున్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సిద్ధార్థ‌. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సినిమా టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. విస్సుగారు అందించిన సూప‌ర్బ్ క‌థ‌లో మంచి ఎంట‌ర్ టైనింగ్‌తో పాటు ఎమోష‌న‌ల్ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్‌కు త‌గిన విధంగా సాగ‌ర్ ఎక్సలెంట్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. సినిమాలో కంటెంట్‌కు త‌గిన విధంగా పరుచూరి బ్ర‌ద‌ర్స్ అద్భుత‌మైన డైలాగ్స్ అందించారు. మెలోడి బ్ర‌హ్మ బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హిస్తున్నాం. ఈ కార్యక్ర‌మంలో పలువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్‌లోనే మూవీని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం... అన్నారు 

సాగ‌ర్‌, రాగిణి నంద్వాణి, సాక్షిచౌద‌రి హీరో హీరోయిన్లుగా  న‌టిస్తున్న ఈ చిత్రంలో కోట‌శ్రీనివాస‌రావు, అజ‌య్, సుబ్బ‌రాజు, స‌త్యం రాజేష్‌, తాగుబోతు రమేష్‌, ప్ర‌భాస్ శ్రీను, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి క‌థః విస్తు, డైలాగ్స్ః ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, ఆర్ట్ః వివేక్ అన్నామ‌లై, ఫైట్స్ః సాల్మ‌న్‌, డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, కొరియోగ్ర‌ఫీః హారీష్ పాయ్‌, ఎడిటింగ్ః ప్ర‌వీణ్ పూడి, సంగీతంః మ‌ణిశ‌ర్మ‌, స‌హ నిర్మాతః ముత్యాల ర‌మేష్‌, నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః కె.వి.ద‌యానంద్ రెడ్డి.

5. చుట్టాలబ్బాయిని ప్రేక్షకులు తమ సొంతం చేసుకున్నారు

వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి చిత్రం విజయవంతంగా మూడవ వారంలోకి ప్రవేశించిందని ఈ విజయంతో తామెంతో పొంగి పోతున్నామని యూనిట్ సభ్యులు అన్నారు. చుట్టాలబ్బాయి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్లస్ విజయోత్సవ వేడుక సోమవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో యూనిట్ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ సందర్భంగా...

దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ.. టైటిల్ పెట్టిన దగ్గరనుండి అది జనంలోకి దూసుకు పోయింది. ఇప్పుడు ప్రేక్షకులు మా చుట్టాలబ్బాయిని తమ సొంతం చేసుకున్నారు. తిరుపతిలో థియేటర్ కి వెళ్ళినప్పుడు హౌస్ ఫుల్ అవటంతో పాటు జనం కేరింతలు చప్పట్లతో ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారని అది చూసిన తర్వాత అంతవరకు నాలో ఉన్న కొద్దిపాటి టెన్షన్ కూడా పోయిందన్నారు. తిరుపతి నుండి బయలుదేరిన మా యూనిట్ విజయ యాత్ర రాజంపేట, కడప, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, వైజాగ్, విజయనగరం వరకు జరిగింది. కొన్ని థియేటర్ ల వద్ద తాము కారుల్లోంచి దిగాలేనంత అభిమానాన్ని ప్రదర్శించారని, దాంతో మా ఆనందం రెట్టింపు అయిందన్నారు. అహ నా పెళ్ళంట, పూలరంగడు తరువాత ఎంతటి ఆనందం పొందానో చుట్టాలబ్బాయితో రెట్టింపు ఆనందాన్ని పొందాను. సాయి కుమార్, ఆది కలిసి నటించటం కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ గా నిలిచిందన్నారు. మా విజయ యాత్రలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్న సందర్భంలో కూడా చుట్టాలబ్బాయి, చుట్టాలబ్బాయి అని జనంలోంచి కేకలు రావటం, అలాగే వైజాగ్ లోని వివి వినాయక్ గారి థియేటర్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయనే స్వయంగా ఫోన్ చేసి అభినందించటం మరింత సంతోషం కలిగించిందన్నారు.

నిర్మాతలు రాం వెంకట్ మాట్లాడుతూ.. విజయ పథాన దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా ఉందన్నారు. తొలి చిత్రంతోనే విజయాన్ని పొందటం మూడో వారంలో కూడా కలెక్షన్స్ రావటం తాము ఊహించలేదన్నారు. మరిన్ని క్వాలిటీ చిత్రాలను నిర్మించేందుకు మా ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.

సాయికుమార్ మాట్లాడుతూ.. తండ్రీ కొడుకులం కలిసి నటించాలనే మా కోరికను నిజం చేసిన దర్శకుడు వీరభద్రంకు ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు నిర్మాతలకు యూనిట్ సభ్యులకు కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎన్నో విజయయాత్రలలో పాల్గొన్నప్పటికీ ఆదితో కలిసి తొలిసారిగా విజయయాత్రలో పాల్గొనటం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ‘గరం’ చిత్రం చేసేటప్పుడు ఆది తో పక్కింటబ్బాయి పేరుతొ చిత్రం చేద్దామనుకున్నాను. కాని వీరభద్రం చుట్టాలబ్బాయి చేస్తాననగానే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఎదో ఒక రోజు ఆదితో పక్కింటబ్బాయి చిత్రం కూడా తీస్తానని తెలిపారు. ప్రేమ కావాలి, లవ్లీ తరువాత ఆది కెరీర్ లో ఇదో మంచి చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాను అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ.. టైటిల్ కాచీగా ఉంది. ఫాస్ట్ గా జనంలోకి వెళ్ళిపోయింది. విజయ యాత్ర సమయంలోనే ప్రేక్షకుల రెస్పాన్స్ ను స్వయంగా చూసిన అనుభూతి మిగిలింది. లీడింగ్ థియేటర్స్ లో వెయ్యటం వల్ల మూడో వారం కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ నడుస్తున్నాయి అన్నారు.

బి ఏ రాజు మాట్లాడుతూ.. ప్లాటినం డిస్క్ జరుపుకోవటం చిత్రానికి, చిత్రంలోని పాటలకు లభించిన ఆదరణకు నిదర్శనంగా భావించాలి. ఈ సినిమాతో వీరభద్రం మరో హిట్ కొట్టారు. హీరోగా ఆది మరింత పెద్ద రేంజ్ కు వెళ్ళారని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన తమన్ కే ఈ క్రెడిట్ దక్కుతుందని.. అన్నారు.

నైజాం డిస్ట్రిబ్యూటర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఈ సక్సెస్ ను డిస్ట్రిబ్యూటర్ గా బాగా ఎంజాయ్ చేస్తున్నానని మొదట్లో తక్కువ థియేటర్లు వేసినా తరువాత థియేటర్ల సంఖ్య పెరిగిందని ఆది కెరీర్ కు ఇదో మలుపుగా భావిస్తున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు భద్రం, చమ్మక్ చంద్ర, రైటర్ భావాన్ని, కెమెరామెన్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019