Advertisement

టాలీవుడ్ తాజా అప్ డేట్స్..!

Tue 23rd Aug 2016 09:52 PM
tollywood latest updates,nani majnu,idhi naa love story,trayam,mr karthik,sunil,kranthi madhav  టాలీవుడ్ తాజా అప్ డేట్స్..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్..!
Advertisement

అగ‌ష్టు 29 నుండి  సునీల్, క్రాంతి మాధవ్, పరుచూరి కిరీటి చిత్రం రెండ‌వ షెడ్యూల్ ప్రారంభం

'జ‌క్క‌న్న' తో క‌మ‌ర్షియ‌ల్ సక్సెస్ ని త‌న సొంతం చేసుకుని సూప‌ర్ లైన్ అప్ తో దూసుకుపోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న‌ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం రెండ‌వ షెడ్యూల్ ని అగ‌ష్టు 29 నుండి ప్రారంభిస్తున్నారు. ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి... యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఈ చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునీల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. 

నిర్మాత మాట్లాడుతూ.. మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన రెండు చిత్రాలు హృదయాలకి హ‌త్తుకునేలా వుంటాయి. ఆయ‌న మార్క్ వుంటూ, సునీల్ త‌ర‌హ కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందించబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా త‌న కామెడి తో జ‌క్క‌న్న చిత్రాన్ని క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యాన్ని త‌న ఖాతాలో జ‌మ‌చేసుకున్నాడు. ఈ చిత్రంలో త‌న  క్యారెక్టరైజేషన్ ను విభిన్నంగా మలిచారు.  ఇందులోని ప్రతీ పాత్రకు ప్రాధాన్యముండేలా తీర్చి దిద్దారు.  అద్భుతమైన సినిమాటోగ్రాఫర్ సర్వేశ్ మురారి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. మెద‌టి షెడ్యూల్ పూర్తిచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం రెండ‌వ షెడ్యూల్ ని అగ‌ష్టు 29 నుండి ప్రారంభిస్తున్నాము.  అన్ని వర్గాల్ని మెప్పించే ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ కాబోతుంది. మా బ్యానర్ నుంచి సూపర్ హిట్ చిత్రం చేయబోతున్నామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం...అని అన్నారు.

ధనుష్‌, రీచా గంగోపాధ్యాయల 'మిస్టర్‌ కార్తీక్‌' పాటలు విడుదల 

ఓం శివగంగ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ధనుష్‌, రీచా గంగోపాధ్యాయ హీరో హీరోయిన్లుగా '7 బై జి బృందావన కాలనీ' ఫేమ్‌ శ్రీ రాఘవ (సెల్వరాఘవన్‌) దర్శకత్వంలో రూపొందిన 'మయక్కం ఎన్నా' చిత్రాన్ని తెలుగులో 'మిస్టర్‌ కార్తీక్‌' పేరుతో నిర్మాతలు కె. బాబురావు, కె. మల్లిఖార్జున్‌లు అనువధించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను సముద్ర, రాజ్‌ కందుకూరిలు ఆవిష్కరించారు. ఆడియో సీడీని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ ఆవిష్కరించి మరో నిర్మాత ఆర్‌.కె. గౌడ్‌కు అందచేశారు. శివరంజని మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ కార్యక్రమంలో జబర్ధస్త్‌ ఫణి కామెడీని పండించి ఆకట్టుకున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..తమిళంలో మంచి విజయం సాధించిన ఈ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం, తెలుగులోనూ మంచి సక్సెస్‌ని సాధిస్తుంది. మేము నిర్మాతలుగా మారడానికి కారణం సి. కళ్యాణ్‌ గారు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ చిత్రాన్ని మేము తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాము. మా ఈ ప్రయత్నంను ఆశీర్వదించడానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ధనుష్‌ అభినయం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము..అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు నగేష్‌ నారదాసి, భూషణ్‌, మాటల రచయిత వెంకట్‌ మల్లూరి తదితరులు పాల్గొని..చిత్రం విజయం సాధించాలని కోరుకున్నారు. 

సెప్టెంబర్ లో  'త్రయం' 

విషురెడ్డి, అభిరామ్, సంజన, అశోక్ ప్రధాన పాత్రల్లో పంచాక్షరీ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ‘త్రయం’. డా.గౌతమ్ దర్శకత్వంలో పద్మజానాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది.  దర్శకుడు డాక్టర్.గౌతమ్ మాట్లాడుతూ  ‘ముగ్గురు వ్యక్తుల శక్తియుక్తుల నేపధ్యంలో చాలా రియలిస్టిక్‌గా, ఎలాంటి రోప్స్, డూప్స్ లేకుండా తీసిన యాక్షన్ సీన్స్ ‘త్రయం’ లో హైలెట్‌గా ఉండబోతున్నాయి. యాక్షన్ సీన్స్ తీసే క్రమంలో లీడ్‌రోల్స్‌లో నటించిన వారికి ఎన్నో గాయాలు అయినా ఏమాత్రం లెక్కచేయకుండా ఆడియెన్స్‌కు ఓ సరికొత్త థ్రిల్‌ను అందించేలా చిత్రీకరణ చేశాం. తెలుగులో పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది కాబట్టి అన్నింటిని దృష్టిలో ఉంచుకొని ‘త్రయం’ను చిత్రీకరించాం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న త్రయం సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.

లే లడక్ లో  సాంగ్స్ పూర్తి చేసుకున్న 'ఇది నా లవ్ స్టోరీ'

తరుణ్ ,ఓవియా జంటగా రామ్ ఎంటర్ టైనర్స్  బ్యానర్ పై రమేష్ గోపి దర్శకత్వం లో అభిరామ్ సమర్పణలో ఎస్ .వి ప్రకాష్ నిర్మిస్తున్నచిత్రం 'ఇది నా లవ్ స్టొరీ'. ఒక సాంగ్ మినహా చిత్రీకరణ పూర్తి  చేసుకుంది. ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెల్పుతూ .....'లే లడక్ , కులుమనాలి లో చిత్రీకరించిన సాంగ్స్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి . మూడు పాత్రలలో  తరుణ్ నటన అందరిని ఆకట్టుకుంటుంది. లవర్ బాయ్ గా తరుణ్ కి వున్న ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా పూర్తి స్థాయి లవ్ స్టొరీ ని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించాము. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ .ఆర్ రెహమాన్ శిష్యుడు శ్రీనాథ్ విజయ్ ని  సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. నిర్మాత ఎస్ .వి  ప్రకాష్ సహకారం తో  ఎక్కడా  రాజీ పడకుండా చిత్రాన్ని  పూర్తి చేసాం. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం ఆడియో ని వచ్చే నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం... అని అన్నారు.

నాని హీరోగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ చిత్రం 'మజ్ను' 

రేడియో మిర్చి ద్వారా మొదటి పాట విడుదల, ఆగస్ట్‌ 26న ఆడియో విడుదల 

నాని హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'భలే భలే మగాడివోయ్‌' తర్వాత అదే సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ను రిపీట్‌ చెయ్యడానికి సంగీత దర్శకుడు గోపిసుందర్‌ సారధ్యంలో 'మజ్ను' పాటలు రూపొందాయి. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌ నిర్మాణ సారధ్యంలో 'ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన విరించి వర్మ దర్శకత్వంలో గోళ్ళ గీత నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మజ్ను'. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను రేడియో మిర్చి ద్వారా విడుదల చేశారు. 

కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌. కెమెరా పనితనం, అత్తారింటికి దారేది, సోగ్గాడే చిన్ని నాయనా, సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు చేసిన ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎస్సెట్స్‌ కాబోతున్నాయి. ఈ చిత్రం ద్వారా ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. 

నేచురల్‌ స్టార్‌ నానికి సెప్టెంబర్‌ బాగా కలిసొచ్చిన నెల. అతని మొదటి సినిమా 'అష్టా చమ్మా', 'భలే భలే మగాడివోయ్‌' చిత్రాలు సెప్టెంబర్‌లో రిలీజ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. మళ్ళీ ఆ సెంటిమెంట్‌ని మరోసారి నిజంం చేసేందుకు 'మజ్ను'గా సెప్టెంబర్‌లోనే రాబోతున్నారు నాని. ఆగస్ట్‌ 26న ఈ చిత్రం ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 

కారులో షికారుకెళితే టీజర్ లాంచ్ 

శ్రీ హరిహర ఫిలిమ్స్ పతాకంపై మాదాల కోటేశ్వర్ రావు దర్శకత్వంలో మధు, అనీష్, అభిరాం సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'కారులో షికారుకెళితే'. ఈ చిత్ర ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాదాల రవి  ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లను లాంచ్ చేయగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ టీజర్ ని లాంచ్ చేసారు . 

ఈ సందర్భంగా నటుడు ,నిర్మాత మాదాల రవి మాట్లాడుతూ....సినిమాలు నిర్మించడం తేలికేనని అయితే వాటిని రిలీజ్ చేయడం సరిగ్గా ప్రమోట్ చేయడం కష్టంగా మారిందని ,ఇటీవల రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన చిన్న చిత్రాలు ఎన్నో ఉన్నాయని కానీ అవన్నీ కూడా అగ్ర నిర్మాతలు తీసిన చిన్న చిత్రాలు సాధించిన విజయాలని ఎందుకంటే ప్రాపర్ గా పబ్లిసిటీ చేయకపోతే అవి జనాలకు చేరవు, సరైన పబ్లిసిటీ తో పాటు మంచి థియేటర్ లు కూడా ముఖ్యమని దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు కి శుభాకాంక్షలు అందజేస్తూ ఈ సినిమాకి కూడా సరైన పబ్లిసిటీ చేయాలనీ సక్సెస్ సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు . 

టీజర్ లాంచ్ చేసిన బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ..టీజర్ బాగుంది, చిన్న చిత్రాలు హిట్ అవుతున్నాయి తప్పకుండా ఈ కారులో షికారుకెళితే కూడా మంచి హిట్ కావాలని అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు మీనాక్షి భుజంగ్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తీ , ఆల్రెడీ ఇతని చేత రెండు పాటలు నా సినిమా కోసం కొనుక్కున్నాను  అవి చాలా బాగున్నాయి అంటూ టీం కు శుభాకాంక్షలు అందజేశాడు. 

చిత్ర దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ..నా మిత్రుల సహకారంతో ఈ చిత్రం తెరకెక్కింది. లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్ర ఆడియో వేడుక వచ్చే నెలలో ఉంటుందని అలాగే త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమా రిలీజ్ చేస్తామని మీ అందరి సహకారం కావాలని అన్నారు . 

ఇంకా ఈ కార్యక్రమంలో హీరో దీరు మహేష్ ,హీరోయిన్ లు ప్రియా , ఇషికా సింగ్ , మలినేని లక్ష్మయ్య చౌదరి , సంగీత దర్శకులు మీనాక్షి భుజంగ్ , ఎడిటర్ ఆనంద్ , కెమెరామెన్ చంద్రశేఖర్ వేమూరి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement