Advertisement

స్పూఫ్‌ల్లాంటివి 'సెల్ఫీరాజా' లో లేవంట!

Thu 07th Jul 2016 05:40 PM
selfie raja song release,selfie raja song launch,allari naresh,eshwar reddy director,selfie raja movie  స్పూఫ్‌ల్లాంటివి 'సెల్ఫీరాజా' లో లేవంట!
స్పూఫ్‌ల్లాంటివి 'సెల్ఫీరాజా' లో లేవంట!
Advertisement

అల్లరి నరేష్‌, సాక్షిచౌదరి, కామ్నరానావత్‌ హీరో, హీరోయిన్స్‌గా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై. లి. సుంకర రామబ్రహ్మం సమర్పణలో గోపి ఆర్ట్స్‌ పతాకంపై చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'సెల్ఫీరాజా'. జులై 15న రిలీజ్‌ అయ్యేందుకు రెడీగా వున్న ఈ చిత్ర పాటలను వినూత్న పద్దతిలో రిలీజ్ చేస్తున్నారు. 

ఇందులో భాగంగా చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ని జూలై 6న హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎన్‌సిసిలో చిత్ర యూనిట్‌ సమక్షంలో సీనియర్‌ జర్నలిస్ట్స్‌ పసుపులేటి రామారావు, వినాయకరావు, సాయిరమేష్‌, ఆనంద్‌ సంయుక్తంగా 'సెల్ఫీరాజా' సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా

హీరో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ... త్రీ ఇయర్స్‌ బ్యాక్‌ ఈ సినిమాకి సంబంధించిన రీమేక్‌ రైట్స్‌ తీసుకుని అందులో ధర్టీపర్సెంట్‌ మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఎన్నో మార్పులు చేసి ఈ సినిమా చేశాం. శ్రీధర్‌ సీపాన, డైమండ్‌ రత్నబాబు, విక్రంరాజు నలుగురు రైటర్స్‌ ఈ సినిమాకి వర్క్‌చేశారు. నా ఫ్యాన్స్ కొందరు నా గత చిత్రాల్లో ఏం మిస్ అవుతుందో చెప్పడం తో టీమ్‌ అంతా కలిసి హండ్రెడ్‌ పర్సెంట్‌ హిట్‌ కొట్టాలన్న కసితో ఈ సినిమాకి పని చేశాం. చౌదరిగారు నాన్నగారితో 'నేటిగాంధీ' సినిమా తీశారు. చాలాసంవత్సరాల తర్వాత మళ్లీ నాతో సినిమా చేస్తున్నారు. నాకు ఇవివి సినిమా ఎలాగో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కూడా అలాంటిదే. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ. స్పూఫ్‌ల్లాంటివి ఉండవు. 'సెల్ఫీరాజా'కి ఒక సమస్య ఎదురవుతుంది. దీని నుండి బయట పడడానికి రకరకాల గెటప్‌లు వేస్తుంటాడు. సెల్ఫీల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్‌ వస్తాయి అనేది చాలా కొత్తగా చూపించాం. ఈ సినిమాలో సాయికార్తీక్‌ ఐదు మంచి సాంగ్స్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశాం. రెండో పాట వైజాగ్‌, థర్డ్‌ సాంగ్‌ విజయవాడ, ఫోర్త్‌ సాంగ్‌ వరంగల్‌లో రిలీజ్‌ చేయాలని చూస్తున్నాం. ఈ సినిమాని బాగా ప్రమోట్‌ చేసి సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను... అన్నారు.

సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ మాట్లాడుతూ - ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, గోపి ఆర్ట్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్న 'సెల్ఫీరాజా' సినిమాకి వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈమధ్యనే ఈడోరకం ఆడోరకం, సుప్రీమ్‌ చిత్రాలు సక్సెస్‌ అయి యాభై రోజులు ఫంక్షన్స్‌ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాం. 'సెల్ఫీరాజా' తో కూడా యాభై రోజుల ఫంక్షన్‌ జరుపుకుంటామని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సాంగ్స్‌ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఆడియోతో పాటు సినిమా కూడా పెద్దహిట్‌ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

పాటల రచయిత గణేష్‌ మాట్లాడుతూ -  'సీమటపాకాయ్‌'లో ఒక పాట రాశాను. ఈ చిత్రంలో కూడా రాశాను. సాయికార్తీక్‌ అద్భుతమైన ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. ఆడియోతో పాటు సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుంది.. అన్నారు.

హీరోయిన్‌ సాక్షిచౌదరి మాట్లాడుతూ - వెరీ ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌. నరేష్‌కి పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌ టైటిల్‌. ఇట్స్‌ ఎ అమేజింగ్‌ ఫిలిం. గోపి ఆర్ట్స్‌, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది.. అన్నారు.

దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..నరేష్‌ సినిమా వస్తుందంటే అందులో కొత్తగా ఉంటుందని ఆడియన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. మా గురువు ఇవివి గారితో చౌదరిగారు సినిమాలు తీశారు. మళ్లీ అదే బ్యానర్‌లో నాతో సినిమా తీయడం లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చిన నరేష్‌కి చాలా థాంక్స్‌. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్ధ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ రెగ్యులర్‌గా సినిమాలు తీస్తున్నందుకు అనీల్‌ సుంకరగారికి, కిషోర్‌ గరికపాటికి నా ధన్యవాదాలు. ఈ చిత్రంలో నరేష్‌ చాలా కొత్తగా కనిపిస్తాడు. సినిమా కూడా అలాగే కొత్తగా ఉంటుంది. రెండు గంటలపాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే సినిమా ఇది. ఇందులో హీరోకి సెల్ఫీ వీక్‌నెస్‌. సెల్ఫీ వల్ల మంచి, చెడు రెండూ జరుగుతాయి. మా సెల్ఫీరాజా నోటి దూల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్‌ వచ్చాయి, వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మెయిన్‌ కధాంశం. సాయికార్తీక్‌ ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్స్‌ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి అనీల్‌గారికి, చౌదరిగారికి, కిషోర్‌కి సక్సెస్‌ రావాలి.. అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో  కమెడియన్స్‌ పృధ్వీ, నల్ల వేణు, తాగుబోతు రమేష్‌, రచ్చ రవి, నాగినీడు, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కిషోర్‌ గరికపాటి మొదలగు వారు పాల్గొని సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement