Advertisement

'చుట్టాలబ్బాయి' టీజర్ లాంచ్!

Sat 25th Jun 2016 06:05 PM
chuttalabbayi teaser launch,aadi,veerabadhram,venkat thalari  'చుట్టాలబ్బాయి' టీజర్ లాంచ్!
'చుట్టాలబ్బాయి' టీజర్ లాంచ్!
Advertisement

ఆది హీరోగా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై రామ్ తాళ్ళూరి సమర్పణలో వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం 'చుట్టాలబ్బాయి'.  ఈ సినిమా టీజర్ ను శనివారం హైద్రాబాద్ లోని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా...

హీరో ఆది మాట్లాడుతూ.. ''కన్ఫ్యూజన్ కామెడీ జోనర్ లో ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ గా రూపొందించాం. వీరబాబు గారు చక్కగా డైరెక్ట్ చేశారు. నిర్మాతలు ఎంతో ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌, బ్యాంకాక్ త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీకరించాం. చిన్న మిస్ అండ‌ర్ స్టాడింగ్‌తో ఈ సినిమా మొత్తం డ్రైవ్ అవుతుంది. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మలయాళంలో సుమారుగా 11 సినిమాలు చేసిన నమితా ప్రమోద్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతుంది. జులై 6 న పాటలను విడుదల చేసిన జులై రెండో వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు. 

దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ఓపెనింగ్ రోజు నుండి ఇప్పటివరకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. ఈ చిత్ర నిర్మాతలు ఇద్డురు నాతో వేరువేరుగా సినిమాలు చేయాలనుకున్నారు కానీ ఇద్దరితో కలిసి సినిమా చేస్తే మంచి ఔట్ ఫుట్ వస్తుందని ఇద్దరిని ఒప్పించాను. క్వాలిటీతో సినిమాను రూపొందించాను. అందరినీ ఆకట్టుకునే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది'' అని చెప్పారు. 

నిర్మాతలు మాట్లాడుతూ.. ''మొదటి సిట్టింగ్ లోనే వీరభద్రమ్ గారు చెప్పిన కథను ఒక చేసేశాం. కథ అంత బాగా నచ్చింది. ఒక పాట మినహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. త్వరలోనే పాటలను రిలీజ్ చేసి గ్రాండ్ గా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాం చేస్తున్నాం'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో అరుణ్, బి.ఏ.రాజు తదితరులు పాల్గొన్నారు.  

ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరామెన్: నాగేంద్ర, ఆర్ట్: ఎస్.శేఖర్, ప్రొడ్యూసర్: వెంకట్ తలారి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీరభద్రమ్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement