మనకున్న బెస్ట్ డాన్సర్స్ లో సునీల్ ఒకడు: చిరు

Sat 25th Jun 2016 04:56 PM
jakkanna audio launch,chiranjeevi,sunil,vamsi krishna akella  మనకున్న బెస్ట్ డాన్సర్స్ లో సునీల్ ఒకడు: చిరు
మనకున్న బెస్ట్ డాన్సర్స్ లో సునీల్ ఒకడు: చిరు
Advertisement

సునీల్, మన్నారా చోప్రా జంటగా వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో సుదర్శన్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'జక్కన్న'. దినేష్ సంగీత అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైద్రాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీని హీరో సునీల్ కు అందించారు. ఈ సందర్భంగా..

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ''మూడు రోజుల క్రితం సునీల్ నాకు ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్ కి రమ్మని పిలిచాడు. నేను షూటింగ్ లో బిజీగా ఉండడం వలన వెళ్లకూడదని అనుకున్నాను. కానీ సునీల్ చూపించే అభిమానం నన్ను నో చెప్పనివ్వలేదు. షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడకి వచ్చాను. స్టేజ్ మీద నీ డాన్సులు చేసి నేను ఈ స్టేజ్ కి వచ్చాను అన్నయ్య అని సునీల్ ఎప్పుడు చెప్తూ.. ఉంటాడు. ఒక అభిమాని అభివృద్ధిలోకి వచ్చాడంటే తన తల్లి తండ్రుల తరువాత సంతోషిందేది నేనే. సునీల్ ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాడు. కష్టాన్ని నమ్ముకుంటే అభివృద్ధిలోకి రాగలరనడానికి సునీలే ఉదాహరణ. మనకున్న బెస్ట్ డాన్సర్స్ లో సునీల్ ఒకడు. కామెడీలో హీరోయిజం చూపించడంలో సక్సెస్ అయ్యాడు. వంశీ ఆకెళ్ళ చక్కగా ఈ సినిమాను రూపొందించాడనడంలో సందేహం లేదు. ట్రైలర్ లో ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇన్ని పొందిపరిచిన ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుంది. సుదర్శన్ నిర్మాతగా తన వంతు కృషి చేశాడు. దినేష్ మంచి మ్యూజిక్ డైరెక్టర్. తను లేడని కొన్ని సినిమాలు రీరికార్డింగ్ ఆపేసిన రోజులున్నాయి. మన్నారా తన నటనతో మంచి స్థాయికి ఎదగాలి. సునీల్ కి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ రావాలి. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది'' అని చెప్పారు. 

సునీల్ మాట్లాడుతూ.. ''చిరంజీవి గారు లేకపోతే నా లైఫ్ సెటిల్ అయ్యేది కాదు. ఆయన బిజీ షెడ్యూల్ లో ఉన్న నాకోసం ఇక్కడికి వచ్చారు. ఆయన మనసు కూడా మెగాస్టార్ రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా మొత్తం కామెడీ, కామెడీ, కామెడీ. సినిమాలో కథ గొప్పతనంతో పాటు మంచి పంచ్ డైలాగ్స్ ఉంటాయి. సినిమాలో రామ్ ప్రసాద్ గారు నన్ను అందంగా చూపించారు. దినేష్ లేకపోతే ఈ సినిమా ఇంత రిచ్ గా   ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి నేను విపరీతంగా కామెడీ చేసిన సినిమా ఇది. జక్కన్న సినిమా మొదలు కావడానికి కారణం నిర్మాత సుదర్శన్ గారు. మన్నారా చోప్రా ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. అందరం కుటుంబంలా కలిసి ఈ సినిమా చేశాం. రాజారవీంద్ర గారి గైడెన్స్ తో ఒకేసమయంలో రెండు సినిమాల్లో నటించాను. వచ్చే నెల 25 కి నేను నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇకపై సంవత్సరానికి నాలుగు సినిమాలు చేసి, నలభై సినిమాలు చేస్తే ఎంత నవ్విస్తానో అంతగా ఎంటర్టైన్ చేస్తాను'' అని చెప్పారు.  

దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో జక్కన్నకు సహాయం చేసిన వారిని మర్చిపోకుండా.. వారి మీద లవ్ చూపిస్తూ.. వారి లైఫ్ ని జక్కన్న తన చేతుల్లోకి తీసేసుకుంటాడు. వారికి ఇష్టం లేకపోయినా ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ అందరికి థాంక్స్'' అని చెప్పారు. 

నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ''మారుతి సునీల్ తో సినిమా చేద్దామని అన్నారు. ఈ కథ బాగా నచ్చి ఆయనతో సినిమా చేయాలనుకున్నప్పుడు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఏం చేస్తే సినిమా ఆడుతుందని కొందరు రైటర్స్ ను పిలిపించుకొని సొంత ఖర్చుతో వాళ్ళని పోషించారు. నేను బయట విన్న దానికి ఆయనను ప్రత్యక్షంగా చూసిన దానికి పొంతన లేదు. ఈ సినిమా పూర్తవ్వడానికి కారణం సునీల్ గారే. దినేష్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. వంశీ సినిమాను బాగా చెక్కాడు. ఔట్ పుట్ బాగా వచ్చింది'' అని చెప్పారు. 

మ్యూజిక్ డైరెక్టర్ దినేష్ మాట్లాడుతూ.. ''ఈ ఆల్బమ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన నా పేరెంట్స్ కి నాకు అవకాశం ఇచ్చిన చిత్ర దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు'' అని చెప్పారు.

మన్నారా చోప్రా మాట్లాడుతూ.. ''నాకు డైలాగ్స్ చెప్పే విషయంలో రామ్ ప్రసాద్ గారు ఎంతో హెల్ప్ చేశారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ''సునీల్ అన్న సినిమాలో ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తాడనే నమ్మకం అందరిలో ఉంది. తెలుగు ఇండస్ట్రీ మంచి కమెడియన్ ను కోల్పోయినా.. మంచి హీరోను దక్కించుకుంది. సునీల్ అన్న ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు. ఈ సినిమా టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

రాజారవీంద్ర మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో సునీల్ పూర్తి స్థాయి కామెడీ పాత్రలో కనిపిస్తాడు. నాకు ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ కి కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి'' అని చెప్పారు. 

సప్తగిరి మాట్లాడుతూ.. ''ప్రేమ కథా చిత్రం సినిమా తరువాత నా లైఫ్ మారిపోయింది. ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ సినిమాలో డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను. ఇంత మంచి పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు రుణ పడి ఉంటాను'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్, తమన్, ఎన్.శంకర్, ప్రతాని రామకృష్ణ గౌడ్, చిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.


Loading..
Loading..
Loading..
advertisement