Advertisement

నాకంటే గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఎవరికి లేదు: నాని

Thu 23rd Jun 2016 12:50 PM
gentleman movie,nani,indraganti mohan krishna,manisharma  నాకంటే గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఎవరికి లేదు: నాని
నాకంటే గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఎవరికి లేదు: నాని
Advertisement

నాని, సురభి, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో శ్రీదేవి మూవీస్ పతాకంపై ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం 'జెంటిల్ మన్'. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా.. చిత్రబృందం బుధవారం హైద్రాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

నాని మాట్లాడుతూ.. ''సినిమాలతో జయాపజయాలు వస్తాయి. కానీ కొన్ని చిత్రాలతో మాత్రమే గౌరవం వస్తుంది. ఈ సినిమాతో నాకు అదే లభించింది. జెండాపై కపిరాజు సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించాను. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. కానీ నేను ఆశించిన ఫలితం రాలేదు. ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో నటించాను. ఈ సినిమాతో నాకు డబుల్ సక్సెస్ వచ్చిందనే చెప్పాలి. మోహన్ గారు కథ చెప్పినప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యాను. శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాలో నటిస్తున్నాడనగానే నా ఎగ్జైట్మెంట్ డబుల్ అయింది. థ్రిల్లర్ సినిమాలకు ఎడిటింగ్ చాలా ముఖ్యం. ఈ సినిమాలో బిగ్గెస్ట్ టాస్క్ క్లైమాక్స్. దాన్ని ప్రేక్షకులకు అర్ధమయ్యేలా మార్తాండ్ కె వెంకటేష్ గారు చక్కగా ఎడిటింగ్ చేశారు. మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి క్లాప్స్ పడుతున్నాయి. ఆయన మ్యూజిక్ చేసిన సినిమాలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నివేద, సురభిలు బాగా నటించారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లేదు.. ఎలా సర్వైవ్ అవుతాననుకున్నాను. కానీ ప్రేక్షకుల సపోర్ట్ ఉంటే చాలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదు. ఆ విషయంలో నాకంటే గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఎవరికి లేదు'' అని చెప్పారు. 

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ... ''నా సినిమాలు సంసారపక్షంగా.. సెన్సార్ పక్షంగా ఉంటాయని అంటారు.. అందుకే సినిమాకు 'యు' సర్టిఫికెట్ లభించింది. ప్రేక్షకుల విలువైన సమయం, డబ్బు వృధా కానీ సినిమాలు రావాలి. జయాపజయాలకు అతీతంగా కృష్ణప్రసాద్ గారు నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు మొదటి హీరో రచయితే. అద్భుతమైన స్టోరీ ఇచ్చారు. 2008 లో నాని తో 'అష్టా చమ్మా' సినిమా చేశాను. తన డెబ్యూ సినిమాలోనే వైవిద్యమైన పెర్ఫార్మన్స్ చూపించిన నటుడు నాని. నాకు బాగా ఇష్టమైన వ్యక్తుల్లో నాని ఒకరు. నివేద, సురభిలు తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. మణిశర్మ గారితో మ్యూజిక్ సెషన్స్ కూర్చోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాకు చాలా లైవ్ ట్యూన్స్ ఇచ్చారు. మంచి సాహిత్యం కుదిరింది'' అని చెప్పారు. 

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ''మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని చాలా ప్రయత్నించాను. ఈ కథను మోహన్ కృష్ణ గారికి వినిపించాం. ఆయనకు నచ్చింది. కథను ఓన్ చేసుకొని చక్కగా తెరకెక్కించారు. నాని చాలా బాగా నటించాడు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కు సపోర్ట్ చేసిన టీమ్ కు థాంక్స్'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో సురభి, నివేద, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ యూనిట్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement