Advertisement

యూత్ కు మెసేజ్ ఇచ్చే 'ఫ్రెండ్ రిక్వెస్ట్'!

Mon 20th Jun 2016 07:37 AM
friend request movie,adithya om,vijay varma,rohit  యూత్ కు మెసేజ్ ఇచ్చే 'ఫ్రెండ్ రిక్వెస్ట్'!
యూత్ కు మెసేజ్ ఇచ్చే 'ఫ్రెండ్ రిక్వెస్ట్'!
Advertisement

మోడరన్ సినిమా పతాకంపై ఆదిత్యా ఓం స్వీయ దర్శకత్వంలో విజయ్ వర్మ పాకలపాటి నిర్మాణ నిర్వహణలో తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రూపుదిద్దుకున్న చిత్రం 'ఫ్రెండ్ రిక్వెస్ట్'. ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

అశోక్ కుమార్ మాట్లాడుతూ... ''టీజర్ లో ప్రతి ఫ్రేం పెర్ఫెక్ట్ గా ఉంది. హారర్ కు క్రైమ్ ను జోడించి తీసిన సినిమా. యూత్ ను ఆకట్టుకునే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది'' అని చెప్పారు. 

రుద్రాది పద్మరాజు మాట్లాడుతూ.. ''తెలుగులో విజయవంతమైన సినిమాలు చేసిన ఆదిత్య మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. టీజర్ చూసిన తరువాత ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. బిజినెస్ ను పూర్తి చేసుకొని జూలై మొదటి వారంలో రాబోతున్న ఈ సినిమా సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

దర్శకుడు ఆదిత్యా ఓం మాట్లాడుతూ.. ''ఫేస్ బుక్ నేపధ్యంలో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మితమైన ఈ చిత్రం నేటి యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సోషల్ మీడియాకు యడిక్ట్ అవుతోన్న యూత్ కి చక్కని సందేశం ఇచ్చే చిత్రమిది. యాక్షన్ ఎపిసోడ్ కి ఎంతో ప్రాదాన్యతనిచ్చి హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

రోహిత్ మాట్లాడుతూ.. ''యూత్ కి మెసేజ్ ఇచ్చే సినిమా. ఆదిత్య బాగా డైరెక్ట్ చేశారు'' అని చెప్పారు. 

ప్రకాష్ మాట్లాడుతూ.. ''రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమాను ప్రారంభించాం. ఆదిత్య ఎంతో ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

ఖైదర్ బాబు మాట్లాడుతూ.. ''ఫేస్ బుక్ నేపధ్యంలో పాట రాయమని అడిగినప్పుడు కొత్తగా అనిపించింది. టైటిల్ యూత్ ను ఆకర్షించే విధంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి వీజయాన్ని సాధిస్తుంది'' అని చెప్పారు. 

ఈ చిత్రానికి మాటలు: టి.రాఘవ, సంగీతం: లవన్, వీరల్ మిస్త్రి, నిర్మాణ నిర్వహణ: పి.విజయ్ వర్మ, దర్శకత్వం: ఆదిత్య ఓం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement