Advertisementt

వైజాగ్‌లో రామ్‌ సినిమా పట్టాలెక్కింది

Sun 12th Jun 2016 05:24 PM
hero ram,santosh srinivas,vizag schedule,14 reels  వైజాగ్‌లో రామ్‌ సినిమా పట్టాలెక్కింది
వైజాగ్‌లో రామ్‌ సినిమా పట్టాలెక్కింది
Advertisement
Ads by CJ

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.8గా నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ను జూన్‌ 14 నుంచి 30 వరకు వైజాగ్‌లో చేయబోతున్నాం. రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ మూవీ కందిరీగ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో చేస్తున్న మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నాన్‌ స్టాప్‌గా షూటింగ్‌ చేసి దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. మా 14 రీల్స్‌ బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్‌ చిత్రం అవుతుంది అన్నారు.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, ఆర్ట్‌: అవినాష్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ