Advertisementt

రొటీన్ కు భిన్నంగా 'గుప్పెడంత ప్రేమ'!

Wed 08th Jun 2016 08:34 PM
vinod lingala,guppedantha prema,love story  రొటీన్ కు భిన్నంగా 'గుప్పెడంత ప్రేమ'!
రొటీన్ కు భిన్నంగా 'గుప్పెడంత ప్రేమ'!
Advertisement
Ads by CJ

సాయి రోనక్, అదితి సింగ్ జంటగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వం వహించిన చిత్రం 'గుప్పెడంత ప్రేమ'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. దర్శకుడు వినోద్ లింగాల విలేకర్లతో ముచ్చటించారు. ''నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి యూరోపియన్ యూనియన్ గవర్నమెంట్ వారు అందించిన స్కాలర్షిప్ తో లండన్ లో ఎం.ఎస్ పూర్తి చేశాను. సినిమాల మీద మక్కువతో దానికి సంబంధించి కొన్ని కోర్సులు ఫారెన్ లోనే చేశాను. ఆ తరువాత ఇండియాకు వచ్చి 'ఇట్స్ మై లవ్ స్టోరీ','సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి చిత్రాలకు పని చేశాను. ఇదే మంచి సమయమని భావించి 'గుప్పెడంత ప్రేమ' అనే అనే లవ్ స్టోరీను సినిమాగా తెరకెక్కించాను. గుండె అనేది గుప్పెడే ఉంటుంది. ఆ గుప్పెడంత ప్రేమ కోసం మనిషి ఏదైనా చేస్తాడు. ఇదొక ప్యూర్ లవ్ స్టొరీ. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుంది. ఈ సినిమా నార్త్ ఈస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. మేఘాలయ, చిరపుంజి తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం. ఓ జంట మధ్య కలిగే ఫస్ట్ లవ్ ఫీలింగ్స్ ను ఈ సినిమాలో డీల్ చేశాం. ఇప్పటికే ప్రేమ కథల మీద చాలా సినిమాలు వచ్చాయి. కాని వాటన్నింటి కంటే మా సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చే చిత్రమవుతుంది. జూన్ 17న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ