Advertisementt

'శ్రీ శ్రీ' సక్సెస్ మీట్!

Mon 06th Jun 2016 08:11 PM
sri sri movie success meet,krishna,muppalaneni siva  'శ్రీ శ్రీ' సక్సెస్ మీట్!
'శ్రీ శ్రీ' సక్సెస్ మీట్!
Advertisement

సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రల్లో ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శ్రీ శ్రీ'. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ''ఇదివరకు నేను నటించిన చిత్రాల్లానే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా డైలాగ్స్ కి, విజయనిర్మల చెప్పిన డైలాగ్స్ కి థియేటర్స్ లో క్లాప్స్ కొడుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ముప్పలనేని శివ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఇంత మంచి క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణం నిర్మాతలే. సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. యుగాండా వంటి ప్రాంతాల్లో కూడా సినిమా రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇలానే ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

నిర్మాతలు సిరాజ్, బాలు మాట్లాడుతూ.. ''మా బ్యానర్ లో మొదటి సినిమా కృష్ణ గారి లాంటి హీరోతో చేయడం మా అద్రుష్టం. అన్ని ఏరియాల నుండి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఓవర్ సీస్ లో కూడా సినిమాను బాగా ఆదరిస్తున్నారు'' అని చెప్పారు.

ముప్పలనేని శివ మాట్లాడుతూ.. ''జూన్ 3న విడుదలయిన ఈ సినిమా యునానిమాస్ టాక్ తో సూపర్ హిట్ చిత్రంగా రన్ అవుతోంది. ఆరు సంవత్సరాల తరువాత కృష్ణ గారు మంచి సినిమా చేశారని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఆయనొక పవర్ ఫుల్ పాత్రలో నటించారు. నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓవర్ సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. కృష్ణ గారి కెరీర్ లో ఓ గొప్ప చిత్రంగా 'శ్రీ శ్రీ' నిలిచిపోతుంది'' అని చెప్పారు.

రాజు నడింపల్లి మాట్లాడుతూ.. ''మొదటిసారి ఆన్ లైన్ లో రిలీజ్ అయిన చిత్రంగా కృష్ణ గారు రికార్డ్ సృష్టించారు. కెన్యా, యుగాండా, మొరాకో వంటి ప్రాంతాల్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఏ ఉద్దేశ్యంతో మేము ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో రిలీజ్ చేసామో అది నెరవేరింది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కథ: రమేష్ డిఓ ప్రొడక్షన్స్, డైలాగ్స్: రామ్ కంకిపాటి, మ్యూజిక్: ఇ.ఎస్.మూర్తి, సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఆర్ట్ డైరెక్టర్: అశోక్, ఎడిటర్: రమేష్, కాన్సెప్ట్ రైటర్: కళ్యాన్ జీ, కో డైరెక్టర్: రమేష్ రాజా.ఎం, ఫైట్స్: నందు, అసోసియేట్ డైరెక్టర్: విజయ భాస్కర్ కైలాసపు, నిమ్మకాయల కోటి, అసిస్టెంట్ డైరెక్టర్: శ్రీ రామ్, కాస్ట్యూమ్స్: రమేష్, సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: తాండవ కృష్ణ, నారాయణ, ప్రొడక్షన్ మేనేజర్: కె.మల్లిక్, నిర్మాతలు: శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్, దర్శకత్వం: ముప్పలనేని శివ.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement