Advertisementt

దాస‌రిగారు త్రివిక్ర‌మ్‌నే సెట్ చేశారా?

Tue 03rd May 2016 09:04 AM
pavan kalyan,dasari narayanarao,trivikram for pavankalyan,trivikram for dasari movie   దాస‌రిగారు త్రివిక్ర‌మ్‌నే సెట్ చేశారా?
దాస‌రిగారు త్రివిక్ర‌మ్‌నే సెట్ చేశారా?
Advertisement
Ads by CJ
ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడా దాస‌రి నిర్మాణంలో  ఓ సినిమా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. యేడాదిగా ఆ సినిమా గురించి స‌న్నాహాలు చేస్తూనే వున్నాడు దాస‌రి. ప‌లువురు ద‌ర్శ‌కుల‌తో క‌థ‌లు కూడా సిద్ధం చేయించిన‌ట్టు తెలుస్తోంది.  మంచి  క‌థ, ద‌ర్శ‌కుడు ఓకే అయితే సినిమా చేయ‌డానికి స‌మ‌స్యేమీ లేద‌ని ప‌వ‌న్ కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు.  విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఎట్ట‌కేల‌కు దాస‌రికి ద‌ర్శ‌కుడు దొరికిన‌ట్టు తెలిసింది. ఆయన  త్రివిక్ర‌మ్‌తోనే  క‌థ‌ని సిద్ధం చేయించాడ‌ట‌. దాస‌రి అడ‌గ‌టంతో  మొద‌ట క‌థ మాత్ర‌మే సిద్ధం చేసి ఇవ్వాల‌నుకొన్న త్రివిక్ర‌మ్ ఆ త‌ర్వాత తానే డైరెక్ష‌న్ చేస్తాన‌ని ముందుకొచ్చాడ‌ట‌.  ఇక దాస‌రికి అంత‌కంటే కావ‌ల్సింది ఏముంటుంది? అందుకే వెంట‌నే ఆ సినిమాకోసం  స‌న్నాహాలు మొద‌లుపెట్టార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే  చిత్రం ప‌ట్టాలెక్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దాస‌రి జ‌న్మ‌దినం మే 4. ఆ రోజు ఆ చిత్రం గురించి స్వ‌యంగా వెల్ల‌డించే అవ‌కాశాలున్న‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఎస్‌.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. అది కూడా ఓ ప్రేమ‌క‌థే కాబ‌ట్టి త్వ‌ర‌లోనే పూర్త‌వుతుంది. ఆ త‌ర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్‌ల సినిమానే తెర‌కెక్క‌బోతోంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ