Advertisement

రెడీ ఫర్ రిలీజ్ 'డార్లింగ్‌ 2'!

Wed 20th Apr 2016 09:20 AM
darling 2,gnanavel raja,sathish chandrasekhharan  రెడీ ఫర్ రిలీజ్ 'డార్లింగ్‌ 2'!
రెడీ ఫర్ రిలీజ్ 'డార్లింగ్‌ 2'!
Advertisement

ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తమిళ చిత్రం 'డార్లింగ్‌ 2'. ఈ చిత్రం  తమిళంలో ఏప్రిల్‌ 1న విడుదలై భారీ కలెక్షన్స్‌ సాధిస్తూ హౌస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది.  ఈ చిత్రాన్ని వరుణ్‌ చౌదరి గోగినేని సమర్పణలో ఎవర్‌ గ్రీన్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెలుగులో 'డార్లింగ్‌ 2' పేరుతోనే అనువదిస్తున్నారు నిర్మాత మాధురి బొల్లు. కళైయరసన్‌, రమీజ్‌ రాజా, మాయ, కాళి వెంకట్‌ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సతీష్‌ చంద్రశేఖరన్‌ దర్శకుడు. లవ్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్, హర్రర్‌ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే నెలలో విడుదకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాధురి బొల్లు మాట్లాడుతూ... 'ఎక్కడా రాజీపడకుండా తెలుగు స్ట్రెయిట్‌ సినిమాలా డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తిచేశాం. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇచ్చారు. మేలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. అన్ని ఏరియాల్లో బిజినెస్‌ పరంగా రెస్పాన్స్‌ బాగుంది. మధురై సమీపంలోని ఓ ఫారెస్ట్‌లో అధిక భాగం షూటింగ్‌ జరుపుకుంది. కొడైకెనాల్‌, కేరళ ప్రాంతాల్లో కూడా కొంత పార్ట్‌ చిత్రీకరించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్‌ చంద్రశేఖరన్‌తో పాటు మరో నలుగురు మిత్రులకు నిజ జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకుని ఈ చిత్రం రూపొందించారు. కథ విషయానికి వస్తే... ఐదుగురు మిత్రులు ఫారెస్ట్‌లోకి పిక్నిక్‌కి వెళతారు. అక్కడ ఓ బంగళాలో వారికి ఎదురైన పరిస్థితులేమిటి? దానివలన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నది మెయిన్‌ కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. కథ సినిమాకు మెయిన్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ఇందులో సస్పెన్స్‌, థ్రిల్లర్, హర్రర్‌తో పాటు చక్కని లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. కెమెరా పనితనం, సంగీతం సినిమాకు ఆయువుపట్టు. పెద్ద హీరోల చిత్రాలకు ధీటుగా తమిళనాడులో ఆడుతూ భారీ కలెక్షన్స్‌ రాబడుతోంది.

కళైయరసన్‌, రమీజ్‌ రాజా, మాయ, కాళి వెంకట్‌, హరి, అర్జునన్‌, రాందాస్‌ తదితయి నటించిన ఈ చిత్రానికి సంగీతం: రథన్‌, మాటు: రాజశేఖర్‌ రెడ్డి, పాటు: శివగణేష్‌, సినిమాటోగ్రఫీ: విజయ్‌ కార్తీక్‌ కణ్ణన్‌, సమర్పణ: వరుణ్‌చౌదరి గోగినేని, సహ నిర్మాత: షషిత మైనేని, నిర్మాత: మాధురి బొల్లు, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సతీష్‌ చంద్రశేఖరన్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement