Advertisement

సూర్య కెరీర్ లో బెస్ట్ ఫిలిం ఇదేనట..!

Mon 18th Apr 2016 07:25 PM
suriya,24 movie release date,vikram k kumar,gnanavel raja  సూర్య కెరీర్ లో బెస్ట్ ఫిలిం ఇదేనట..!
సూర్య కెరీర్ లో బెస్ట్ ఫిలిం ఇదేనట..!
Advertisement

వైవిధ్యమైన పాత్రలతో కలెక్షన్ల సునామీ సృష్టించే హీరో సూర్య, సామాన్యుడి ఆలోచనలకు అందకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రాల్ని తెరకెక్కించే స్టామినా ఉన్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందించిన ప్రెస్టీజియస్ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'. గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మే 6న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా..

సూర్య మాట్లాడుతూ.. ''సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. రిలీజ్ అయిన తరువాత సినిమా మాట్లాడుతుంది. మే 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. స్క్రిప్ట్ బాగా నచ్చింది. నేనే సినిమాను ప్రొడ్యూసర్ చేయాలనుకున్నాను. రెహమాన్ గారు మ్యూజిక్ చేయడానికి అంగీకరించిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టాం. శంకరాభరణం, అన్నమయ్య, ఈగ, బాహుబలి వంటి భిన్నమైన చిత్రాలను ఆదరించారు. రీసెంట్ గా వచ్చిన మనం, ఊపిరి వంటి చిత్రాలు కూడా బాగా ఆడాయి. మా సినిమాకు కూడా ప్రత్యేకమైన స్థానం లభిస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో నా ఫేవరేట్ క్యారెక్టర్ ఆత్రేయ. సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశామని'' చెప్పారు.

విక్రం కె కుమార్ మాట్లాడుతూ.. ''సూర్య గారు లేకపోతే ఈ సినిమా ఇంత పెద్దగా చేసేవాడ్ని కాదు. ఈ సినిమాలో ఆత్రేయ బెస్ట్ క్యారెక్టర్. సమంత, నిత్యమీనన్ లు తమ అందంతోనే కాకుండా అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. భవిష్యత్తులో కూడా వారితో కలిసి వర్క్ చేస్తాను. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. తన సంగీతంతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళారు. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా చూసుకుంటూ.. ఒక కొత్త ప్రెజంటేషన్ తో తెరకెక్కించాం. సినిమాలో ప్రతి ఫ్రేం ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా ఉంటుంది'' అని చెప్పారు.

జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. ''ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన సూర్య గారికి థాంక్స్. 'మనం' సినిమా చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. విక్రం గారికి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశాను. ఆ సమయంలో ఆయన ఒక లైన్ ఉంది.. సూర్య గారికి వినిపించాలని చెప్పారు. సూర్య గారికి కలిసి నాలుగున్నర గంటల నేరేషన్ ఇచ్చారు. కథ విని సూర్య గారే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. విక్రం గారు ఎంతో డెడికేషన్ తో సినిమా చేశారు. సూర్య గారు మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో బాగా నటించారు. ఈ సినిమాకు రెహ్మాన్ గారి డిస్ట్రిబ్యూషన్ ఎంతో ఉంది. సూర్య కెరీర్ లో బెస్ట్ ఫిలిం గా నిలిచిపోతుందని'' చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫి: కె.తిరునాపుక్కరసు, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైన్ - అమిత్ రే మరియు సుభ్రదా చక్రబోర్తి, పాటలు - చంద్రబోస్ మరియు శశాంక్ వెన్నెలకంటి, సౌండ్ డిజైన్ - లక్ష్మీ నారాయణన్, సౌండ్ ఎఫెక్ట్స్ - ఇక్బాల్, యాక్షన్ - అన్బరివ్, కొరియోగ్రఫీ - రాజు సుందరం, బృంద, దినేష్, శ్రీధర్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - జులియన్ ట్రౌసెల్లియర్, మేకప్ - క్లోవర్ వూటాన్ మరియు ప్రీతి షీల్.జి.సింగ్, కాస్ట్యూమ్ డిజైన్- దర్శన్ జలన్, ఇషా-దివ్య మరియు నిధి-అనిషా, స్టిల్స్ - ఆర్.వెంకట్రామ్, పబ్లిసిటీ డిజైన్ - రైసింగ్ ఆపిల్, రెడ్ డాట్, పి.ఆర్.ఓ - ఎస్ కె ఎన్ మరియు ఏలూరు శ్రీను, నిర్మాత: సూర్య, రచన-దర్శకత్వం-విక్రం కె కుమార్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement