Advertisement

'రైట్ రైట్' ట్రైలర్ వచ్చేసింది!

Sun 17th Apr 2016 10:01 PM
right right movie,sumanth ashwin,manu,vamsi krishna  'రైట్ రైట్' ట్రైలర్ వచ్చేసింది!
'రైట్ రైట్' ట్రైలర్ వచ్చేసింది!
Advertisement

సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీ కృష్ణ నిర్మిస్తోన్న చిత్రం 'రైట్ రైట్'. ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో బి.గోపాల్, మారుతి, వంశీ పైడిపల్లి కలిసి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

బి.గోపాల్ మాట్లాడుతూ.. ''ట్రైలర్ బావుంది. రైట్ రైట్ అనేది పాపులర్ వర్డ్. సుమంత్ అశ్విన్ కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఎం.ఎస్.రాజు గారు ఎందఱో కొత్త దర్శకులను ఇండస్ట్రీకు పరిచయం చేశారు. ఈ సినిమా ద్వారా మను అనే మరో డైరెక్టర్ పరిచయం కానున్నాడు. ఈ సినిమా విజయంతో అందరికి మంచి పేరు రావాలి'' అని చెప్పారు. 

మారుతి మాట్లాడుతూ.. ''ఈ సినిమా పోస్టర్ చూసినప్పుడే ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. సుమంత్ అశ్విన్ రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా చేయలాని ఓ విలేజ్ అబ్బాయి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు ప్యాషన్ తో వర్క్ చేసే టెక్నికల్ టీం కుదిరింది. మను మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ''ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. సుమంత్ అశ్విన్ డైరెక్టర్ అవుతాడనుకున్నా.. కానీ యాక్టర్ అవుతాడనుకోలేదు. సుమంత్ కు ఈ సినిమాతో మంచి హిట్ రావాలి'' అని చెప్పారు.

సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ.. ''అశ్విన్ మంచి పెర్ఫార్మార్. జెబి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

దర్శకుడు మను మాట్లాడుతూ.. ''డ్రైవర్ కు కండక్టర్ కు మధ్య జరిగే కథే ఈ సినిమా. సుమంత్ బాగా నటించాడు. మే చివరి వారంలో లేదా.. జూన్ మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ''ప్రతి యాక్టర్ కు కొన్ని కళలు ఉంటాయి. డిఫరెంట్ గా చేయాలనుకుంటాడు. ఈ సినిమాకు మంచి టెక్నీషియన్స్ కుదిరారు. అందరికి మంచి పేరొస్తుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

నిర్మాత వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ''ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన ఎం.ఎస్.రాజు గారికి థాంక్స్'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, మ్యూజిక్: జె.బి, డైలాగ్స్: డార్లింగ్ స్వామి, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, లిరిక్స్: శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్: కె.ఎం.రాజీవ్, కోరియోగ్రఫీ: విజె, కో ప్రొడ్యూసర్: ఎమ్.వి.నరసింహులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.శ్రీనివాస రాజు, నిర్మాత: జె.వంశీ కృష్ణ, డైరెక్టర్: మను.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement