'అనుష్టానం' పాటలు విడుదల!

Wed 13th Apr 2016 06:43 PM
anushtanam movie,gajal srinivas,madhaveelatha  'అనుష్టానం' పాటలు విడుదల!
'అనుష్టానం' పాటలు విడుదల!
Sponsored links

గజల్ శ్రీనివాస్, మాధవీలత జంటగా లతాశ్రీ చిత్రాలయమ్స్ బ్యానర్ పై ఎమ్.పి.రవిరాజ్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'అనుష్ఠానం'. కృష్ణవాసా  ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. లగడపాటి శ్రీధర్ ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. ఈ సందర్భంగా..

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ''గజల్ శ్రీనివాస్ మా కుటుంబంలో సభ్యుడు. మాధవీలతను 'నచ్చావులే' సినిమాలో చూశాను. అద్బుతంగా నటించింది. ఈ సినిమాలో కూడా బాగా నటించింది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'' అన్నారు.

''భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అటువంటి గొడవలను తెలియజేసే విధంగా సినిమాలను చిత్రీకరిస్తే భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. ఈ తరహ చిత్రాలను ప్రోత్సహించాలని'' అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

''ఈ సినిమాలో మొదట హీరోగా చేయాలనుకోలేదు. కథ విన్నప్పుడు బాగా నచ్చడంతో చేశాను. కన్యాశుల్కంలో గిరీశం తరహా డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను. ఇదొక ఆత్మ వంటి కథ. హీరోయిన్ గా మాధవీలత అద్భుతంగా నటించింది. తమిళం, హిందీ, మలయాళం, బెంగాలీ భాషల్లో సినిమాను డబ్ చేసి జూన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని'' గజల్ శ్రీనివాస్ అన్నారు.

''చలం గారి సాహిత్య స్ఫూర్తితో కృష్ణ వాసా చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో సినిమా చేయాలనుకున్నాను. మంచి మ్యూజిక్ కుదిరింది. సహకరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని నిర్మాత ఎమ్.పి.రవిరాజ్ రెడ్డి అన్నారు

దర్శకుడు కృష్ణ వాసా మాట్లాడుతూ ''రవిరాజ్ గారు కథ వినగానే నచ్చి సినిమా చేయడానికి అంగీకరించారు. మంచి మ్యూజిక్ కుదిరింది. గజల్ శ్రీనివాస్ గారు, మాధవీలతగారు అద్భుతంగా నటించారు. సపోర్ట్ చేసిన అందరికి థాంక్స్'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కెమెరామెన్: వెంకటహనుమ, ఎడిటింగ్: కె.ఆంజనేయులు, నేపధ్య సంగీతం: చంద్రలేఖ,  ,ప్రచార శిల్పి: ధని ఏలే , సాంకేతిక సహకారం: సింటిల్లా  క్రియేషన్స్ ,రూప శిల్పి: బద్రి శ్రీను , కళా దర్శకత్వం: నారాయణ ,సహాయ దర్శకత్వం: ప్రసాద్ రాయుడు ,సాయిశర్మ ,రాజేష్ ఖన్నా, వెంకట్, నిర్మాణ –నిర్వాహణ:   సత్యన్నారాయణ, పాటలు డా. వడ్డేపల్లి కృష్ణ, రసరాజు, గోపీనాధ్ , సహ నిర్మాత: వల్లూరి జయప్రకాష్, సహ దర్శకత్వం: గోపీనాథ్, సహనిర్మాత: వల్లూరి జయప్రకాష్,  నిర్మాత: ఎమ్.పి.రవిరాజ్ రెడ్డి, సంగీతం, దర్శకత్వం: కృష్ణవాసా.

 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019