Advertisementt

'గోల్ మాల్ గుల్లు' సగం పూర్తయింది!

Tue 12th Apr 2016 12:57 PM
golmall gullu movie,gullu dada,bejjam rajesh puthra  'గోల్ మాల్ గుల్లు' సగం పూర్తయింది!
'గోల్ మాల్ గుల్లు' సగం పూర్తయింది!
Advertisement
Ads by CJ

గుల్లు దాదా, రఘుబాబు, పెంటాలి సేన్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో డిక్కి ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ ఫిలిం బ్యాన‌ర్‌పై బెజ్జం రాజేష్ పుత్ర దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'గోల్ మాల్ గుల్లు'. ఈ సినిమా యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 

దర్శకుడు రాజేష్ పుత్ర మాట్లాడుతూ.. ''టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఎంత క్రేజ్ ఉందో.. హైదరాబాదీ సినిమాల్లో గుల్లుదాదా సినిమాలకు అంత క్రేజ్ ఉంటుంది. గుల్లుదాదాను మొదటిసారిగా టాలీవుడ్ లో పరిచయం చేస్తున్నామని, అతనిలోని కొత్త పెర్ఫార్మన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పారు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు'' తెలిపారు.

''తెలుగులో నేను చేస్తున్న మొద‌టి చిత్రం. రెండు నెలల్లో అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామని'' గుల్లుదాదా అన్నారు. 

గుల్లుదాదా(అద్నాస్ సాజిద్ ఖాన్‌), ర‌ఘుబాబు, పెంటాలి సేన్, ప్రియాంక‌, వి.ఎస్.ప‌ద్మావ‌తి, అక్బ‌ర్ ష‌రీఫ్‌, హ‌సఫ్ స‌మీర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి క‌థః ప్రశాంత్ రూత్‌, కెమెరాః చ‌క్రి, మ్యూజిక్ః కున్ని, ఎడిట‌ర్ః స‌ర్తాజ్‌, ఆర్ట్ః డేవిడ్‌, డైలాగ్స్ః శ్రీహ‌ర్ష పిల్లా, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వంః బెజ్జం రాజేష్ పుత్ర‌

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ