Advertisement

బన్నీను చూస్తుంటే గర్వంగా ఉంది: చిరు

Mon 11th Apr 2016 06:06 PM
chiranjeevi,sarainodu audio success meet,allu arjun,boyapati sreenu  బన్నీను చూస్తుంటే గర్వంగా ఉంది: చిరు
బన్నీను చూస్తుంటే గర్వంగా ఉంది: చిరు
Advertisement

నాకు రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టమో అల్లు అర్జున్ కూడా అంతే ఇష్టం. తన విజయాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో బోయపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తోన్న చిత్రం 'సరైనోడు'. ఈ సినిమా ఆడియో విజయోత్సవ వేడుక ఆదివారం వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. ''అల్లు అర్జున్ కెరీర్ కు నేను బీజం వేశానని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. 'గంగోత్రి' సినిమాలో బన్నీ నటించడానికి ఒక రకంగా నేను కారణమయ్యాను. మా కుటుంబంలో ఉన్న హీరోలకు 'మీ వెనుక మెగాస్టార్, మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారనే ధీమాతో ఉంటే ఎదురు దెబ్బలు తింటారని కష్టాన్ని నమ్ముకోండని చెబుతుంటాను'.. బాధ్యత తెలుసుకొని కష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో బన్నీలో నటుడిగా ఒక పరిణితిని, వ్యక్తిగా హుందాతనాన్ని చూస్తున్నాను. రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్రలో నటించి శబాష్ అనిపించుకున్నాడు. 'సరైనోడు' సినిమాకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడనే అనుకుంటున్నాను. అలానే రకుల్ మంచి ప్రవర్తన ఉన్న నటి. బోయపాటి శ్రీను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుండి నాకు తెలుసు. తనలో మంచి ఎనర్జీ ఉంది. మాస్ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీ స్టామినాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళాడు. అల్లు అరవింద్ నిలకడగా, స్థిరంగా సినిమాలు చేస్తున్నారు. ఏప్రిల్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని'' కోరారు.

''తమన్ సాలిడ్ మ్యూజిక్ ఇచ్చారు. వైజాగ్ బీచ్ లో ఫంక్షన్ చేసుకోవాలనేది నా కల. ఆ కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆది ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తాడు. రకుల్ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో.. అంత తెలివైనది. బోయపాటి గారితో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉందని'' హీరో అల్లు అర్జున్ అన్నారు. 

''న్యాయం నాలుగు కాళ్ళపై నిలబడాలి. అన్యాయానికి అసలు కాళ్ళే ఉండకూడదు. ఈ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాను. అరవింద్ గారు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే భావిస్తున్నాను. కృషి, కసి కలిసుంటే అదే బన్నీ'' అని బోయపాటి శ్రీను అన్నారు.

'చిరంజీవి గారు పాతిక సంవత్సరాలు కష్టపడి ప్లాట్ ఫాం ను ఏర్పాటు చేస్తే.. ఆయన ద్వారా ఎందఱో హీరోలు ఆ ప్లాట్ ఫాంలోకి వస్తున్నారని'' నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement