Advertisementt

నా ప్యాషన్ ప్రొడక్షన్: జయతి

Wed 06th Apr 2016 09:24 PM
jayathi,lacchi movie,eswar,vennela program  నా ప్యాషన్ ప్రొడక్షన్: జయతి
నా ప్యాషన్ ప్రొడక్షన్: జయతి
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న యాంకర్స్ అందరూ ఇప్పుడు తమ అదృష్టాన్ని నటీమణులుగా కూడా పరీక్షించుకుంటున్నారు. మొన్నటివరకు ఈ లిస్టులో అనసూయ, రేష్మి మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు మరో యాంకర్ కూడా ఈ జాబితాలోకి చేరింది. ప్రముఖ చానెల్ లో వెన్నెల అనే ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జయతి ఇప్పుడు హీరోయిన్ గా 'లచ్చి' అనే సినిమాతో పరిచయం కానుంది. ఆ విశేషాలు జయతి మాటల్లో.. ''నేను యాంకర్ గా చేసిన వెన్నెల షో బాగా పాపులర్ అయింది. ఆ సమయంలోనే సినిమాల్లో నటించమని చాలా ఆఫర్ వచ్చాయి కానీ నేను పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే నాకు మొదటినుండి ప్రొడక్షన్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. నా ప్యాషన్ ప్రొడక్షన్. మలయాళంలో 'మై బాస్' అనే సినిమా రైట్స్ సొంతం చేసుకున్నాను. అయితే ఆ సినిమాను తెరకెక్కించే ముందు దర్శకుడు ఈశ్వర్ నాకు ఒక సినిమా కథ చెప్పాడు. ఆ కథ విన్నంతసేపు ఇన్వాల్వ్ అయిపోయాను. డైరెక్టర్ నేనే నటిస్తే బావుంటుందని సజెస్ట్ చేశారు. వెంటనే ఓకే చెప్పేశాను. ఆ సినిమా పేరు 'లచ్చి'. థ్రిల్లింగ్ గా సాగే ఓ హారర్ కామెడీ చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఒక వారంలో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సమ్మర్ లో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించాం. భవిష్యత్తులో నిర్మాతగానే కొనసాగాలనుకుంటున్నాను'' అని చెప్పారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ