Advertisementt

Ads by CJ

రెడీ ఫర్ రిలీజ్: 'అప్పుడలా ఇప్పుడిలా'

Tue 29th Mar 2016 03:43 PM
appudala ippudila,pradeep kumar,vishnu,surya teja  రెడీ ఫర్ రిలీజ్: 'అప్పుడలా ఇప్పుడిలా'
రెడీ ఫర్ రిలీజ్: 'అప్పుడలా ఇప్పుడిలా'
Advertisement
Ads by CJ

తెలంగాణా, ఆంధ్రప్ర‌దేశ్ లో ఏప్రిల్‌1 న  'అప్పుడలా ఇప్పుడిలా' విడుద‌ల‌

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'అప్పుడలా ఇప్పుడిలా'. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్ కుమార్ జంపా నిర్మాత. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు కె.ఆర్.విష్ణు మాట్లాడుతూ.. ''ఈ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్స్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సుమన్, నరేష్, సూర్యతేజ, హర్షికి సహా ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్ బాగా సపోర్ట్ చేశారు, అందరికీ థాంక్స్ ఏప్రిల్ 1 న విడుద‌ల‌వుతుంది. అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది'' అన్నారు.

నిర్మాత ప్రదీప్ కుమార్ జంపా మాట్లాడుతూ.. ''మా బ్యానర్ కి మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. డైరెక్టర్ విష్ణు ప్రతి సన్నివేశాన్ని బాగా డిజైన్ చేశారు. బ్రహ్మారెడ్డిగారు మంచి కథను అందించారు. మా  ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 1న విడుద‌ల చేస్తున్నాము. సునీల్ కాశ్యప్ గారు అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తాయి.  అన్నారు.

సుమన్, నరేష్, సుధ, సంగీత, శివారెడ్డి, పృథ్వీ, సుప్రీత్, ప్రభాష్ శ్రీను, వేణు, సుడిగాలి సుధీర్, ఫిష్ వెంకట్, జోష్ రవి, అనంత్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్: రాకేష్, శేఖర్, భాను, కథ: బ్రహ్మారెడ్డి కమతం, మాటలు: పానుగంటి జయంత్, పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్, చైతన్యవర్మ, ఆర్ట్: గోవింద్, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, సినిమాటోగ్రఫీ: పి.సి.ఖన్నా, పి.ఆర్‌.వో తేజ‌స్వి స‌జ్జా, సంగీతం: సునీల్ కశ్యఫ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బిక్షపతి తుమ్మల, నిర్మాత: ప్రదీప్ కుమార్ జంపా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.విష్ణు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ