Advertisement

'ఎటాక్' సినిమా పాటలు విడుదల!

Tue 22nd Mar 2016 11:10 PM
attack movie songs launch,ram gopal varma,manchu manoj,c.kayan  'ఎటాక్' సినిమా పాటలు విడుదల!
'ఎటాక్' సినిమా పాటలు విడుదల!
Advertisement
మంచు మనోజ్, సురభి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో రామ గోపాల్ వర్మ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై వరుణ్, తేజ. శ్వేతలాన, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'ఎటాక్'. రవిశంకర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. రామ్ గోపాల్ వర్మ బిగ్ సీడీను ఆవిష్కరించగా.. మంచు మనోజ్ ఆడియో సీడీలను రిలీజ్ చేసి తొలి సీడీను రామ్ గోపాల్ వర్మకు అందించారు. ఈ సందర్భంగా..
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ''చిన్న చితకా సినిమాలను చేస్తున్నానని సి.కళ్యాన్ గారు నన్ను పిలిచి పెద్ద క్లాస్ తీసుకున్నారు. ఇంటెన్స్, యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకులు నా నుండి ఎక్పెక్ట్ చేస్తారని చెప్పారు. ఆ కోణంలో చేసిన సినిమానే 'ఎటాక్'. హై ఇంటెన్సీ డ్రామా ఉన్న కథ ఇది. అలాంటి ఇంటెన్సీ ఉన్న పాత్రలో మనోజ్ నటించగలడని తనను సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో హ్యూమర్, రొమాన్స్ లాంటి అంశాలు ఉండవు. నిజానికి నాకు గజల్స్ నచ్చవు. కాని గజల్ శ్రీనివాస్ గజల్స్ వింటే మాత్రం అధ్బుతమైన ఫీలింగ్ కలిగింది. ధూల్ పేట్, మూసీనది ప్రాంతంలో చిత్రాకరించాం. దానికి కొంచెం గ్లామర్ ఉండాలని సురభిని హీరోయిన్ గా ఎన్నుకున్నాను'' అని చెప్పారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు మెయిన్ హీరో వర్మ గారు. యాక్టింగ్ కు, ఫిలిం మేకింగ్ కు వర్మ గారు యూనివర్సిటీ లాంటి వారు. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. చిన్నప్పటినుండి వర్మ గారంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. సి.కళ్యాన్ గారు మా కుటుంబంలో వ్యక్తి. ఆయన బ్యానర్ లో ఈ సినిమా చేశాం. ఆయన అడిగితే నెక్స్ట్ సినిమా కూడా ఆయన బ్యానర్ లో చేయడానికి నేను రెడీ. అందరూ డబ్బుల కోసం సినిమా చేస్తారు. కాని మేమంతా వర్మ గారి కోసం సినిమా చేశాను. ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు'' అని చెప్పారు.
సి.కళ్యాన్ మాట్లాడుతూ.. ''రామ్ గోపాల్ వర్మ చేసిన శివ, గాయం సినిమాలు మించి ఈ సినిమా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఓరియెంటెడ్ ప్యాక్డ్ ఫిలిం ఇది. మనోజ్ ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమాలే చేశారు. కాని వాటికి భిన్నమైన పాత్ర ఈ సినిమాలో చేశాడు. సురభి చక్కగా నటించింది. రామాయణ, మహాభారతాలను తలపించేలా సినిమా ఉంటుంది. టెక్నికల్ గా, క్వాలిటీ పరంగా బాగుండాలని సినిమా చేశాం. డిశంబర్ లోనే సినిమా పూర్తయినా.. మంచి డేట్ కోసం ఎదురు చూసి  ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
రవి శంకర్ మాట్లాడుతూ.. ''కిల్లింగ్ వీరప్పన్, ఎటాక్ సినిమాలకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన వర్మ గారికి నేను రుణపడి ఉంటాను. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ఆయన చేయబోయే వంగవీటి సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చారు. సిరాశ్రీ మంచి సాహిత్యాన్ని అందించారు. నా డైరెక్షన్ లో గజల్ శ్రీనివాస్ గారు పాట పాడడం సంతోషంగా అనిపించింది. మనోజ్ ఈ సినిమాలో టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో మనోజ్ పెర్ఫార్మన్స్ అధ్బుతంగా ఉంటుంది'' అని చెప్పారు.
గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''నేను ప్లేబ్యాక్ పాడకూడదని నిబంధన పెట్టుకున్నాను. నేను నటించిన ఒక సినిమాలో మాత్రమే పాడాను. కాని ఈ సినిమాలో వర్మ గారు నాతో పాట పాడించారు. సింగర్ గా రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ లో పరిచయమవ్వడం గర్వంగా ఉంది'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సిరాశ్రీ, సురభి, పూనమ్ కౌర్, అంజి తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి రచన: సమీర్ చంద్ర, పాటలు: సిరాశ్రీ, లైన్ ప్రొడ్యూసర్: ప్రసాద్ గుమ్ములూరి, ఎడిటర్: అన్వర్ అలీ, యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, మార్షల్ రమణ, ఆర్ట్: టి.నాగేంద్ర ఠాగూర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మ్యూజిక్: రవిశంకర్, సినిమాటోగ్రఫీ: అంజి, కో ప్రొడ్యూసర్: మలినేని లక్ష్మయ్య చౌదరి, నిర్మాతలు: వరుణ్, తేజ, శ్వేతలాన, సి.వి.రావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement