Advertisementt

'నన్ను వదిలి నీవు పోలేవులే' రిలీజ్ డేట్ ఫిక్స్!

Mon 21st Mar 2016 02:38 AM
nannu vadili neevu polevule,nannu vadili neevu polevule release date fix,nannu vadili neevu polevule release matter,sri raghava,kola balakrishna,geethanjali sri raghava  'నన్ను వదిలి నీవు పోలేవులే' రిలీజ్ డేట్ ఫిక్స్!
'నన్ను వదిలి నీవు పోలేవులే' రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ
>ఏప్రియల్‌ 1న 'నన్ను వదిలి నీవు పోలేవులే' విడుదల 

>బాలకృష్ణ కోలా, వామికా జంటగా బీప్‌టోన్‌ స్టూడియోస్‌, శ్రీ కామాక్షి మల్టీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'నన్ను వదిలి నీవు పోలేవులే'. డైరెక్టర్‌ శ్రీరాఘవ ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే అందించారు. గీతాంజలి శ్రీరాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కోలా భాస్కర్‌, కంచర్ల పార్థసారధి నిర్మాతలు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రియల్‌ 1న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. 

>ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు కోలా భాస్కర్‌, కంచర్ల పార్థసారధి మాట్లాడుతూ..' శ్రీరాఘవగారి స్నేహానికి ఇచ్చిన గౌరవం ఈ సినిమా. ఖర్చు గురించి ఆలోచించకుండా సినిమాని రూపొందించాము. ఇప్పటికే సంగీత దర్శకుడు అమృత్‌ స్వరపరిచిన ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. పాటలు సక్సెస్‌ అయినట్లే సినిమా కూడా మంచి సక్సెస్‌ అవుతుందనే నమ్మకం మాకుంది. శ్రీరాఘవ గారి కథ, స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. దర్శకురాలు గీతాంజలి శ్రీరాఘవ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరినీ అలరిస్తుంది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రియల్‌ 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాము..' అని అన్నారు. 

>బాలకృష్ణ కోలా, వామికా, కళ్యాణ్‌ నటరాజన్‌, శరణ్‌, పార్వతినాయర్‌ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి పాటలు: అనంత శ్రీరామ్‌, కూర్పు: రూకేష్‌, మాటలు: వి. కృష్ణతేజ, నృత్యం: కళ్యాణ్‌, సంగీతం: అమృత్‌, కెమెరా: శ్రీధర్‌, కథ-స్క్రీన్‌ప్లే: శ్రీరాఘవ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కె. మణికుమార్‌, 

>నిర్మాతలు: కోలా భాస్కర్‌, కంచర్ల పార్థసారధి 

>దర్శకత్వం: గీతాంజలి శ్రీరాఘవ 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ