లార్డ్ శివ క్రియేషన్స్ మొదటి సినిమా ప్రారంభం!

Fri 18th Mar 2016 04:41 PM
lord siva creations,sesha sai,krishna reddy,sakshi chowdary  లార్డ్ శివ క్రియేషన్స్ మొదటి సినిమా ప్రారంభం!
లార్డ్ శివ క్రియేషన్స్ మొదటి సినిమా ప్రారంభం!
Sponsored links

సాక్షి చౌదరి, పర్వీన్ రాజు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో శేష సాయి దర్శకత్వంలో లార్డ్ శివ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా శుక్రవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. ఎం.వి.ఎస్.సాయి కృష్ణారెడ్డి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కృష్ణారెడ్డి క్లాప్ కొట్టగా.. కోన రఘుపతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

దర్శకుడు శేష సాయి మాట్లాడుతూ.. ''రచయిత కొన్ని సినిమాలకు పని చేశాను. ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకొని నా బ్రదర్ కు లైన్ చెప్పాను. కథ నచ్చి తనే సినిమాను నిర్మిస్తానని చెప్పాడు. ప్రస్తుతం ఉన్న యువత ఆలోచనా.. విధానం, ప్రేమ పట్ల వారి ఒపీనియన్ ఇలాంటి అంశాలతో సినిమా నడుస్తుంటుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నాం. ఈ నెల 25 నుండి 27 వరకు పాటల చిత్రీకరణ జరిపి ఏప్రిల్ 10 నుండి సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభించనున్నాం'' అని చెప్పారు.

నిర్మాత సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ''కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సాక్షి చౌదరి మాట్లాడుతూ.. ''ఇదొక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం. సినిమాలో నా పాత్ర నచ్చి నటిస్తున్నాను. మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

పర్వీన్ రాజు మాట్లాడుతూ.. ''ప్రేమ కథకు కామెడీ జోడించి తీశారు. సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి లిరిక్స్: శ్రీ గణేష్, శేష సాయి, కెమెరా: శంకర్ కంతేటి, ఎడిటర్: నందమూరి హరి, మ్యూజిక్: కృష్ణ, ప్రొడక్షన్ మ్యానేజర్: చంద్ర రెడ్డి, నిర్మాత: ఎం.వి.ఎస్.సాయి కృష్ణారెడ్డి, కథ-డైలాగ్స్-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శేష సాయి.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019