Advertisementt

మూడు భాషల్లో 'ది మంకీ కింగ్‌' విడుదల!

Wed 16th Mar 2016 01:03 PM
the monkey king movie,chiyang pousay,satheesh kumar  మూడు భాషల్లో 'ది మంకీ కింగ్‌' విడుదల!
మూడు భాషల్లో 'ది మంకీ కింగ్‌' విడుదల!
Advertisement
Ads by CJ

500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకొని గత సంవత్సరం చైనాలో విడుదలై సంచలన విజయం సాధించిన 'ది మంకీ కింగ్‌' చిత్రం ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అదే పేరుతో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మార్చి 18న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌. ఈ సందర్భంగా..

నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ''ది మంకీ కింగ్‌' ఫస్ట్‌ పార్ట్‌ను తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోకి ఖర్చుకు వెనకాడకుండా ఎంతో క్వాలిటీగా డబ్బింగ్‌ చేయడం జరిగింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చుతుంది. 'బాహుబలి' చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగా ఎంజాయ్‌ దాన్ని మించి ఈ చిత్రంలోని గ్రాఫిక్స్‌నిగానీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌ని గానీ ఎంజాయ్‌ చేస్తారు. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చాలా చక్కని మాటలు రాశారు రాజశ్రీ సుధాకర్‌. అత్యంత భారీ బడ్జెట్‌తో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మా సంస్థ ద్వారా విడుదల చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మార్చి 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి సూపర్‌హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు. 

డోనీ ఎన్‌, చోయున్‌ఫాట్‌, అరోన్‌ క్వాక్‌, జో చెన్‌, పీటర్‌ హో ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: క్రిస్టఫర్‌ యంగ్‌, మాటలు: రాజశ్రీ సుధాకర్‌, నిర్మాత: సి.హెచ్‌.సతీష్‌కుమార్‌, దర్శకత్వం: చియాంగ్‌ పౌసాయ్‌.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ