Advertisement

'ప్రేమికుడు' పాటలు విడుదల!

Mon 14th Mar 2016 12:44 PM
premikudu movie audio launch,maanas,sanam shetty,kala sandeep  'ప్రేమికుడు' పాటలు విడుదల!
'ప్రేమికుడు' పాటలు విడుదల!
Advertisement

మానస్.ఎన్, సనమ్ శెట్టి జంటగా డిజిపోస్టర్ సమర్పణలో ఎస్.ఎస్.సినిమా పతాకంపై కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మీ నారాయణరెడ్డి, సునీల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'ప్రేమికుడు'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. వి.వి.వినాయక్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను రవికుమార్ చౌదరి కు అందించారు. ఈ సందర్భంగా..

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ''సినిమా ట్రైలర్, పాటలు చాలా బావున్నాయి. కొత్త వాళ్ళందరూ కలిసి చేశారు. ఈ సినిమా విజయాన్ని సాధిస్తే ఇండస్ట్రీకు కొత్త టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మానస్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. కెమెరామెన్ శివ చిన్న ఎక్విప్మెంట్ తో క్వాలిటీ అవుట్ పుట్ తీసుకొచ్చాడు. విజయ్ బాలాజీ అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మెలోడీ సాంగ్స్ బావున్నాయి. ఈ సినిమాతో దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలి'' అని చెప్పారు.

రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. ''సినిమా ట్రైలర్ బావుంది. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా మేకింగ్ లో ఎంతో ప్యాషన్ కనిపిస్తోంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు కళా సందీప్ మాట్లాడుతూ.. ''నేను చెప్పిన కథ నచ్చి చిత్ర నిర్మాతలు సినిమా నిర్మించడానికి అంగీకరించారు. బాలాజీ గారు నాకు ఐదు సంవత్సరాలుగా తెలుసు. నా మొదటి సినిమాకు ఆయనతో మ్యూజిక్ చేయించుకోవాలని అనుకున్నాను. హీరో మానస్ మంచి టాలెంటెడ్ పెర్సన్. చాలా కోపరేట్ చేశాడు. అలానే కెమెరామెన్ శివ లేకపోతే సినిమా ఇంత బాగా వచ్చుండేది కాదు. సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

విజయ్ బాలాజీ మాట్లాడుతూ.. ''ఇది నా ఐదవ చిత్రం. సాంగ్స్ బాగా రావడానికి కారణం దర్శకుడు కళా  సందీప్. తనకు కావలసినట్లుగా మ్యూజిక్ చేయించుకున్నాడు. కెమెరామెన్ అధ్బుతంగా తీశాడు. ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

హీరో మానస్ మాట్లాడుతూ.. ''టీం ఎఫర్ట్ తో సినిమా చేశాం. సినిమా చిత్రీకరణ ఎక్కువ శాతం నెల్లూరులో చేశాం. అక్కడ ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు. సినిమాలో హిలారియాస్ కామెడీ ఉంటుంది. విజయ్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు'' అని చెప్పారు.

సనమ్ శెట్టి మాట్లాడుతూ.. ''సందీప్ కథ చెప్పగానే బాగా నచ్చింది. ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు. విజయ్ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. కెమెరామెన్ శివ నన్ను చాలా అందంగా చూపించారు.ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, పద్మిని, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తాగుబోతు రమేష్, అనితా చౌదరి, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరామెన్: శివ.కె, మాటలు: మోహన్, పాటలు: శ్రీరాం తపస్వి, ఎడిటర్: మధు, సంగీతం: విజయ్ బాలాజీ, నిర్మాత: లక్ష్మీనారాయణరెడ్డి, సునీల్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళా సందీప్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement