అంజలి కూడా సాంగేసుకుంది!

Thu 10th Mar 2016 12:54 PM
anjali,chitrangadha movie,anjali sings song in chitrangadha movie,ashok director  అంజలి కూడా సాంగేసుకుంది!
అంజలి కూడా సాంగేసుకుంది!
Advertisement
Ads by CJ

‘చిత్రాంగద’ కోసం పాట పాడిన అంజలి! 

ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతోంది. తెలుగులో ‘చిత్రాంగద’ పేరుతో.. తమిళంలో ‘యార్నీ’ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో కథానాయిక అంజలి ఓ పాట పాడటం విశేషం. ‘డ...డ..డాంగ్...డాంగ్.. డంగ్ చుక్.. డంగ్ చుక్... యాపిల్ సెల్‌ఫోన్.. యాపిల్ రేటుకు వస్తే.. ఆషాడం సేల్‌లో ఆడీ కారు గిఫ్ట్‌గా వస్తే’ అంటూ అంజలి ఆలపించిన  పాటను సెల్వగణేషన్, స్వామినాథన్ సంగీత దర్శకత్వంలో ఇటీవల రికార్డ్ చేశారు. 

ఈ  సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ  ‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది. చిత్రంలో వుండే ట్విస్ట్‌లు ఆడియన్స్‌కు షాక్ గురిచేస్తాయి. అంజలి పాడిన పాట చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా అంజలియే ఈ పాట పాడింది.ఇప్పటి వరకు కథానాయిక అంజలిని తన కెరీర్‌లో చేయనటువంటి ఓ విభిన్నమైన పాత్రను ‘చిత్రాంగద’లో పోషిస్తుంది. టైటిల్ పాత్రలో ఆమె అభినయం చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తం ‘గీతాంజలి’ తర్వాత అంజలి నటిస్తున్న మరో లేడి ఓరియెంటెడ్ చిత్రమిది. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిస్తున్న ఈ హారర్, థ్రిల్లర్‌లో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో సాగుతుంది. కథానుగుణంగా ఆమెరికాలోని పలు అందమైన లొకేషన్స్ లో కీలక ఘట్టాల్ని చిత్రీకరించాం. ఈ నెలాఖరులో ఆడియోను, ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.  

సిందుతులానీ, సప్తగిరి, రక్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్,  ఎడిటర్: ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి, కథస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి, నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ