Advertisement

బాలకృష్ణ రిలీజ్ చేసిన 'సావిత్రి' ఆడియో!

Sat 05th Mar 2016 01:26 PM
savithri audio launch,nara rohit,pawan sadhineni,nanditha  బాలకృష్ణ రిలీజ్ చేసిన 'సావిత్రి' ఆడియో!
బాలకృష్ణ రిలీజ్ చేసిన 'సావిత్రి' ఆడియో!
Advertisement

నారా రోహిత్, నందిత జంటగా పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా.వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని జరిగింది. నందమూరి బాలకృష్ణ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ''సావిత్రి సినిమా పెళ్లి నేపధ్యంలో సాగే సినిమాగా కనిపిస్తుంది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన సినిమా ఇది. స్త్రీ లేనిదే జన్మ లేదు.. అసలు సృష్టే లేదు. భగవంతుడు కూడా తల్లి గర్భం నుండే పుడతారు. అలాంటి స్త్రీ పేరు మీదుగా వచ్చే 'సావిత్రి' అనే టైటిల్ ను ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నారు. సినిమా టైటిల్ ను బట్టి ప్రేక్షకులు ఆకర్షితులవుతారు. ఈ సినిమాకు చక్కటి టైటిల్ పెట్టుకున్నారు. నారా రోహిత్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు నా అభినందనలు. శ్రవణ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. సంగీతమంటే నేను కూడా చెవి కోసుకుంటాను. సంగీతం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. ఆణిముత్యాల్లాంటి ఆరు పాటలకు మణిపూసల్లాంటి మంచి బాణీలను సమకూర్చారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో పాటలు ధ్వనిలా ఉంటున్నాయి. ఈ సినిమా పాటలు మాత్రం చాలా బావున్నాయి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.. ''నేను ఈరోజు ఈ స్థానం ఉన్నానంటే దానికి కారణం మా నాన్న గారు, మా పెదనాన్న నారా చంద్రబాబునాయుడు గారు. సినిమాల్లోకి వచ్చిన తరువాత మా మావయ్య బాలకృష్ణ ఎంతో సహాయం చేశారు. రెండు సంవత్సరాలుగా పవన్ నేను ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ట్రావెల్ చేస్తున్నాం. కాని ప్రసాద్ గారు వచ్చిన తరువాతే ఈ సినిమా చేయడం సాధ్యమైంది. షార్ట్ స్పాన్ లో సినిమా చేశారు. ఆర్టిస్ట్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. 'సోలో' సినిమా తరువాత నా కెరీర్ లో అంతమంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిలుస్తుంది'' అని చెప్పారు.   

తారక రత్న మాట్లాడుతూ.. ''మంచి టీం అందరు కలిసి చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది. సినిమాలో కొన్ని సీన్స్, పాటలు చూశాను. రోహిత్ కెరీర్ లో ఇది మరొక 'సోలో' సినిమా అవుతుంది. ఈ మధ్యకాలంలో రోహిత్ మాదిరి కష్టపడే హీరోలను చూడలేదు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు'' అని చెప్పారు.

పవన్ సాధినేని మాట్లాడుతూ.. ''మా నాన్న బాలకృష్ణ గారికి వీరాభిమాని. ఆయన నా సినిమా ఆడియో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. నా మొదటి సినిమా 'ప్రేమ ఇష్క్ కాదల్' చూసిన డిస్ట్రిబ్యూటర్ ఒకాయన సినిమా చాలా బావుంది కాని యూత్ ఫుల్ సినిమాలు చేస్తే ఒక టికెట్ మాత్రమే తెగుతుంది. ఫ్యామిలీ సినిమా చేస్తే నాలుగు టికెట్స్ తెగుతాయని చెప్పారు. అందుకే ఓ కుటుంబ కథా చిత్రం చేయాలనుకున్నాను. నేను చెప్పిన లైన్ నచ్చి ప్రసాద్ గారు ఈ సినిమాను నిర్మించారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. శ్రవణ్ మంచి ఆల్బం ఇచ్చాడు. సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. అందరికి సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

నిర్మాత డా.వి.బి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''సావిత్రి' కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమాలో ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. కుటుంబ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. అందరు బాగా సపోర్ట్ చేశారు'' అని చెప్పారు.

శ్రవణ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో మెయిన్ హైలైట్ నారా రోహిత్ పాట పాడడమే. డెడికేటెడ్ పెర్సన్ తను. సాంగ్ కోసం ముందే ప్రిపేర్ అయ్యి వచ్చి పాడేసి వెళ్ళిపోయారు. నాకు మార్చాల్సిన అవసరం కూడా రాలేదు. ఈ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.

నందిత మాట్లాడుతూ.. ''శ్రవణ్ మంచి మెలోడియస్ మ్యూజిక్ ఇచ్చాడు. సావిత్రి రోల్ నాకిచ్చిన పవన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. రోహిత్ మంచి కో స్టార్. ప్రొడ్యూసర్ గారు లేకపోతే ఈ సినిమానే లేదు. సినిమా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ధన్య బాలకృష్ణ, రశ్మి, శ్రద్ధాదాస్, సాయి కార్తిక్, ప్రవీణ్ సత్తారు, సిద్ధూ, సత్యం రాజేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:వసంత్, డైలాగ్స్: కృష్ణ చైతన్య, సంగీతం: శ్రవణ్ , ఎడిటర్: గౌతం నెరుసు, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పవన్ సాదినేని, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: జాబిల్లి నాగేశ్వర రావు, నిర్మాత: డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement