Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ: సిద్ధు(గుంటూర్ టాకీస్)

Mon 29th Feb 2016 01:53 PM
siddhu jonnalagadda interview,guntur talkies,praveen sattharu  సినీజోష్ ఇంటర్వ్యూ: సిద్ధు(గుంటూర్ టాకీస్)
సినీజోష్ ఇంటర్వ్యూ: సిద్ధు(గుంటూర్ టాకీస్)
Advertisement

సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, శ్రద్దా దాస్ ప్రధాన పాత్రల్లో ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్ పై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎమ్.రాజ్ కుమార్ నిర్మిస్తున్న సినిమా 'గుంటూర్ టాకీస్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డతో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమాల్లోకి రావాలనే ప్లాన్ లేదు..

చిన్నప్పటి నుండి నాకు సినిమాల్లోకి రావాలనే కోరిక లేదు. అనుకోకుండా జరిగిపోయింది. మా అమ్మ 'ఆల్ ఇండియా రేడియో'లో వర్క్ చేసేవారు. అప్పుడు నాకు మ్యూజిక్ మీద చాలా ఆసక్తి ఉండేది. 5 సంవత్సరాల పాటు తబలా నేర్చుకున్నాను. 

అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను..

'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాకు సంబంధించిన ఒక వ్యక్తిని కలవడానికి వెళ్లాను. అప్పుడు డైరెక్టర్ గారు నన్ను చూసి ఆడిషన్ చేసి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు ఎంపిక చేశారు. ఆ తరువాత 'ఆరెంజ్' సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా సినిమాల్లోకి రావడం జరిగింది. ఆ తరువాత తమిళంలోని ఆస్కార్ రవిచంద్రన్ గారి సినిమా 'వలినం' సినిమాలో నటించాను.

సింపుల్ గా డెవలప్ చేశాం..

ప్రవీణ్ సత్తారు గారి 'లైఫ్ బిఫోర్ వెడ్డింగ్' సినిమాలో నటించాను. అసలు మొదట గుంటూర్ టాకీస్ అనే సినిమానే లేదు. చందమామ కథలు సినిమా రిలీజ్ అయిన తరువాత మాస్ కు కనెక్ట్ అయ్యే సినిమా చేస్తే బావుంటుందని ప్రవీణ్ తో చెప్పాను. ఆయన కథలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అంతే సెటిల్డ్ గా ఉంటూ.. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా సింపుల్ గా కథను డెవలప్ చేశాం. 

మురికివాడలో ప్లేబాయ్ పాత్ర..

ఈ సినిమాలో హరి అనే పాత్రలో నటించాను. స్లంలో ఉండే ప్లేబాయ్ పాత్ర అది. అక్కడ ఉండే ప్రతి అమ్మాయితో తనకు అఫైర్ ఉంటుంది. మెడికల్ షాప్ లో పని చేసే హరికి ప్రతీది దొంగిలించడం అలవాటు. తను పని చేసే షాప్ లోనే దొంగతనం చేస్తూ ఉంటాడు. తనతో పాటు గిరి అనే మరో వ్యక్తి కూడా ఉంటాడు. ఇద్దరు కలిసే దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఈ సినిమా ఇద్దరు దొంగ వెధవల దరిద్రమైన కథ అని చెప్పొచ్చు. ఒక ఇన్సిడెంట్ తో వారిద్దరి జీవితాల్లో మార్పు వస్తుంది. అదేంటనేది.. సినిమాలోనే చూడాలి.

గుంటూర్ లో చేసే రచ్చ..

ఈ కథంతా గుంటూరులోనే జరుగుతుంది. సినిమాలో చాలా డ్రీం ఉంటుంది. ఒక పాయింట్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇదంతా సినిమాటిక్ గా ఉంటుంది. అందుకే గుంటూర్ టాకీస్ అని పేరు పెట్టాం. హరి, గిరిలు పడే బాధలు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది.

డైలాగ్స్ రాశాను..

ఈ సినిమాలో గుంటూర్ టాకీస్ ర్యాపో సాంగ్ నేను పాడాను. అంతేకాకుండా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాను. ఒక పాటలో సాంగ్ లిరిక్స్ తో పాటు స్క్రిప్ట్ వర్క్, కొన్ని డైలాగ్స్ కూడా రాశాను.   

ఏ సర్టిఫికేట్ వచ్చింది..

సినిమాకు సెన్సార్ వారు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. 18 సంవత్సరాల వయసు తక్కువ వారు చూడకూడదు. కాని ఏ వయసు వారైనా.. తమ ఫ్రెండ్స్ తో చూస్తే సినిమా ఎంజాయ్ చేస్తారు. రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంటుంది. కాని వల్గర్ గా ఉండదు. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఇప్పటివరకు ఏది కమిట్ కాలేదు. లీడ్ క్యారెక్టర్స్ లోనే నటించాలనుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement