Advertisement

'మలుపు'కి గెలుపు!

Tue 23rd Feb 2016 04:19 PM
malupu success meet,raviraja,sathya prabhas,aadi  'మలుపు'కి గెలుపు!
'మలుపు'కి గెలుపు!
Advertisement

ఆది పినిశెట్టి, నిక్కి గల్రాని జంటగా ఆదర్శ చిత్రాలయ బ్యానర్ పై సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం 'మలుపు'. ఫిబ్రవరి 19 న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ.. ''లాభాల రావాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేయలేదు. నా కొడుకులు మంచి స్థాయికి ఎదగాలని చేశాను. సత్య, ఆది లకు ఈ సినిమాతో మంచి పేరొచ్చింది. నేను ఉద్దేశ్యంతో సినిమా చేసానో అది ఈరోజు నెరవేరింది. సక్సెస్ చేసిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను'' అని చెప్పారు.

సత్య ప్రభాస్ మాట్లాడుతూ.. ''మలుపును గెలిపించిన ఆడియన్స్ కు నా కృతజ్ఞతలు. కంటెంట్ ను నమ్ముకొని సినిమా చేశాం. ఆడియన్స్ వరకు ఈ సినిమాను తీసుకువెళ్లగా.. మంచి ఆదరణ లభించింది. సినిమాను కొత్తగా చేద్దాం.. హిట్ అయితే మరిన్ని సినిమాలు చేయోచ్చనే ఆలోచనతో తీశాం. స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. టీం అందరు బాగా సపోర్ట్ చేశారు. నన్ను నమ్మి సినిమా బడ్జెట్ దాటుతున్న నాన్నగారు ఈ సినిమాను నిర్మించారు'' అని చెప్పారు.

ఆది మాట్లాడుతూ.. ''వైశాలి, గుండెల్లో గోదారి, మృగం లాంటి డిఫరెంట్ సినిమాలు చేశాను. మొదటిసారి నేను రియల్ లైఫ్ లో ఎలా ఉంటానో.. అలాంటి పాత్రలో నటించాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బావుందని చెబుతున్నారు. కథను కొత్తగా ప్రెజంట్ చేయాలని మేము చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. ఇండస్ట్రీలో మార్పులు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా కొత్తదనాన్నే కోరుకుంటున్నారు'' అని చెప్పారు. 

నిక్కీ గల్రాని మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో మంచి పాత్రలో నటించాను. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని సినిమా చేశాం. సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రిచా, శ్రవణ్, హరీష్ ఉత్తమన్, ప్రసన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement