Advertisementt

'లవ్ చెయ్యాలా వద్దా..?'ఆడియో లాంచ్!

Sun 14th Feb 2016 11:59 PM
love cheyyala vodda movie audio launch,noushad,karthik  'లవ్ చెయ్యాలా వద్దా..?'ఆడియో లాంచ్!
'లవ్ చెయ్యాలా వద్దా..?'ఆడియో లాంచ్!
Advertisement
Ads by CJ

కార్తిక్ హీరోగా జికె సినిమాస్ ప‌తాకంపై జి.నౌషాద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ల‌వ్ చెయ్యాలా వద్దా..?. జి.వి.ర‌మ‌ణ‌, సి.సంతోష్ కుమారి నిర్మాత‌లు. ఈ సినిమా ఆడియో వేడుక శనివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ బిగ్ సీడీను, ఆడియో సీడీల‌ను ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా..

తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. ''వైజాగ్ ప్రాంతానికి చెందిన వారంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు. చిన్న సినిమాలు స‌క్సెస్ అయితే చాలా మంది నిర్మాత‌లు సినిమాలు తీయడానికి ముందుకొస్తారు. ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలి. వైజాగ్ కూడా సినిమా హ‌బ్ కావాలి'' అని చెప్పారు.

క‌ల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ''పెద్ద సినిమాలు హిట్ అయితే బాక్సాఫీస్‌కి రెవెన్యూ వ‌స్తుంది. అదే చిన్న సినిమాలు హిట్ అయితే చాలా మంది స్ఫూర్తి పొందుతారు'' అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు జి.నౌషాద్ మాట్లాడుతూ.. ''సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మా సినిమా ఖచ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''వైజాగ్‌లో టాలెంట్‌కి లోటు లేదు. హాలీవుడ్ స్థాయిలో వైజాగ్ కు మంచి పేరు రావాలి'' అని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో నందిని రెడ్డి, బ‌సిరెడ్డి, సుధాక‌ర్, స్నిగ్ధ‌, త్రినాథ‌రావు న‌క్కిన త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ