Advertisementt

మార్చి 4న 'టెర్రర్'..!

Wed 10th Feb 2016 02:01 PM
terror movie,releasing on march 4th,srikanth,satish kasetti  మార్చి 4న 'టెర్రర్'..!
మార్చి 4న 'టెర్రర్'..!
Advertisement

శ్రీకాంత్, నికితా జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన సినిమా 'టెర్రర్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 4న విడుదలకు సిద్ద్మగా ఉంది. ఈ సందర్భంగా..

దర్శకుడు సతీష్ కాసెట్టి మాట్లాడుతూ.. ''ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో టెరరిజం సమస్య ఉంది. హైదరాబాద్ లో ఓ టెర్రర్ యాక్టివిటీ జరుగుతుందని తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఎలా ఆ బాంబ్ బ్లాస్ట్ ను చేదించాడు అనేదే ఈ సినిమా. 'టెర్రర్' అనేది టెరరిజం బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ పోలీస్ కథ. మార్చి 4న సినిమా రిలీజ్ అవుతోంది. అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. ''ఖచ్చితంగా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఒక క్లీన్ ఫిలిం. సినిమాకు అవార్డ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కమర్షియల్ ఫార్మాట్ లో ఉండే సినిమా. అవుట్ పుట్ బాగా వచ్చింది. సతీష్ బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా మంచి విజయం సాధించి నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నిర్మాత షేక్ మస్తాన్ మాట్లాడుతూ ''నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. సరైన సమయంలో సినిమాను రిలీజ్ చేయాలని ఆలోచించి మార్చి 4న రిలీజ్ చేస్తున్నాం. అందరి ఆశీస్సులతో అఖండ విజయం సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

లక్ష్మి భూపాల్ మాట్లాడుతూ.. ''అందరు ఇష్టపడి చేసిన సినిమా. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది. మంచి కాన్సెప్ట్ ఉన్న ఫిలిం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల్, ఎడిటర్: బసవ పైడి రెడ్డి, ఆర్ట్: మురళి కొండేటి, ఫైట్స్: రన్ జాషువా, మ్యూజిక్: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్: షేక్ జైన్ లాబ్దీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి అయినీడి, ప్రొడ్యూసర్: షేక్ మస్తాన్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సతీష్ కాసెట్టి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement