Advertisementt

'క్షణం' ఫంక్షన్ కి మహేష్, సమంతా..!

Tue 09th Feb 2016 11:31 AM
kshanam theatrical trailer,mahesh babu,samantha  'క్షణం' ఫంక్షన్ కి మహేష్, సమంతా..!
'క్షణం' ఫంక్షన్ కి మహేష్, సమంతా..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది.  మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్  బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ డ్రామా 'క్షణం'. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. ఈసినిమా ట్రైలర్ ను సూపర్  స్టార్ మహేష్, సమంతల చేతుల మీదుగా ఫిభ్రవరి 10న విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలియజేశారు. రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు అడవి శేష్ కథను అందించారు. సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అడవిశేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి స్టోరీ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు, అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ