Advertisement

'స్పీడున్నోడు' సక్సెస్ మీట్!

Mon 08th Feb 2016 04:50 PM
speedunnodu movie success meet,sai srinivas,bheemaneni srinivas  'స్పీడున్నోడు' సక్సెస్ మీట్!
'స్పీడున్నోడు' సక్సెస్ మీట్!
Advertisement

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సొనారిక జంటగా తమిళ 'సుందరపాండ్యన్' కు రీమేక్ గా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'స్పీడున్నోడు'. భీమనేని సునీత నిర్మాత. ఫిబ్రవరి 5న విడుదల చేసిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా..

భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''సినిమా అన్ని థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. టీం ఎఫర్ట్ వలనే ఈ విజయం సాధ్యమైంది. ప్రకాష్ రాజ్ గారితో 'సుస్వాగతం' సినిమా చేశాను. ఆ సినిమాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. ఆ తరువాత చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో ఇద్దరం కలిసి పని చేశాం. తండ్రి పాత్రలో ప్రకాష్ గారి నటన అధ్బుతం. ఫ్యామిలీస్, యూత్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరు మనసు పెట్టి చేసిన సినిమా. మంచి కథను తీసుకొని ఆసక్తికరంగా ప్రెజంట్ చేయడంలో సక్సెస్ అయ్యాం. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ '' అని చెప్పారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ''మంచి మెమొరబుల్ రోల్స్ లో నటించే అవకాశం ఇస్తున్న భీమనేని శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు. సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన భీమనేని గారికి థాంక్స్. మా టీం అందరికి శుభాకాంక్షలు. అందరు హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసిన సినిమా. 'అల్లుడు శీను' తరువాత చాలా గ్యాప్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. అందరు చాలా బాగా నటించావని చెబుతుంటే పెద్ద అచ్చీవ్మెంట్ లా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వసంత్, మధునందన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: డి.జె.వసంత్, ఎడిటర్: గౌతంరాజు, కెమెరామెన్: విజయ్ ఉలాగనథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల, మాటలు: భీమనేని శ్రీనివాసరావు, ప్రవీణ్ వర్మ, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నే, నిర్మాత: భీమనేని సునీత, స్టొరీ డెవలప్మెంట్-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: భీమనేని శ్రీనివాసరావు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement